ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వాక్సినేష‌న్ అప్ డేట్‌


27.28 కోట్ల కుపైగా వాక్సిన్ డోస్‌లు రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు అంద‌జేత‌
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌ వ‌ద్ద ఇంకా అందుబాటులో ఉన్న 2.18 కోట్ల‌కు పైగా వాక్సిన్ డోస్‌లు.

Posted On: 17 JUN 2021 10:55AM by PIB Hyderabad

దేశ‌వ్యాప్తంగా నిర్వహిస్తున్న వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు కోవిడ్ వాక్సిన్‌ను ఉచితంగా అందించి మ‌ద్ద‌తు తెలుపుతోంది. దీనికితోడు రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు నేరుగా వాక్సిన్‌ను కొనుగోలు చేసేందుకు వీలు క‌ల్పించింది.
 కోవిడ్ వ్యాప్తి నిరోధానికి సంబంధించి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు తీసుకురావ‌డంతోపాటు టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్ విధానాన్ని అనుస‌రిస్తూ, కోవిడ్ మ‌హ‌మ్మారిని అదుపు చేయ‌డంలో వాక్సినేష‌న్‌ను భార‌త ప్ర‌భుత్వం స‌మ‌గ్ర వ్యూహంలో భాగంగా కీల‌క స్తంభంగా చూస్తున్న‌ది.

స‌ర‌ళీకృత , వేగ‌వంత‌మైన 3 వ ద‌శ కోవిడ్ -19 వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం 2021 మే 1న ప్రారంభ‌మైంది.
ఈ వ్యూహం కింద‌, ప్ర‌తి నెలా , సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ లేబ‌రెట‌రీ (సిడిఎల్‌) అనుమ‌తించే మొత్తం వాక్సిన్‌లో  ఏ త‌యారీదారు  త‌యారు చేసిన‌వైనా వాటిలో  50 శాతం డోస్‌లను భార‌త ప్ర‌భుత్వం స‌మ‌కూర్చుకుంటుంది. ఈ వాక్సిన్ డోస్‌ల‌ను రాష్ట్ర‌ప్ర‌భుత్వం గ‌తంలో లాగ‌నే పూర్తి ఉచితంగా రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌కు అందుబాటులో ఉంచుతుంది.

 ఇప్ప‌టివ‌రకు రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల‌కు 27.28 కోట్ల కు పైగా వాక్సిన్ డోస్‌లు (27,28,31,900) ల‌ను అంద‌జేయ‌డం జ‌రిగింది. వీటిని భార‌త ప్ర‌భుత్వ (ఉచిత పంపిణీ ఛాన‌ల్ ద్వారా) , నేరుగా రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌మ‌కూర్చుకునే విధానంలోనూ స‌మ‌కూర్చ‌డం జ‌రిగింది.

ఇందులో, వృధాతో స‌హా మొత్తం వాక్సిన్ వినియోగం 25,10,03,417. (ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు అందిన స‌మాచారం మేర‌కు)

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వ‌ద్ద ఇంకా వేయ‌డానికి  సుమారు 2.18కోట్లు (2,18,28,483) కోవిడ్ వాక్సిన్ డోస్‌లు అందుబాటులో ఉన్నాయి.

దీనికి తోడు 56,70,350 వాక్సిన్ డోస్‌లు పంపిణీ క్ర‌మంలో ఉన్నాయి. రాగ‌ల 3 రోజుల‌లో రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు వీటిని అందుకోనున్నాయి.

 

***


(Release ID: 1727870) Visitor Counter : 140