హోం మంత్రిత్వ శాఖ

కేబినెట్ విస్తరణ తర్వాత జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో కేంద్ర రంగ పథకం ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ ఆర్థిక సహకారం కి సంబంధించి ఆమోదించిన మార్పులపై ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా


ఈ నిర్ణయంతో రాష్ట్ర ఏజెన్సీలు / ఎపిఎంసిలు, జాతీయ మరియు రాష్ట్ర సమాఖ్యలు, స్వయం సహాయక బృందాలు (ఎస్ హెచ్ జీలు ) మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థల సమాఖ్య (ఎఫ్‌పిఓలు) ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ పరిధిలోకి వస్తాయి

దీనివల్ల ప్రతి ప్రాజెక్టుకు కోటి రూపాయల వరకు గరిష్టంగా 25 ప్రాజెక్టులకు రెండు కోట్ల వరకు వడ్డీ రాయితీ, రుణ హామీ పథకం విస్తరిస్తుంది

వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఒకే మార్కెట్ ప్రాంగణంలో ఎపిఎంసికి అనుమతి లభించడంతో శీతల గిడ్డంగులు, సార్టింగ్, గ్రేడింగ్ వంటి వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు రెండు కోట్ల వరకు పొందిన రుణంపై వడ్డీ రాయితీ కల్పిస్తుంది

వ్యవసాయరంగం, రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా దూరదృష్టితో నిర్ణయాన్ని తీసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీకి నా అభినందనలు.. అమిత్ షా

వ్యవసాయ రంగం, రైతుల శ్రేయస్సుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఎపిఎంసి వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధిని ఈ చారిత్రాత్మక నిర్ణయం వెల్లడిస్తోంది

ప్రభుత్వ నిర్ణయంతో ఎపిఎంసిలకు సాధికారత కలగడమే కాకుండా ఉపాధి అవకాశాలనుపెరిగి ఎక్కువ మందికి ప్రయోజన

Posted On: 08 JUL 2021 9:32PM by PIB Hyderabad

కేబినెట్ విస్తరణ తర్వాత జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న  ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’  కింద అందిస్తున్న రుణ పరపతిలో మార్పులు చేస్తూ  ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా స్వాగతించారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ఏజెన్సీలు / ఎపిఎంసిలుజాతీయ మరియు రాష్ట్ర   సమాఖ్యలుస్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జిలు) మరియు రైతు ఉత్పత్తిదారుల సంస్థల సమాఖ్య (ఎఫ్‌పిఓలు) 'వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి' పరిధిలోకి వస్తాయి. ఇంతేకాకుండా, ప్రతి ప్రాజెక్ట్టుకు గరిష్టంగా రెండు కోట్ల  రూపాయల వరకు 25 ప్రాజెక్టుల వరకు వడ్డీ రాయితీ సౌకర్యం కూడా విస్తరింపబడుతుంది. వివిధ మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులకు ఎపిఎంసికి ఆమోదం తెలియజేయడానికి మరియు శీతల గిడ్డంగులు, గ్రేడింగ్ లాంటి సౌకర్యాల కల్పనా ప్రాజెక్టులకు రెండు కోట్ల వరకు వడ్డీ రాయితీని అందించడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం అవకాశం కల్పిస్తుంది. 

వ్యవసాయ రంగం తో పాటు రైతులకు ప్రయోజనం కల్పించాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఎపిఎంసి వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మంత్రివర్గం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో వెల్లడయ్యిందని శ్రీ అమిత్ షా అన్నారు. దీనివల్ల ఎపిఎంసిలు మరింత బలపడడానికి, ఉపాధి అవకాశాలను మెరుగు పరచి ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. 

 ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ పరిధిలో రాష్ట్ర ఏజెన్సీలు / ఎపిఎంసిలుజాతీయ మరియు రాష్ట్ర  సమాఖ్యలుస్వయం సహాయక బృందాలు   రైతు ఉత్పత్తిదారుల సంస్థల సమాఖ్య (ఎఫ్‌పిఓ) లను చేర్చడం వల్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల రంగంలో ఎక్కువ పెట్టుబడులు వస్తాయని, ఇవి ఉపాధిని కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సాధికారత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక భాగమని శ్రీ షా అన్నారు. 

ఇంతవరకు, ‘వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి’ కింద ఒక ప్రాంతంలో రెండు కోట్ల రూపాయల వరకు ఉన్న రుణాలకు మాత్రమే వడ్డీ రాయితీ లభించేది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వల్ల వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు అర్హత కలిగిన సంస్థలు తీసుకున్న రుణాలపై వడ్డీ రాయితీ లభిస్తుంది. అయితేఈ ప్రాజెక్టుల సంఖ్యని ప్రైవేట్ రంగంలో 25కి పరిమితం చేయబడుతుంది. 

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వల్ల సహకార రంగం మరింత బలోపేతం కావడానికి సహకరిస్తుందని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. వ్యవసాయపరపతి రంగాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి తరఫున తాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని అభినందిస్తున్నానని శ్రీ అమిటీషా అన్నారు. 

 

****



(Release ID: 1734087) Visitor Counter : 149


Read this release in: English , Urdu , Hindi