పర్యటక మంత్రిత్వ శాఖ
భారతదేశంలో గ్రామీణ పర్యాటక అభివృద్ధి కోసం రూపొందించిన ముసాయిదా జాతీయ వ్యూహం, కార్యాచరణ ప్రణాళికలపై పర్యాటక మంత్రిత్వ శాఖ సూచనలు / సలహాలను ఆహ్వానిస్తోంది : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
Posted On:
19 JUL 2021 4:49PM by PIB Hyderabad
గ్రామీణ పర్యాటక రంగానికి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని గుర్తించిన కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, ఈ సముచిత ప్రాంత ఉన్నతికి, అభివృద్ధికి చురుకుగా కృషి చేస్తోంది.
ఆత్మనిర్భర్ భారత్ దిశగా - భారతదేశంలో గ్రామీణ పర్యాటక రంగ అభివృద్ధికి, పర్యాటక మంత్రిత్వ శాఖ, ఒక ముసాయిదా జాతీయ వ్యూహం మరియు కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. "వోకల్-ఫర్-లోకల్" స్ఫూర్తితో ముందుకు సాగే, గ్రామీణ పర్యాటక రంగం, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనకు గణనీయంగా దోహదపడుతుంది.
దేశంలో గ్రామీణ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి, గ్రామీణ పర్యాటక రంగం కోసం నమూనా విధానాలు మరియు ఉత్తమ పద్ధతులు; గ్రామీణ పర్యాటక రంగం కోసం డిజిటల్ సాంకేతికతలు మరియు వేదికలు; గ్రామీణ పర్యాటక రంగం కోసం సమూహాలను అభివృద్ధి చేయడం; గ్రామీణ పర్యాటకానికి మార్కెటింగ్ మద్దతు; భాగస్వాముల సామర్థ్యం పెంపు, పరిపాలన; సంస్థాగత వ్యవస్థ వంటి కీలక అంశాలపై, ఈ వ్యూహం దృష్టి కేంద్రీకరిస్తుంది.
ఈ పత్రాన్ని మరింత సమగ్రంగా రూపొందించడానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాల నుండి ముసాయిదా జాతీయ వ్యూహం మరియు కార్యాచరణ ప్రణాళికపై కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, అభిప్రాయాలు / సూచనలు / సలహాలను ఆహ్వానిస్తోంది.
అదేవిధంగా, దేశంలో గ్రామీణ పర్యాటక సామర్థ్యాన్ని గుర్తిస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయడంతో పాటు, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు దేశంలోని గ్రామీణ అంశాల సంగ్రహావలోకనాన్ని అందుబాటులోకి తీసుకు రావడం కోసం, పర్యాటకాన్ని ఒక శక్తివంతమైన మార్గంగా అభివృద్ధి చేయడాన్ని లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేయడానికి, స్వదేశీ దర్శన్ పథకం కింద గ్రామీణ ప్రాంతాన్ని ప్రతిపాదిత ప్రదేశాలలో ఒకటిగా, పర్యాటక మంత్రిత్వ శాఖ, గుర్తించింది.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ఈ రోజు లోక్ సభకు లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో, ఈ సమాచారాన్ని పొందుపరిచారు.
*****
(Release ID: 1736990)
Visitor Counter : 244