విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్ యూనిట్లకు పైగా సంచిత ఉత్పత్తిని సాధించిన ఎన్‌టీపీసీ


- ఇది మెరుగైన పనితీరు, విద్యుత్ డిమాండ్ పెరుగుదలకు సంకేతంగా నిలుస్తుంది

Posted On: 15 JUL 2021 2:44PM by PIB Hyderabad

 

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్‌టీపీసీ గ్రూప్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో 100 బిలియన్ యూనిట్ల (బీయూల‌) సంచిత ఉత్పత్తిని సాధించింది. ఈ ప‌రిణామం సంస్థ‌ ఆపరేషన్‌లో రాణించడంలో సమూహం యొక్క నిబద్ధతను బలోపేతం చేస్తుంది. గత సంవత్సరం 2020 ఆగస్టు 7న గ్రూప్ జనరేషన్ 100 బి.యు.ల‌ను దాటింది, ఇది మెరుగైన పనితీరును మరియు ప్రస్తుత సంవత్సరంలో విద్యుత్ డిమాండ్ పెరుగుదలను సూచిస్తుంది. ఎన్‌టీపీసీ గ్రూప్ కంపెనీలు 2021 ఏప్రిల్ నుండి జూన్ వరకు మొదటి త్రైమాసికంలో 85.8 బి.యు. ఉత్పత్తిని నమోదు చేశాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఉత్పత్తి చేసిన మొత్తం 67.9 బి. యు. విద్య‌త్ స‌ర‌ఫరాపై 26.3శాతం పెరుగుదల నమోదుకావ‌డం గ‌మ‌నార్హం. కేవ‌లం స్వతంత్ర ప్రాతిపదికన 2021 ఏప్రిల్ నుండి జూన్ వరకు మొదటి త్రైమాసికంలో ఎన్‌టీపీసీ ఉత్పత్తి 19.1 శాతం పెరిగి 71.7 బి.యు.ల‌కు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ ఉత్పత్తి చేసిన విద్యుత్ విలువ‌ 60.2 బిలియ‌న్ యూనిట్లుగా నిలిచింది. కేంద్ర‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ప్రచురించిన గణాంకాల ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్‌టీపీసీ కోర్బా (2600 మెగావాట్లు) భారత దేశంలో మేటిగా పనిచేసిన‌ థర్మల్ పవర్ ప్లాంట్‌గా నిలిచింది. ఉత్తర ప్రదేశ్‌లోని 37 ఏళ్ల ఎన్‌టీపీసీ సింగ్రౌలి యూనిట్ 4 (200 మెగావాట్లు) ఏప్రిల్ నుండి జూన్ 2021 వరకు దేశంలో అత్యధికంగా 102.08 శాతం పీఎల్‌ఎఫ్‌ను సాధించింది. విద్యుత్ ప్లాంట్ల నిర్వహణ ఎన్‌టీపీసీ యొక్క నైపుణ్యం మరియు అధిక స్థాయి కార్యాచరణ సమర్థతను ఇది ప్రదర్శిస్తుంది. మొత్తం ఎన్‌టీపీసీ వ్యవస్థాపిత సామర్థ్యం 66085 మెగావాట్లు. ఎన్‌టీపీసీ గ్రూప్‌లో మొత్తం 71 ప‌వ‌ర్ స్టేష‌న్లు ఉన్నాయి దీనిలో 29 పునరుత్పాదక ప్రాజెక్టులు క‌లవు. 2032 నాటికి 60 గిగావాట్ల (జీడబ్ల్యు) పునరుత్పాదక శక్తి (ఆర్ఈ) సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని ఎన్‌టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. యుఎన్- విద్యుత్‌ఫై అత్యున్న‌త స్థాయి చ‌ర్చ‌లు (హెచ్‌ఎల్‌డీఈ) లో భాగంగా తన శక్తి కాంపాక్ట్ లక్ష్యాలను ప్రకటించిన మొదటి ఇంధన సంస్థ ఎన్‌టీపీసీ. 5 జీడబ్ల్యు నిర్మాణ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులతో సహా.. 20 జీడబ్ల్యుకి పైగా ఎన్‌టీపీసీ సంస్థ సామర్థ్యాన్ని కలిగి ఉంది. పర్యావరణ అనుకూల ఇంధన ప్రాజెక్టుల ద్వారా సరసమైన ధరలకు విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయడం ఎన్‌టీపీసీ యొక్క ముఖ్య ధ్యేయంగా ప‌ని చేస్తోంది.
                                 

***


(Release ID: 1736023) Visitor Counter : 222