ఆర్థిక మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 కారణ‌ ఒత్తిడిని తగ్గించడానికి పన్ను మినహాయింపు

Posted On: 19 JUL 2021 6:52PM by PIB Hyderabad

 

కోవిడ్‌-19 చికిత్స కోసం యజమాని నుండి లేదా ఏదైనా వ్యక్తి నుండి అయినా వైద్య చికిత్స కోసం పన్ను చెల్లింపుదారు తీసుకున్న మొత్తానికి.. ఆదాయపు పన్ను మినహాయింపుల‌ను  ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2019-20 ఆర్థి సంవత్సరం, ఆ తరువాతి సంవత్సరాల‌కు ఈ మిన‌హాయింపుల‌ను అందించ‌నున్నారు. ఈ రోజు లోక్‌సభలో అడిగిన ఒక‌ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఈ విషయాన్ని స‌భ‌కు వెల్లడించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం, ఆ తరువాతి సంవత్సరాల్లో కోవిడ్‌-19 చికిత్స కోసం యజమాని నుండి లేదా ఏ వ్యక్తి నుండి అయినా వైద్య చికిత్స కోసం తీసుకున్న మొత్తం పై పన్ను చెల్లింపుదారు మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపులు ఇస్తారు  అని మంత్రి పేర్కొన్నారు. ఈ మినహాయింపు యొక్క ముఖ్య లక్ష్యం కోవిడ్‌-19 కారణంగా బాధపడుతున్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం. కోవిడ్‌-19 వైర‌స్ బారిన ప‌డిన  ప‌న్ను చెల్లింపుదారు యజమాని లేదా ఏదైనా వ్యక్తి నుండి సహాయం తీసుకున్న ఆ తరువాత వైద్య చికిత్సకు ఆ మొత్తం చెల్లించాల్సి వ‌స్తోంది. దీనివ‌ల్ల స‌ద‌రు ప‌న్ను చెల్లింపుదారు అనేక వ్య‌య‌ప్ర‌యాస‌లు ప‌డాల్సి వ‌స్తోంది. దీని నుంచి ఆర్థిక ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌డమే దీని ధ్యేయం.
నగదు లావాదేవీలను నిరుత్సాహపరచడం, తక్కువ నగదు లావాదేవీల ఆర్థిక వ్యవస్థ వైపు తీసుకువెళ్ల‌డ‌మ‌నే ప్రభుత్వం ప్రకటించిన విధానం. అందువల్ల, ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని వివిధ నిబంధనల ప్రకారం అనుమతించదగిన నగదు లావాదేవీల పరిమితిని ఇక‌పై పెంచే ప్రతిపాదనేదీ లేదని మంత్రి పేర్కొన్నారు.కోవిడ్‌-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన పన్ను చెల్లింపుదారుల కుటుంబ సభ్యులకు ఉపశమనం కలిగించడానికి, కుటుంబం అందుకున్న ఎక్స్-గ్రేటియా చెల్లింపుకు ఆదాయపుపన్ను మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ మంత్రి మరిన్ని వివరాలను తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మరియు తరువాతి సంవత్సరాల్లో కోవిడ్‌-19 కారణంగా మరణించిన వ్యక్తి యొక్క యజమాని నుండి లేదా ఇతర వ్యక్తి నుండి సభ్యుల‌కు ఉప‌శ‌మ‌నం క‌ల్పించేలా ఈ మిన‌హాయింపును క‌ల్పించ‌నున్నారు. ఈ
త‌రహా మినహాయింపు యజమాని నుండి పొందిన మొత్తానికి ఎటువంటి పరిమితి లేకుండా అనుమతించబడుతుంది. ఇతర వ్యక్తుల నుండి తెచ్చిన రూ.10 లక్షల సొమ్ము మొత్తానికి
ఈ ప‌న్ను మిన‌హాయింపులు వ‌ర్తిస్తుంది. కోవిడ్‌-19 మహమ్మారి ప్రభావం కారణంగా ప్రభుత్వం వివిధ కీలక పన్ను సమ్మతి గడువులను పొడిగించిందని మంత్రి అన్నారు. ఈ పొడిగించిన కాలక్రమాల వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డాయి.

***


(Release ID: 1737082) Visitor Counter : 182


Read this release in: English , Urdu , Punjabi