ఆర్థిక మంత్రిత్వ శాఖ

బ్యాంక్ పుస్తకాల్లోని భారాన్ని తగ్గించే చర్యగా నిరర్ధక ఆస్తుల కోసం 'బ్యాడ్ బ్యాంక్' ప్రారంభం

Posted On: 19 JUL 2021 7:04PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం అన్ని ఆమోదాలు, లాంఛనాలతో 'బ్యాడ్ బ్యాంక్‌'ను ప్రారంభించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డా.భగవత్ కిషన్‌రావ్‌ కరాద్ ఈ విషయాన్ని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా వెల్లడించారు.

    కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్, 2021-22 బడ్జెట్‌ ప్రసంగంలో ఈ క్రింది ప్రకటన చేశారు:

    "ఖాతా పుస్తకాల్లోని భారాన్ని తగ్గించేందుకు, పెద్ద మొండి బకాయిల (నిరర్ధక ఆస్తులు) వసూళ్ల చర్యలను ప్రభుత్వ రంగ బ్యాంకులు కోరుతున్నాయి. ప్రస్తుతమున్న నిరర్ధక ఆస్తులను ఏకీకృతం చేయడానికి, స్వాధీనం చేసుకోవడానికి "అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ"ని ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత, నిరర్ధక ఆస్తులను నిర్వహించి, వాటి విలువ నిర్ధరణ కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులకు, ఇతర పెట్టుబడిదారులకు బదిలీ చేస్తాం.”

    'నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్' (ఎన్‌ఐఆర్‌సీఎల్‌)ను 07.07.2021న 'రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌' వద్ద నమోదు చేసినట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) వివరించిందని మంత్రి పేర్కొన్నారు.

    అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీస్‌ (ఏఆర్‌సీ) నియంత్రణ సంస్థగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏఆర్‌సీల కోసం ఇప్పటికే విధివిధానాలను నిర్దేశించింది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ నిరర్ధక ఆస్తులను ఏఆర్‌సీలకు బదిలీ చేయడానికి చక్కటి నిబంధనలు ఉన్నాయి. ఏఆర్‌సీల ద్వారా నిరర్ధక ఆస్తుల గుర్తింపు అనేది కొనసాగుతున్న ప్రక్రియగా కేంద్ర మంత్రి తెలిపారు.
 

****(Release ID: 1737079) Visitor Counter : 66


Read this release in: English , Urdu , Punjabi