ఆర్థిక మంత్రిత్వ శాఖ
రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధుల బదిలీ
Posted On:
19 JUL 2021 6:53PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు (సీఎస్‌ఎస్), కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు
(సీఎస్), ఆర్థిక సంఘం గ్రాంట్లు (ఎఫ్‌సీ), ఇతర గ్రాంట్లు, అప్పులు, బదిలీల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు అందజేస్తుంది. కేంద్ర స్థూల బడ్జెట్‌కు లోబడి, ఆయా పథకాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ బదిలీలు ఉంటాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు సమర్పించారు.
కేంద్ర బడ్జెట్ 2020-21 (సవరించిన అంచనాలు-ఆర్‌ఈ), 2021-22 (బడ్జెట్ అంచనాలు-బీఈ) ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందిన నిధుల వివరాలను కేంద్ర మంత్రి లోక్‌సభకు సమర్పించారు. ఆ వివరాలు:
(రూ.కోట్లలో)
క్ర.సం.
|
రాష్ట్రాలకు అందిన కేంద్ర నిధుల స్వభావం
|
2020-21 (ఆర్‌ఈ)
|
2021-22 (బీఈ)
|
-
|
పన్నులు మినహా మొత్తం బదిలీలు
|
713014.40
|
674253.42
|
|
వీటిలో
|
|
|
-
|
కేంద్ర ప్రాయోజిత పథకాలు
|
315238.00
|
318857.20
|
-
|
కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు
|
42374.08
|
43016.21
|
-
|
ఆర్థిక సంఘం నిధులు
|
182352.43
|
220843.00
|
నిధులను వినియోగం, వ్యయం సమర్థవంతంగా ఉండేలా సంబంధిత పథకానికి ప్రత్యేకించిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు ఆయా పథకాల అమలును పర్యవేక్షిస్తాయని కేంద్ర మంత్రి తన సమాధానంలో లోక్‌సభకు వివరించారు.
***
(Release ID: 1736994)