మంత్రిమండలి

సిబ్బంది ప‌రిపాల‌న సంబంధిత ఆధునికీక‌ర‌ణ‌, పాల‌న సంస్క‌ర‌ణ‌ లు అనే అంశం పై భార‌త‌దేశాని కి, గాంబియా గ‌ణ‌తంత్రాని కి మ‌ధ్య సంత‌కాలైన అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 30 JUN 2021 4:16PM by PIB Hyderabad

సిబ్బంది ప‌రిపాల‌న సంబంధిత ఆధునికీక‌ర‌ణ‌, పాల‌న సంస్క‌ర‌ణ‌ లు అనే అంశం పై భార‌త ప్ర‌భుత్వ సిబ్బంది, ప్ర‌జా ఫిర్యాదులు, పింఛ‌ను ల మంత్రిత్వ శాఖ; ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌లు- ప్ర‌జా ఫిర్యాదుల విభాగం మ‌రియు గాంబియా గ‌ణ‌తంత్రం అధ్య‌క్ష కార్యాల‌య ప‌రిధి లోని ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిశన్ ఒక అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పంద ప‌త్రం (ఎమ్ఒయు) పై సంత‌కాలు చేయడాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదించింది.
 
ప్ర‌భావం:

ఉభ‌య దేశాల లో సిబ్బంది ప‌రిపాల‌న ప‌ట్ల అవ‌గాహ‌న ను ఏర్ప‌ర‌చుకోవ‌డం లో ఈ ఎమ్ఒయు స‌హాయ‌కారి కాగ‌ల‌దు.  అంతేకాక, ఉత్త‌మ‌ అభ్యాసాల లో, ఉత్తమ ప్ర‌క్రియ‌ల లో కొన్నిటిని అవ‌త‌లి ప‌క్షం (దేశం) స్వీకరించడానికి, అమ‌లు ప‌ర‌చ‌డానికి, మరికొన్ని సరికొత్త ఉత్తమ అభ్యాసాల ను, సరికొత్త ఉత్తమ ప్రక్రియల ను ఆవిష్కరించడానికి తద్ద్వారా పాల‌న వ్య‌వ‌స్థ ను మెరుగు ప‌ర‌చ‌డం లో కూడాను ఈ ఎమ్ఒయు మార్గాన్ని సుగమం చేస్తుంది.

ఆర్థిక ప్ర‌భావం:

ఈ ఎమ్ఒయు అమ‌లు ప‌రం గా త‌లెత్తే ఖ‌ర్చు ను ప్ర‌తి ఒక్క దేశం తానే భ‌రించుకోవ‌ల‌సి ఉంటుంది.  ఎమ్ఒయు లో నిర్దేశించిన ప్ర‌కారం గా చేప‌ట్టే కార్య‌క‌లాపాలు ఏమేమిట‌న్న అంశం పై ఆధార‌ప‌డి వాస్త‌వ వ్య‌యం ఉండ‌బోతోంది.

వివ‌రాలు:

ఈ ఎమ్ఒయు లో భాగం గా స‌హ‌క‌రించుకొనే రంగాల లో ఈ కింద ప్ర‌స్తావించిన రంగాల తో పాటు మ‌రిన్ని అంశాలు కూడా ఉండేందుకు ఆస్కారం ఉంది..

a)       ప్ర‌భుత్వం లో ప‌నితీరు నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ కు మెరుగులు దిద్ద‌డం.

b)       కంట్రిబ్యూట‌రీ పెన్శన్ స్కీము ను అమ‌లుప‌ర‌చ‌డం

c)       ప్ర‌భుత్వం లో ఎల‌క్ట్రానిక్ ఆధారిత నియామ‌కాలు (ఇ-రిక్రూట్‌మెంట్) చేప‌ట్ట‌డం.
 

ఈ ఎమ్ఒయు ప్ర‌ధాన ఉద్దేశ్య‌మ‌ల్లా రెండు దేశాల లో సిబ్బంది ప‌రిపాల‌న‌, పాల‌న ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల లో ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని ప‌టిష్ట‌ ప‌ర‌చుకోవ‌డమూ, ఆ స‌హ‌కారాన్ని పెంచ‌డ‌మూను.  దీనితో భార‌త ప్ర‌భుత్వ ఏజెన్సీ లు , గాంబియా గ‌ణ‌తంత్రం ఏజెన్సీల‌ కు మ‌ధ్య ఒక చ‌ర్చ‌ కు మార్గం సుగ‌మం కానుంది.  అంతకు మించి, గాంబియా త‌న ప్ర‌భుత్వం లో ప‌నితీరు నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ ను మెరుగు ప‌ర‌చుకోవ‌డం, కంట్రిబ్యూట‌రీ పెన్శన్ స్కీము ను అమ‌లు ప‌ర‌చ‌డం, ఇ-రిక్రూట్‌మెంట్ ను ప్రారంభించ‌డం వంటి రంగాల లో స‌హ‌కారాన్ని పెంచుకోవడానికి గాను భార‌త‌దేశం తో క‌ల‌సి ప‌ని చేయాల‌నే ఆస‌క్తి తో ఉంది.
 

గాంబియా గ‌ణ‌తంత్రం తో ఎమ్ఒయు అనేది సిబ్బంది ప‌రిపాల‌న ఆధునికీక‌ర‌ణ లో, పాల‌న ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల లో రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారాని కి ఒక చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ఫ్రేమ్ వ‌ర్క్ ను అందించ‌గ‌లుగుతుంది.  ఇలా చేయ‌డం వ‌ల్ల నేర్చుకోవ‌డం, ఒక ప‌క్షం తో మ‌రొక ప‌క్షం పంచుకోవ‌డం వంటి ప‌ద్ధ‌తుల ద్వారా ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్నటువంటి పాల‌న తీరు ను మెరుగు ప‌ర‌చుకొనేందుకు, అలాగే మరింత అధిక ప్ర‌తిస్పంద‌నయుత భావ‌న‌ ను, జ‌వాబుదారుత‌నాన్ని, పార‌ద‌ర్శ‌క‌త్వాన్ని ప్రోత్స‌హించనూగలదు.
 
పూర్వ‌రంగం:

దేశం వ్యాప్తం గా ప్ర‌భుత్వ సేవ‌ల అంద‌జేత లో ఒక గ‌ణ‌నీయ‌మైన‌టువంటి ప‌రివ‌ర్త‌న ను తీసుకు రావాల‌నే ల‌క్ష్యాన్ని భార‌త ప్ర‌భుత్వం నిర్దేశించుకొన్న‌ది.  ‘క‌నీస స్థాయి ప్ర‌భుత్వం తో గ‌రిష్ఠ స్థాయి పాల‌న’ ను అందించే ల‌క్ష్యాన్ని సాధించ‌డం కోసం సిబ్బంది ప‌రిపాల‌న మరియు పాల‌న సంస్క‌ర‌ణ‌ ల పున‌రుద్ధ‌ర‌ణ దిశ లో
ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్ర‌యాసల ను మ‌రింత పెంచాలి అనేది కూడా ఇంకొక ఉద్దేశ్యం గా ఉంది.


(Release ID: 1731566) Visitor Counter : 329