రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్-19 తో పోరాడటానికి, క్రియాశీల సహకారాన్ని కోరుతూ, అంతర్జాతీయ భద్రతపై 9 వ మాస్కో సమావేశంలో పిలుపు నిచ్చిన - రక్షణ శాఖ కార్యదర్శి


మహమ్మారికి మద్దతునిస్తున్న పరిశ్రమకు ఒక పెద్ద పర్యావరణ వ్యవస్థ గా ఉన్న - భారతదేశం.

Posted On: 23 JUN 2021 8:28PM by PIB Hyderabad

 

అంతర్జాతీయ భద్రతపై  9 వ మాస్కో సదస్సు యొక్క ప్లీనరీ సమావేశంలో, ‘కోవిడ్-19 కి వ్యతిరేకంగా పోరాటం లో సైనిక సంస్థల పాత్ర’, అనే అంశంపై,  రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, ప్రసంగిస్తూ, "క్రియాశీల సహకారాలు, పరిశోధన భాగస్వామ్యాలు మరియు ఒకదానికొకటి బలాన్ని పెంచుకోవడం వంటివి,  కోవిడ్-19 వంటి మహమ్మారి తో పోరాడటానికి ముందున్న మార్గాలు," అని పేర్కొన్నారు. 2021, జూన్, 23వ తేదీన రష్యా లోని మాస్కో లో జరిగిన, ఈ సదస్సులో,  కజకిస్తాన్, మంగోలియా, జింబాబ్వే, సుడాన్ దేశాలకు చెందిన రక్షణ మంత్రులతో పాటు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కు చెందిన అండర్ సెక్రటరీ జనరల్ ప్రభృతులు పాల్గొన్నారు.

కోవిడ్-19 వంటి ప్రపంచ సవాళ్లు దేశాల మధ్య తేడాను చూపించవని,  రక్షణ శాఖ కార్యదర్శి పేర్కొంటూ,  భవిష్యత్తులో ఇటువంటి వ్యాధులు విస్ఫోటనం కాకుండా నిరోధించడానికి ప్రపంచ స్పందన కోసం మౌలిక సదుపాయాలను, సామర్థ్యాలను, పెంపొందించుకోవాలని, నొక్కి చెప్పారు.  కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి, క్రియాశీల టీకాల పై దృష్టి పెట్టి, అందరికంటే ముందు వరుసలో ఉండాలని, ఆయన, అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు.  "అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని,  ఉదాహరణకు, వ్యాధి సంక్రమణ అంచనా, సమాచార విశ్లేషణ తో పాటు, మరింత ఖచ్చితంగా కోవిడ్ నిర్ధారణ కోసం,  కృత్రిమ మేధస్సు ను, ఉపయోగించుకోవచ్చు,” అని ఆయన సూచించారు. 

భారత-రష్యా రక్షణ సంబంధాలపై, డాక్టర్ అజయ్ కుమార్ వ్యాఖ్యానిస్తూ, ఈ సంబంధాలు ఇరు దేశాల మధ్య ప్రత్యేకమైన, విశేష అధికారాలు గల వ్యూహాత్మక భాగస్వామ్యం లో అంతర్భాగం అని పేర్కొన్నారు.  అత్యాధునిక సాంకేతిక రక్షణ వస్తువుల సహ-అభివృద్ధి మరియు ఉత్పత్తి కోసం భారతదేశం యొక్క ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనడానికి రష్యా అంగీకరించడాన్ని ఆయన స్వాగతించారు. సైనిక మరియు సైనిక-సాంకేతిక సహకారంపై భారత-రష్యా అంతర్-ప్రభుత్వ కమిషన్ తదుపరి సమావేశంలో పాల్గొనడానికి, ఈ ఏడాది చివర్లో రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయిగు భారత పర్యటన కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. 

