ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 అప్‌డేట్
Posted On:
16 JUL 2021 9:13AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా కోవిడ్ జాతీయవాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా 39.55 కోట్ల వాక్సిన్ డోస్‌లను వేయడం జరిగింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,01,83,876 మంది కోవిడ్‌నుంచి కోలుకున్నారు.
కోవిడ్‌నుంచి రికవరీ రేట్ 97.28 శాతానికి పెరిగింది.
గత 24 గంటలలో 40,026 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఇండియాలో గత 24 గంటలలో 38,949 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇండియాలో క్రియాశీలకేసుల సంఖ్య ప్రస్తుతం 4,30,422 గా ఉంది.
యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం కేసులలో 1.39 శాతం గా ఉంది.
వారపు పాజిటివిటీ రేటు 5శాతంకంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.14 శాతం .
రోజువారి పాజిటివిటీ రేటు 1.99 శాతం. వరుసగా 25 రోజులుగా ఇది 3 శాతం కంటే తక్కువగా ఉంది.
దేశంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటివరకు 44 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.
***
(Release ID: 1736086)