సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీ నారాయణ తాటు రాణే, సహాయ మంత్రిగా శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ బాధ్యతల స్వీకారం
Posted On:
08 JUL 2021 12:37PM by PIB Hyderabad
కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీ నారాయణ తాటు రాణే బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆ రాష్ట్ర పరిశ్రమలు, నౌకాశ్రయం, ఉద్యోగిత, స్వయం ఉపాధి శాఖల మంత్రిగానూ పని చేశారు. 35 ఏళ్లుగా వివిధ స్థాయుల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
ఐదుసార్లు లోక్‌సభ ఎంపీ అయిన శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఒక ఎంపీగా, 'షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల సంక్షేమం'పై నియమించిన కమిటీలో సభ్యుడిగానూ ఉన్నారు. ఎంఎస్‌ఎంఈ కార్యదర్శి, సీనియర్ అధికారులు మంత్రులిద్దరికీ స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం, శ్రీ నారాయణ్ తాటు రాణే మీడియాతో మాట్లాడారు. ప్రధాని నాయకత్వాన్ని, ఎంఎస్‌ఎంఈల పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధను ప్రశంసించారు. ఆర్థికాభివృద్ధి, ఆవిష్కరణలు, ఉపాధి కల్పనను ముందుకు నడిపే బలమైన కారకాల్లో ఎంఎస్‌ఎంఈలు కూడా భాగమని మంత్రి చెప్పారు. ఈ రంగంలో అత్యున్నత సుస్థిరాభివృద్ధి ఉండేలా చూసేందుకు, "ఎంఎస్‌ఎంఈలను సమర్థవంతంగా వినియోగించుకుని, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం వారి భాగస్వామ్యాన్ని రెట్టింపు చేయడానికి; ఉద్యోగాలు, ఎగుమతులు, సమగ్రావృద్ధి ద్వారా లక్షలాది ఆశావహుల జీవితాలను మార్చడానికి ఎంఎస్‌ఎంఈల పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడం" అనే విజన్ కోసం పని చేస్తామని మంత్రి చెప్పారు.
పెద్ద సంఖ్యలో వ్యాపార కేంద్రాలను, ఎగుమతిదారులను చేర్చేలా ఎంఎస్‌ఎంఈ నిర్వచనాన్ని విస్తరించడంతోపాటు; మౌలిక సదుపాయాల అభివృద్ధి, రుణాలు, ఆర్థిక సాయం, సాంకేతికత ఉన్నతీకరణ, నైపుణ్యాభివృద్ధి కోసం వివిధ పథకాల ద్వారా “స్వయం సమృద్ధి భారత్” కింద ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వివరించారు.
ఎంఎస్‌ఎంఈ రంగాన్ని మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీ రాణే అధికారులకు చెప్పారు. ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి తమ అధికార పరిధుల్లో సుదీర్ఘ సహకారం అందించాలని అధికారులను కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణే కోరారు.
***
(Release ID: 1733636)
Visitor Counter : 241