మహమ్మారిపై పోరాడటానికి ఇతర దేశాలకు భారతదేశం చేస్తున్న సహాయం గురించి, రక్షణ శాఖ కార్యదర్శి ప్రత్యేకంగా పేర్కొంటూ,  "భారతదేశం తాను సొంతంగా ఈ యుద్ధంలో పోరాడటంతో పాటు, కోవిడ్-19 ను తట్టుకోవటానికి స్నేహ పూర్వక విదేశీ దేశాలకు భారతదేశం సహాయపడింది, ఇంకా తన సహాయాన్ని కొనసాగిస్తోంది." అని చెప్పారు.  గొప్ప వైద్య మరియు ఆర్థిక ఒత్తిడి ఉన్న సమయంలో కూడా, భారతదేశం, ఇతర దేశాలకు, ఎటువంటి సంకోచం లేకుండా మద్దతు ఇచ్చింది, "వాసుధైవ కుటుంబకం" - "ప్రపంచం ఒక కుటుంబం" అనే ప్రాచీన నమ్మకంతో ప్రేరణ పొందిందని కూడా, ఆయన, పేర్కొన్నారు. 

కరోనా మహమ్మారి మొదటి దశ తాకిన వెంటనే, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ప్రాంతీయ సహకారం కోసం దక్షిణాసియా సమితి (సార్క్) నాయకులను సంప్రదించి, ఈ ప్రాంతంలో కోవిడ్-19 ను ఎదుర్కోవడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. 

అవసరమైన వారికి వైద్య సహాయం అందించడానికి వేగవంతమైన ప్రతిస్పందన వైద్య బృందాలను నియమించడం ద్వారా స్నేహపూర్వక దేశాలకు భారతదేశం అందించిన మద్దతు గురించి రక్షణ కార్యదర్శి ప్రత్యేకంగా పేర్కొన్నారు.  వివిధ రకాల వైద్య సామాగ్రిని 150 దేశాలకు పంపడం జరిగింది.  2020 వసంత ఋతువు మరియు వేసవి కాలం నాటికి, 120 దేశాలకు పారాసెటమాల్ మరియు హైడ్రాక్సీక్లోరోక్విన్ అనే ప్రాథమిక ఔషధాలను రవాణా చేసిన ప్రధాన సరఫరాదారు గా భారతదేశం నిలిచిందని, ఆయన అన్నారు. అనేక దేశాలకు చెందిన అంతర్జాతీయ విమానయాన సంస్థలు, తమ విమాన సర్వీసులను నిలిపివేసిన సమయంలో, భారతదేశంలో చిక్కుకున్న 120 దేశాల కు చెందిన 1,20,000 మంది విదేశీయులను తరలించడంతో సహా, ఏడు మిలియన్ల మంది ప్రజలను, 'వందే భారత్' మిషన్ లో భాగంగా, వాయు మార్గం ద్వారా, సముద్ర మార్గం ద్వారా గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా, ఇది ఇప్పటి వరకు చేపట్టిన అతిపెద్ద రాకపోకల ప్రక్రియగా పేరుగాంచింది.

పి.పి.ఈ. పరికరాల ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలవడంతో పాటు, మహమ్మారికి మద్దతు ఇస్తున్న పరిశ్రమలకు భారతదేశం అతిపెద్ద పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా పేరుగాంచిందని, డాక్టర్ అజయ్ కుమార్ చెప్పారు.  ఈ మహమ్మారి,  వైద్య డిమాండ్ల పరిధిలో ఆవిష్కరణలను ప్రేరేపించడంతో, ఈ రంగం వివిధ రకాల కోవిడ్ సంబంధిత మందులు, టీకాలు, వెంటిలేటర్లు, పరికరాలు, వ్యాధి నిర్ధారణ పరికరాలు, ఇతర సామాగ్రిని అభివృద్ధి చేసి, 150 దేశాలకు సరఫరా చేసినట్లు, ఆయన తెలియజేశారు. 

టీకాలు మరియు ఔషధాలను సమర్థవంతంగా మరియు అందరికీ సరసమైనవిగా చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని రక్షణ శాఖ కార్యదర్శి పునరుద్ఘాటించారు.   మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్‌ ప్రధానమైన పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.  ఈ రోజు వరకు, భారతదేశం 66 మిలియన్ మోతాదుల టీకాలను ఇతర దేశాలకు అందజేసిందనీ, ఏ దేశానికైనా ఇది ఒక అతిపెద్ద గర్వకారణమైన విషయమని, ఆయన పేర్కొన్నారు.  కోవిడ్-19 కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న దేశాల్లో రష్యా ముందు వరుసలో ఉన్న యోధుడు అని, డాక్టర్ అజయ్ కుమార్ రష్యాను అభివర్ణించారు.  భారతదేశంలో మహమ్మారిని తగ్గించడంలో రష్యా కనుగొన్న టీకా, స్పుత్నిక్-వి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  "భారతదేశంలో భారీ స్థాయిలో, ఈ టీకా ఉత్పత్తి త్వరలో ప్రారంభమవుతుందని భావిస్తున్నాము.   భారతదేశంలో మొత్తం 900 మిలియన్ మోతాదుల స్పుత్నిక్-వి టీకా ఉత్పత్తి అవుతుందనీ, ఇది, దాని ప్రపంచ ఉత్పత్తిలో 70 శాతంగా ఉంటుందని, ఆయన, తెలియజేశారు.

