భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
రానున్న కాలంలో డీప్ సీ మిషన్ , సముద్ర వనరుల వినియోగం ద్వారా 100 బిలియన్
'నీలి ఆర్ధిక వ్యవస్థ' సాధన లక్ష్యంతో పథకాల అమలు... కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
प्रविष्टि तिथि:
12 JUL 2021 7:51PM by PIB Hyderabad
రానున్న కాలంలో డీప్ సీ మిషన్ అమలు, సముద్ర వనరుల వినియోగంతో 100 బిలియన్ 'నీలి ఆర్ధిక వ్యవస్థ' రూపకల్పనకు భారత్ పనిచేస్తున్నదని కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూగోళ శాస్త్ర, సిబ్బంది,ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి,అంతరిక్ష శాఖల సహాయ ( స్వతంత్ర)
మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ వెల్లడించారు.
భూగోళ శాస్త్ర శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించిన డాక్టర్ జితేంద్రసింగ్ దేశ ఆర్థికవ్యవస్థను మరింత అభివృద్ధి చేయడానికి అపారమైన సముద్ర వనరులపై దృష్టి సారించక తప్పదని స్పష్టం చేశారు. 110 బిలియన్ రూపాయల ఆర్ధిక వ్యవస్థను రూపొందించాలన్న లక్ష్య సాధనలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ' డీప్ ఓషన్ మిషన్'ను అమలు చేస్తుందని మంత్రి వివరించారు. వివిధ మంత్రిత్వ శాఖల కింద పనిచేస్తున్న వివిధ శాస్త్రీయ విభాగాలను ఒకే తాటిపైకి తీసుకుని వచ్చి సమగ్ర ఫలితాలను సాధించడానికి 'డీప్ సీ మిషన్' అవకాశం కల్పిస్తుందని మంత్రి అన్నారు.
' డీప్ సీ మిషన్' ద్వారా సామాన్య ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని డాక్టర్ జితేంద్రసింగ్ అన్నారు. 'డీప్ సీ మిషన్' ద్వారా తీరప్రాంతాల్లో ఉప్పు నీటిని శుద్ధి చేసి ప్రజలకు మంచి నీరు సరఫరా చేయడానికి, సముద్ర గర్భం నుంచి ఖనిజ నిక్షేపాలను వెలికి తీయడానికి అవకాశం కలుగుతుందని అన్నారు.
సామజిక మాధ్యమాల ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు సాధ్యమైనంత త్వరగా తెలియజేయడానికి చర్యలను అమలు చేయాలని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) అధికారులను మంత్రి ఆదేశించారు. సామాన్య ప్రజలకు ప్రయోజనం కలిగించే విధంగా మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలకు ప్రసార సాధనాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. అనవసరమైన ఖర్చును తగ్గించడానికి మంత్రిత్వశాఖలో స్వతంత్రంగా పనిచేస్తున్న సంస్థలను విలీనం చేసే అవకాశాలను పరిశీలించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సమీక్షా సమావేశానికి డైరెక్టర్ జనరల్స్, సీనియర్ శాస్త్రవేత్తలు మరియు పరిపాలనా విభాగాల అధికారులు హాజరయ్యారు.
కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ పరిధిలో స్వయంప్రతిపత్తి గల అయిదు సంస్థలతో సహా పది సంస్థలు పనిచేస్తున్నాయి. మంత్రిత్వ శాఖ తన పరిశోధన మరియు అభివృద్ధి మరియు కార్యాచరణ కార్యకలాపాలను అయిదు పథకాల ద్వారా నిర్వహిస్తోంది.
***
(रिलीज़ आईडी: 1735044)
आगंतुक पटल : 278