వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

రాబోయే సంవత్సరాల్లో పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం నాయకత్వ పాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన - శ్రీ పీయూష్ గోయల్

Posted On: 16 JUL 2021 7:39PM by PIB Hyderabad

"ఆత్మ నిర్భర్ భారత్ - పునరుత్పాదక ఇంధన తయారీ కోసం స్వావలంబన" అనే అంశంపై 2వ సదస్సు ముగింపు సమావేశంలో, ఈ రోజు, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, వస్త్ర శాఖల మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ప్రసంగించారు.

రాబోయే సంవత్సరాల్లో పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం నాయకత్వ పాత్ర పోషిస్తుందన్న పూర్తి నమ్మకం తమకు ఉన్నట్లు, మంత్రి, పేర్కొన్నారు.  ఈ రంగంలో, దేశంలో సాధించిన పురోగతి గురించి, ఆయన మాట్లాడుతూ, ప్రారంభ దశలో ఉన్న జలశక్తి నుండి, మేము ఇప్పటికే భవిష్యత్తును పరిశీలిస్తున్నామనీ, హైడ్రోజన్ సాంకేతికతలలో పాల్గొనడం ప్రారంభించామనీ, చెప్పారు.  హరిత విద్యుత్ వనరుల నుండి హైడ్రోజన్ ఉత్పత్తి కోసం 2021-22 లో హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ ప్రారంభించబడింది.  ఎల్‌.ఈ.డీ. మిషన్ - ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని మరో విజయగాథ అని ఆయన అన్నారు.  ఎల్‌.ఈ.డీ. దీపాలు దేశానికి బిలియన్ డాలర్ల మేర విద్యుత్ బిల్లులను ఆదా చేసాయి.  ఒక దేశంగా, ఇది ప్రతి సంవత్సరం మన కర్బన ఉద్గారాలను 120 మిలియన్ టన్నులకు తగ్గించింది: "దీన్ని మనం పెంపొందించడంతో పాటు, దేశవ్యాప్తంగా వేగంగా విడుదల చేయగలిగాము" అని, ఆయన చెప్పారు.

ఎలక్ట్రిక్ కార్ల ఆటోమొబైల్ వినియోగదారులను పగటిపూట పునరుత్పాదక శక్తి లేదా సౌరశక్తిని ఉపయోగించి వారి బ్యాటరీలను రీఛార్జ్ చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నట్లు శ్రీ గోయల్ చెప్పారు, దీని కోసం దేశంలోని గ్యాస్ స్టేషన్ల లో పెద్ద సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించాలని, పరిశీలిస్తున్నాము.

మన సుస్థిరత మిషన్ మరియు పునరుత్పాదక శక్తి మరింత పురోగతి చెందడానికి బ్యాటరీ సాంకేతికత చాలా ముఖ్యమైనదని, అందువల్ల, మనం ఇప్పుడు బ్యాటరీలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాము.

2023-24 నాటికి మన పెట్రోల్ ఉత్పత్తుల్లో ఇథనాల్‌ను 20 శాతం మిళితం చేయబోతున్నామని మంత్రి చెప్పారు.  100 శాతం వరకు ఇథనాల్ తీసుకునే వాహనాలను కలిగి ఉండటమే మన అంతిమ లక్ష్యం అని ఆయన అన్నారు.  "మా ఆలోచన ఏమిటంటే, మన అభివృద్ధి లక్ష్యాలు ప్రభావితం కాని విధంగా, భారతదేశం తన విద్యుత్ అవసరాలను మరింత స్థిరమైన పద్ధతిలో తీర్చడంతో పాటు,  విద్యుత్ ఖర్చును సమతుల్యం చేయడం.  2022 నాటికి మొత్తం పునరుత్పాదక ఇంధన లక్ష్యం 175 గిగావాట్ల నుండి, భారతదేశం ఇప్పుడు 2030 నాటికి 450 గిగావాట్లు సాధించాలని చూస్తోంది ”, అని ఆయన వివరించారు. 

