సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో, రేపు నిర్వహించే సమాజిక్ అధికారిత శిబిరంలో, దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు, సహాయక సామాగ్రిని పంపిణీ చేయనున్నారు
Posted On:
05 JUL 2021 5:31PM by PIB Hyderabad
ఏ.డి.ఐ.పి. పథకం కింద "దివ్యాంగుల" కు; "రాష్ట్రీయ వయోశ్రీ యోజన" (ఆర్.వి.వై. పథకం) కింద వయో వృద్ధులకు; అవసరమైన ఉపకరణాలు, సహాయక పరికరాల పంపిణీ కోసం, 2021 జులై, 6వ తేదీన, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోని ఆనందమాయి ఆడిటోరియంలో, "సామాజిక అధికారిత శిబిరం" నిర్వహిస్తున్నారు. భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ (ఏ.ఎల్.ఐ.ఎం.సి.ఓ) మరియు శ్రీకాకుళం జిల్లా పాలనా యంత్రాంగం సహకారంతో భారత ప్రభుత్వ వికలాంగుల సాధికారత మంత్రిత్వ శాఖ (డి.ఈ.పి.డబ్ల్యు.డి) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని, మంత్రిత్వ శాఖ రూపొందించిన ఎస్.ఓ.పి. ని అనుసరించి బ్లాక్ / పంచాయతీ స్థాయిలో 2,206 మంది దివ్యాంగులకు, 432 మంది వయోవృద్దులకు, 2.96 కోట్ల రూపాయల విలువ చేసే, పరికరాలు, సహాయ సామాగ్రిని, ఈ కార్యక్రమంలో, ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
ఈ శిబిరాన్ని భారత ప్రభుత్వ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి డాక్టర్ థావర్ చంద్ గెహ్లోట్ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి, శ్రీ ధర్మాన కృష్ణ దాస్; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్, శ్రీ తమ్మినేని సీతారాం; జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమం మరియు విభిన్న సామర్థ్యం గల వ్యక్తులు, వయోవృద్దుల సంక్షేమం శాఖల మంత్రి, శ్రీమతి తానేటి వనిత; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్య శాఖల మంత్రి, డాక్టర్ సీదిరి అప్పల రాజు; శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు, శ్రీ రామ్ మోహన్ నాయుడు కింజారపు తో పాటు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.
ఈ కార్యక్రమానికి - డి.ఈ.పి.డబ్ల్యు.డి., సంయుక్త కార్యదర్శి డాక్టర్ డాక్టర్ ప్రబోధ్ సేథ్ తో పాటు, ఏ.ఎల్.ఐ.ఎం.సి.ఓ. మరియు జిల్లా యంత్రాంగానికి చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా దృశ్య మాధ్యమం ద్వారా / వ్యక్తిగతంగా హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి లింక్ : https://youtu.be/QAtRDaVM8oc
(Release ID: 1732932)
Visitor Counter : 196