ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ అప్‌డేట్
నాడు పోస్టు చేయడమైనది:
10 JUL 2021 8:56AM by PIB Hyderabad
జాతీయ వాక్సినేషన్ కార్యక్రమం కింద మొత్తం 37.21 కోట్ల వాక్సిన్ డోస్‌లు వినియోగించడం జరిగింది.
గత 24 గంటలలో ఇండియాలో 42,766 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇండియాలో మొత్తం క్రియాశీల కేసులు ప్రస్తుతం 4,55,033 ఉన్నాయి.
క్రియాశీల కేసులు మొత్తం కేసులలో 1.48 శాతంగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 2,99,33,538 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
45,254 మంది పేషెంట్లు గత 24 గంటలలో కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు 97.20 శాతానికి పెరిగింది.
వారపు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.34 శాతం కంటే తక్కువ గా ఉంది.
రోజువారి పాజిటివిటీ రేటు 2.19 శాతం. వరుసగా 19 రోజులుగా 3 శాతం కంటే తక్కువ ఉంది.
దేశవ్యాప్తంగా కోవిడ్ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచారు. ఇప్పటివరకూ 42.90 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
***
(రిలీజ్ ఐడి: 1734562)
సందర్శకుల సూచీ సంఖ్య : : 200