పర్యటక మంత్రిత్వ శాఖ

కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన - శ్రీ జి కిషన్ రెడ్డి


పర్యాటక మంత్రిత్వ శాఖ లో సహాయ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన - శ్రీ శ్రీపాద యశో నాయక్, శ్రీ అజయ్ భట్

Posted On: 08 JUL 2021 5:39PM by PIB Hyderabad

కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా, న్యూఢిల్లీ లోని శాస్త్రి భవన్‌లో, ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో,  శ్రీ శ్రీపాద యశో నాయక్, శ్రీ అజయ్ భట్ కూడా పర్యాటక శాఖ సహాయ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.

ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖతో పాటు, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గా కూడా శ్రీ కిషన్ రెడ్డి నియమితులయ్యారు.  అంతకుముందు ఆయన హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా, శ్రీ కిషన్ రెడ్డి, మీడియాతో మాట్లాడుతూ, మన సాంస్కృతిక మూలాలను బలోపేతం చేయడానికి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి పెట్టుబడులు పెట్టడం ద్వారా ‘న్యూ ఇండియా’ గురించి ప్రధానమంత్రి ఆశయాలను నెరవేర్చడానికి మంత్రిత్వ శాఖ పనిచేస్తుందని, పేర్కొన్నారు. 

 

శ్రీ జి. కిషన్ రెడ్డి తెలంగాణ లోని సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి 2019 లో 17 వ లోక్ సభకు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు.

 

గుండె జబ్బులతో బాధపడే చిన్నపిల్లల కోసం ఆయన చేసిన కృషి వంటి అనేక ప్రత్యేకమైన కార్యక్రమాలకు, శ్రీ కిషన్ రెడ్డి నాయకత్వం వహించారు.  ఈ సేవకు గుర్తింపుగా, ఆయనకు, యునిసెఫ్ (ఐక్యరాజ్యసమితి) ద్వారా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో "ఉత్తమ పిల్లల-స్నేహ పూర్వక శాసనసభ్యునిగా" అవార్డు లభించింది.  ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ఆయన, ఒక ప్రచారాన్ని ప్రారంభించడంతో పాటు, న్యూఢిల్లీలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ యువజన సదస్సు (ఐ.వై.సి.టి) నిర్వహించారు. ఈ సమావేశంలో, 54 కి పైగా దేశాల నుండి 193 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.  ఆయన "సీమ సురక్ష జాగరణ యాత్ర", మరియు "తెలంగాణ పోరుయాత్ర" కూడా నిర్వహించారు.

అమెరికా లోని మేరీల్యాండ్ ఇండియా బిజినెస్ రౌండ్ టేబుల్ (ఎం.ఐ.బి.ఆర్.టి) ద్వారా, 2009 సంవత్సరానికి అత్యుత్తమ యువ నాయకత్వ పురస్కారాన్ని,  అదేవిధంగా, ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, బల్గేరియా లోని సోఫియా లో, యూనియన్ ఆఫ్ బల్గేరియన్ కమాండోస్ పతకాన్ని కూడా, శ్రీ కిషన్ రెడ్డి అందుకున్నారు.

ప్రజలు ప్రేమతో, గౌరవంగా ‘కిషన్నన్న’ అని పిలిచే శ్రీ జి. కిషన్ రెడ్డి, సంపూర్ణ సంకల్పం మరియు కృషి ద్వారా ఎవరైనా సాధించగలరనడానికి, ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు.  వివిధ రంగాలలో భారతదేశం మరియు దాని యువ నాయకత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ, అమెరికా, ఇజ్రాయెల్, చైనా, నేపాల్, ఫ్రాన్స్, యు.కె., కెనడా, మొరాకో, మలేషియా, బల్గేరియా, సింగపూర్, ఈజిప్ట్, థాయిలాండ్, హాంకాంగ్ సందర్శనలతో సహా, ప్రపంచవ్యాప్తంగా, ఆయన, విస్తృతంగా పర్యటించారు.

పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు శ్రీ శ్రీపాద యశో నాయక్, ఆయుష్ శాఖ (స్వతంత్ర హోదా) మంత్రి గా ఉన్నారు.  ఆయన గోవా నుండి ఐదు సార్లు  లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు.  గతంలో, ఆయన, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, పర్యాటక శాఖ (స్వతంత్ర హోదా), సాంస్కృతిక శాఖ ( స్వతంత్ర హోదా), రక్షణ శాఖ వంటి వివిధ మంత్రిత్వ శాఖలలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశారు.  అదేవిధంగా, వివిధ ముఖ్యమైన కమిటీలలో సభ్యుడిగా కూడా ఉన్నారు. 

వృత్తి రీత్యా న్యాయవాది అయిన, శ్రీ అజయ్ భట్, జాతీయ స్థాయిలో వివిధ ముఖ్యమైన కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు.  ఉత్తరాఖండ్ కు చెందిన శ్రీ అజయ్, నైనిటాల్ ఉధమ్ సింగ్ నగర్ నియోజకవర్గం నుండి 17వ లోక్ సభ ఎన్నికయ్యారు. విస్తృతంగా పర్యటించిన శ్రీ భట్, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలపై గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నారు. 



(Release ID: 1733989) Visitor Counter : 153