ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
02 JUL 2021 9:27AM by PIB Hyderabad
జాతీయ వాక్సినేషన్ కార్యక్రమం కింద ఇప్పటివరకు 34 కోట్ల వాక్సిన్ డోస్‌లు (34,00,76,232) వేశారు.
దేశంలో గత 24 గంటలలో 46,617 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇండియా క్రియాశీల కేసుల లోడ్ 5,09,637 కు తగ్గింది.
క్రియాశీల కేసుల సంఖ్య మొత్తం కేసులలో 1.67 శాతంగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,95,48,302.
గత 24 గంటలలో కోలుకున్న పేషెంట్ల సంఖ్య 59.384
రోజువారీ కోలుకున్న వారిసంఖ్య , రోజువారీ కొత్త కేసుల కంటే వరుసగా 50 వరోజు ఎక్కువగా ఉంది.
రికవరీ రేటు 97.01 శాతానికి పెరుగుదల.
వారపు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.57 శాతం వద్ద ఉంది.
రోజువారి పాజిటివిటి రేటు 2.48 శాతం. వరుసగా 25 రోజులుగా ఇది 5 శాతం కంటే తక్కువగా ఉంటున్నది.
దేశంలో కోవిడ్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటివరకు 41.42 కోట్ల పరీక్షలు నిర్వహించారు.
(Release ID: 1732279)