ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
కేంద్రమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ "ఈశాన్య ప్రాంతం యొక్క మొత్తం సామాజిక-ఆర్థిక అభివృద్ధి వేగవంతం చేయడమే తమ ప్రధాన కార్యక్రమంగా ఉందని" తెలిపారు
అభివృద్ధి కార్యకలాపాలు మరియు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులపై డిఓఎన్‌ఈఆర్ సీనియర్ అధికారులతో సమీక్షించారు సమీక్షిస్తుంది.
నాడు పోస్టు చేయడమైనది:
11 JUL 2021 4:06PM by PIB Hyderabad
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి (డిఓఎన్‌ఈఆర్) శ్రీ జి. కిషన్ రెడ్డి ఈశాన్య ప్రాంతంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యకలాపాలు మరియు కార్యక్రమాలను సమీక్షించారు. ఈ రోజు ముగిసిన డోనెర్ రెండు రోజుల సమగ్ర మంత్రివర్గ సమీక్ష సమావేశం తరువాత శ్రీ కిషన్ రెడ్డి "ఈశాన్య ప్రాంతం యొక్క మొత్తం సామాజిక-ఆర్థిక అభివృద్ధి వేగవంతం చేయడమే తమ ప్రధాన కార్యక్రమంగా ఉందని" స్పష్టం చేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులన్నింటినీ నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని శ్రీ కిషన్ రెడ్డి సీనియర్ అధికారులను కోరారు. పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను ఇతర మంత్రిత్వ శాఖలతో సరైన సంప్రదింపుల విధానం ద్వారా త్వరగా పరిష్కరించాలని ఆయన అన్నారు.
కార్యదర్శి డోనెర్ డాక్టర్ ఇందర్ జిత్ సింగ్ మరియు సీనియర్ అధికారులు రెండు రోజుల సమీక్షా సమావేశంలో డోనర్ మంత్రిత్వ శాఖ యొక్క అన్ని ప్రాజెక్టులు, పథకాలు మరియు విధానాల గురించి మంత్రికి సమగ్ర ప్రదర్శన ఇచ్చారు.
అంతకుముందు, గురువారం డోనర్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తరువాత శ్రీ రెడ్డి మాట్లాడుతూ " ఈశాన్య ప్రాంతంలో గత ఏడు సంవత్సరాలలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గతంలో ఎప్పుడు జరగని విధంగా నమ్మశక్యం కాని రీతిలో అన్ని రంగాలలో అభివృద్ధి జరిగిందని" అన్నారు. శ్రీ మోదీ మార్గదర్శకత్వంలో ఈ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు.
<> <> <> <> <>
(రిలీజ్ ఐడి: 1734681)
సందర్శకుల సూచీ సంఖ్య : : 170