ఆర్థిక మంత్రిత్వ శాఖ
తమిళనాడు పారిశ్రామిక కారిడార్ లో రహదారుల నెట్ వర్క్‌ను ఆధునీకరించేందుకు $484 మిలియన్ల రుణ కేటాయింపు ఒప్పందం పై సంతకం చేసిన భారత్, ఎడిబి
Posted On:
16 JUN 2021 2:52PM by PIB Hyderabad
తమిళలనాడు రాష్ట్రంలో చెన్నై- కన్యాకుమారి పారిశ్రామిక కారిడార్ (సికెఐసి) లో పారిశ్రామిక అభివృద్ధిని సులభతరం చేసేందుకు, రవాణా అనుసంధానతను మెరుగుపరిచేందుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి), భారత ప్రభుత్వం బుధవారం నాడు 484 మిలియన్ డాలర్ల రుణం కేటాయింపు ఒప్పందంపై సంతకాలు చేశాయి.
పశ్చిమ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న భారత తూర్పు తీర ఆర్థిక కారిడార్ (ఈస్ట్ కోస్ట్ ఎకనమిక్ కారిడార్ - ఇసిఇసి)లో సికెఐసి భాగం. ఇది దక్షిణ, ఆగ్నేయ, తూర్పు ఆసియాలోని ఉత్పత్తి నెట్ వర్క్‌లతో భారత్ ను అనుసంధానం చేస్తుంది. ఇసిఇసిని అభివృద్ధి చేయడంలో భారత ప్రభుత్వానికి ప్రధాన భాగస్వామిగా ఎడిబి వ్యవహరిస్తోంది.
భారత ప్రభుత్వం తరఫున తమిళనాడు పారిశ్రామిక అనుసంధాన ప్రాజెక్టు కోసం ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రా సంతకం చేయగా, భారత్ లోని ఎడిబి కంట్రీ డైరెక్టర్ తకో కొనేషీ ఎడిబి తరఫున సంతకం చేశారు.
పారిశ్రామిక సదుపాయాలు, రవాణా ప్రవేశద్వారాలు, వినియోగ కేంద్రాల మధ్య నిరాటంకమైన అనుసంధానత పెంచడానికి ఋ ప్రాజెక్టు కీలకం. ఇది సికెఐసి లక్ష్యిత పరిశ్రమల ఉత్పాదక ఖర్చును తగ్గించడమే కాక,లాజిస్టిక్స్‌ను తగ్గించి, వాటి పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తుందని, మిశ్రా పేర్కొన్నారు.
ఎడిబి మద్దతుతో సికెఐసి సమగ్రాభివృద్ధి ప్రణాళిక కింద కారిడార్ అభివృద్ధి కోసం గుర్తించిన ప్రాధాన్యత కలిగిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఈ ప్రాజెక్టు ఒకటని కొనోషీ అన్నారు. పారిశ్రామిక వృద్ధి కేంద్రాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన రవాణా, ఇంధన,, పట్టణ మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పారిశ్రామిక పరివర్తనను ప్రోత్సహించడం అన్నది సంపూర్ణ లక్ష్యమని ఆయన చెప్పారు.
తమిళనాడులోని చెన్నై, కన్యాకుమారి మద్య గల 32లోని 23 జిల్లాలలో సికెఐసి ప్రభావం గల ప్రాంతాలలో 590 కిమీల రాష్ట్ర హైవేలను ఈ ప్రాజెక్టు ఆధునీకరించనుంది. పారిశ్రామక కేంద్రాల అనుసంధానతను, లోతట్టు ప్రాంతాలు, ఓడరేవులతో పెంచడం అన్నది భారత ఉత్పత్తి రంగం అంతర్జాతీయ ఉత్పత్తి నెట్‌వర్క్‌లలోనూ, గ్లోబల్ విలువ లంకెలలోనూ భాగస్వాములయ్యేందుకు అవకాశాన్ని పెంచి, కారిడార్ పొడవునా ఉద్యోగాలను సృష్టిస్తుంది.
ఎడిబి దీర్ఘకాలిక కార్పొరేట్ వ్యూహమైన, స్ట్రాటజీ 2030కు అనుగుణంగా, ఈ ప్రాజెక్టు స్థిరత్వాన్ని, పర్యావరణ మార్పు స్థితిస్థాపకత, రహదారి భద్రతల పై ప్రాజెక్టు ప్రాముఖ్యతను ఇస్తుంది. రహదారి ప్రాజెక్టుల దీర్ఘకాలిక నిర్వహణ కోసం ఏడు ఏళ్ళ కాంట్రాక్టులను ఇచ్చారు. హైవేల ఆధునీకరణలో మెరుగైన డ్రైనేజీ, కీలకమైన ప్రాంతాలలో రహదారి కరకట్టల ఎత్తు పెంపు, వంతెనలు, కల్వర్టుల కొలతలను మార్చడం సహా పలు వాతావరణ మార్పు అనుసరణ చర్యలను పొందుపరుస్తున్నారు. రహదారి పర్యవేక్షణ, అమలు కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రహదారి భద్రతను మెరుగుపరిచే కార్యక్రమాలను ఈ ప్రాజెక్టు బలోపేతం చేస్తుంది. అదనంగా, తమిళనాడు హైవేలు, మైనర్ పోర్టుల శాఖ ప్రణాళిక సామర్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రాజెక్టు తోడ్పడుతుంది.
అత్యంత దారిద్య్రాన్ని నిర్మూలించడం కోసం తమ నిరంతర కృషితో పాటుగా, సంపన్నమైన, కలుపుకుపోయే, బలమైన, పాలనీయ ఆసియా, పసిఫిక్ ప్రాంతాలను సాధించేందుకు ఎడిబి కట్టుబడి ఉంది, 1966లో స్థాపించిన ఈ బ్యాంకు 68 మంది సభ్యులకు చెందింది - ఇందులో 49మంది ఈ ప్రాంతానికి చెందినవారు.
***
(Release ID: 1727693)
Visitor Counter : 231