పునరుత్పాదక ఇంధన రంగంలో దేశం సాధించిన పురోగతి గురించి, శ్రీ గోయల్ ప్రస్తావిస్తూ,  అనేక దశాబ్దాల క్రితం, జల విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించే ప్రారంభ దేశాలలో భారతదేశం ఒకటి గా ఉందనీ, మొట్ట మొదటి చిన్న హైడ్రో పవర్ ప్లాంట్ 1897 లో డార్జిలింగ్ లో పనిచేయడం ప్రారంభించిందనీ, చెప్పారు.  బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి దార్శనికులు నీరు, విద్యుత్ శక్తి అభివృద్ధికి సంబంధించి అఖిల భారత విధానానికి పునాది వేశారని ఆయన అన్నారు.  ఆ తరువాత, భారతదేశం పెద్ద ఎత్తున గాలి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.  గాలి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే పరికరాలు మొదట్లో దిగుమతి అయ్యేవి, అయితే, ఆ తర్వాత ఈ పరికరాల అవసరం పెరిగే కొద్దీ, మనమే వాటి ఉత్పత్తికి, అతిపెద్ద తయారీదారులలో ఒకరిగా మారాము.  పునరుత్పాదక విద్యుత్ రంగంలో సౌర విద్యుత్తు  తృతీయ ప్రత్యామ్నాయం గా ఉందని, శ్రీ గోయల్ చెప్పారు.  ప్రారంభంలో, వీటి ధరలు చాలా ఎక్కువగా ఉండటంతో, చాలా మంది ప్రజలు దీనిని చేపట్టడానికి ముందుకు రాలేదు.  ప్రపంచం కర్బనం నుండి దూరంగా ఉండవలసిన అవసరం ఉందని, సౌర విద్యుత్  సామర్థ్యాన్ని గుర్తించిన అతి కొద్ది మంది నాయకుల లో, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ ఒకరు. అధిక మొత్తంలో సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయాలని భారతదేశం నిర్ణయించుకుందని, ఇది క్రమంగా భారతదేశంలో సౌర పరికరాల తయారీ కి దారితీసిందని ఆయన పేర్కొన్నారు.  "దిగుమతులు క్రమంగా తగ్గుతూ ఉండటంతో, ధరలు గణనీయంగా తగ్గాయి. భారీ స్థాయిలో లావాదేవీలు జరగడంతో, భారతదేశంలో ప్రపంచంలోని ఉత్తమ సంస్థలను పొందగలిగాము.  భారతదేశంలో పెట్టుబడులు వచ్చాయి. పోటీ ధరలను పొందగలిగాము. దిగుమతులను అనుమతించాము.” అని, శ్రీ గోయల్ వివరించారు. 

చారిత్రాత్మకంగా, భారతీయులు ప్రకృతిని ఎప్పుడూ గౌరవిస్తారని శ్రీ గోయల్ అన్నారు.  మనకు, పర్యావరణ సంరక్షణ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ప్రతి భారతీయునికి, అది, అంతర్గతంగా ఉంటుంది.  మన సంస్కృతి, మన సాంప్రదాయ పద్ధతులు, మన జీవన విధానం ఈ చైతన్యాన్ని ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు.  భారతీయ గృహాలకు వ్యర్థాలు ఆమోదయోగ్యం కాదు, రీ-సైక్లింగ్, పునర్వినియోగం అనేవి సహజంగా ప్రతి భారతీయ కుటుంబానికి అలవాటు.  నదులు, సూర్యరశ్మి, గాలి, రుతుపవనాలు మొదలైన వాటిలో మన దేశం కూడా ప్రకృతి ఆశీర్వాదాలను కలిగి ఉందని మంత్రి పేర్కొన్నారు.

*****


(Release ID: 1736394) Visitor Counter : 211


Read this release in: English , Urdu , Marathi , Hindi