ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం: అపోహలూ, వాస్తవాలూ


సార్వత్రిక టీకాలతో సహా కోవిడేతర కార్యక్రమాలకూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రాధాన్యం

2021 తొలి త్రైమాసికంలో 99% డిటిపి3 పూర్తిచేసిన భారత్; అత్యధిక సాధనలో ఇప్పటివరకూ ఇదే రికార్డ్

Posted On: 16 JUL 2021 6:04PM by PIB Hyderabad

కోవిడ్ -19 కారణంగా లక్షలాది మంది పిల్లలు ఇతర ముఖ్యమైన టీకాలకు దూరమయ్యారని, దానివలన భవిష్యత్తులో వారు అనేక వ్యాధుల బారినపడి మరణించే ప్రమాదం ఉందంటూ ఆరోపణలతో కూడిన మీడియా వార్తలు వెలువడుతున్నాయి.

ఈ వార్తలు నిరాధారమైనవి, వాస్తవానికి భిన్నమైనవి.

కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ సార్వత్రిక టీకాల కార్యక్రమం  కింద రకరకాల టీకాలివ్వటం సహా అన్ని అత్యవసర సేవలమీద ప్రత్యేక దృష్టి కొనసాగిస్తూనే ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.  ఈ మంత్రిత్వశాఖ అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అభివృద్ధి భాగస్వాములతో కలసి కోవిడ్-19 ప్రతికూల ప్రభావాలమీద విశేషంగా కృషి చేసింది. తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను సమీక్షించి పిల్లలందరికీ ప్రాణాలు కాపాడే టీకాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంది.

పైగా భారత ప్రభుత్వం, ప్రజారోగ్య సిబ్బంది కనబరచిన అంకిత భావం కారణంగా దేశంలో ఈఏడాది మొదటి త్రైమాసికం ( 2021 జనవరి-మార్చి) లో 99% డిటిపి3 టీకాలు పూర్తి చేయగలిగారు. ఇప్పటివరకు అత్యధికంగా డిటిపి3 కవరేజ్ లో ఇదే రికార్డు స్థాయి కావటం గమనార్హం. 

సార్వత్రిక టీకాల కార్యక్రమం అమలు మీద  కోవిడ్ టీకాల ప్రభావం పడకుండా ఉండేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. వాటిలో కొన్ని: 

·        కోవిడ్ సంక్షోభ సమయంలోనూ పోలియీ అనుబంధ టీకాల కార్యక్రమం కొనసాగేలా జాతీయ మార్గదర్శకాలు జారీ అయ్యాయి.

·        కొత్త మార్గదర్శకాల మీద రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి శిక్షణాతరగతులు నిర్వహించి కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా సురక్షితంగా టీకాలు వేయటం గురించి చెప్పారు. 

·        టీకాలు తీసుకోకుండా మిగిలిపోయిన వారిని గుర్తించి కారణాలు తెలుసుకోవటానికి, టీకాల కార్యక్రమం పర్యవేక్షించటానికి వీలుగా జిల్లా, రాష్ట స్థాయి టాస్క్ ఫోర్స్ లు పనిచేస్తూ దిద్దుబాటు చర్యలు తీసుకుంటాయి.

·        ఎక్కువ రిస్క్ కు గురయ్యే అవకాశమున్నవారు, ప్రాంతాలు ( కోవిడ్ సమయంలో టీకాలు మిస్సయిన పిల్లలు, టీకాలతో నిరోధించగలిగే వ్యాధులు ఎక్కువగా ప్రబలే జిల్లాలు, టీకాలు తక్కువగా వేసిన జిల్లాలు) గుర్తించి వాటిమీద దృష్టి సారించటం. 

·        ఎక్కువ రిస్క్  ఉండే జిల్లాలుగా గుర్తించిన 250 జిల్లాల్లో టీకాల కార్యక్రమం ఉద్ధృతం చేయటం ద్వారా 9,5 లక్షలమంది పిల్లలకు, 2.24 లక్షలమంది గర్భిణులకు  టీకాలిచ్చారు. 

·        పోలియో నిరోధక టీకాలివ్వటానికి ఒక ఒక జాతీయ టీకాల రౌండ్, ఇంకొక ఉప జాతీయ టీకాల రౌండ్ చేపట్టారు. 

·        కోవిడ్-19 కోసం ఒక రిస్క్ కమ్యూనికేషన్, కమ్యూనిటీ ఎంగేజ్ మెంట్ స్ట్రాటెజీ ని రూపొందించి అమలు చేశారు. కోవిడ్ యోధులకు, శాఖాపరమైన సిబ్బందికి అనుగుణంగా సామర్థ్యం పెంపు దిశగా మాడ్యూల్స్ తయారుచేశారు. ఆ విధంగా టీకాలతోసహా అత్యవసర కార్యకలాపాలు చేపట్టటానికి వెసులుబాటు కల్పించారు.

 

*****


(Release ID: 1736316) Visitor Counter : 166


Read this release in: English , Marathi , Hindi , Kannada