వైద్య సదుపాయాలను పెంపొందించడంలో, కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశంలో మరియు విదేశాలలో పౌర అధికారులకు సహాయం అందించడంలో, రక్షణ మంత్రిత్వ శాఖ మరియు సాయుధ దళాలు చేసిన ప్రయత్నాలను, రక్షణ శాఖ కార్యదర్శి వివరిస్తూ,  రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ.);  సాయుధ దళాల వైద్య సేవల డైరెక్టరేట్ జనరల్ (డి.జి-ఏ.ఎఫ్.ఎం.స్.) తో సహా, త్రివిధ దళాల  సహకారాన్ని ప్రశంసించారు. కోవిడ్-19 కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేసే 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-డి.జి) యొక్క అత్యంత ఆశాజనకమైన వాడకాన్ని డి.ఆర్.డి.ఓ. గుర్తించిందని ఆయన అన్నారు.  డి.ఆర్.డి.ఓ. సంస్థ అతి తక్కువ రోజుల్లో కోవిడ్ సంరక్షణ సదుపాయాలను ఏర్పాటు చేసిందని, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్.ఎస్.ఏ) తేజస్‌పై - ఉత్పత్తి కోసం అభివృద్ధి చేసిన మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 500 మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి, డి.ఆర్.డి.ఓ. ముందుకు వచ్చిందని, ఆయన అన్నారు.

పౌర అధికారులకు సహాయం అందించినందుకు సాయుధ దళాలను డాక్టర్ అజయ్ కుమార్ అభినందిస్తూ, మొదటి దశ ప్రారంభమైన రోజుల్లో, సైన్యం అనేక ఐసోలేషన్ సదుపాయాలను ఏర్పాటు చేసిందనీ, వైద్య సామాగ్రిని రవాణా చేయడానికి ప్రత్యేక సైనిక రైళ్లను నడిపిందనీ, చెప్పారు.  రెండవ దశ సమయంలో చేపట్టిన ప్రయత్నాలలో బాగా, భారత నావికాదళం, హిందూ మహాసముద్ర ప్రాంతానికి భారీ సంఖ్యలో వైద్య సామాగ్రితో పాటు సహాయ బృందాలను పంపించిందని ఆయన తెలియజేశారు.  11 నావికాదళ ఓడలు 1,500 మెట్రిక్ టన్నుల అత్యవసర లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ రవాణా చేశాయని కూడా ఆయన తెలిపారు.  భారత వైమానిక దళం, దేశవిదేశాల నుంచి సుమారు 1,800 సార్టీలతో దాదాపు 15,000 మెట్రిక్ టన్నుల అత్యవసర వైద్య సామాగ్రిని రవాణా చేసినట్లు కూడా ఆయన తెలియజేశారు.   మిలటరీ సిబ్బందితో పాటు ప్రజల వైద్య అవసరాల కోసం ఆసుపత్రులను 24 గంటలూ నిర్వహించడానికి వీలుగా, రిటైరయిన వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తో సహా అదనపు వైద్యులను నియమించడం పట్ల, రక్షణ శాఖ కార్యదర్శి, ఏ.ఎఫ్.ఎం.ఎస్. ను అభినందించారు.

అంతర్జాతీయ భద్రతపై 9 వ మాస్కో సమావేశాన్ని, రష్యన్ ఫెడరేషన్ కు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ 2021 జూన్ నెల 22-24 తేదీల మధ్య నిర్వహిస్తోంది.  2012 నుండి ఏటా జరిగే ఈ సమావేశం, భద్రతా పరంగా ఒక ముఖ్యమైన సదస్సు. 

*****



(Release ID: 1729948) Visitor Counter : 197


Read this release in: English , Urdu , Hindi , Telugu