జల శక్తి మంత్రిత్వ శాఖ
ప్రతి ఇంటికి కుళాయి నీటిని సరఫరా చేసేందుకు జల్ జీవన్ మిషన్ కింద తమిళనాడుకు 3 ,691 కోట్ల రూపాయలు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం నాలుగు రెట్లు కేటాయింపులు పెంచడం ద్వారా, హర్ ఘర్ జల్ లక్ష్యాన్ని రాష్ట్రం సాధించేందుకు,పనులను వేగవంతం చేయడానికి వీలు కలుగుతుంది.
Posted On:
15 JUN 2021 4:07PM by PIB Hyderabad
ప్రతి ఇంటికి పరిశుభ్రమైన మంచినీటిని అందించాలన్న ప్రధానమంత్ర శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం , జల్‌జీవన్ మిషన్ కింద 2021-22 ఆర్ధిక సంవత్సరానికి 3 , 691 కోట్ల రూపాయయయలు కేటాయించింది. 2020-21 లో ఇది 921.99 కోట్లుగా ఉంది. జలశక్తి మంత్రిత్వశాఖ కిందగల జల్ జీవన్ మిషన్ తొలి విడతగా 614.35 కోట్లరూపాయలు విడుదల చేసింది. 2024 నాటికి గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన కుళాయి నీటిని అందించేందుకు కేటాయింపులలో నాలుగురెట్ల పెంపుదలను ఆమోదిస్తూ, రాష్ట్రం తన లక్ష్య సాధనకు పూర్తి సహాయం అందిస్తామన్నారు.
తమిళనాడులో మొత్తం 1.26 కోట్ల ఇళ్లు ఉండగా , 40.36 లక్షల గృహాలకు (31.08 శాతం) కుళాయి కనెక్షన్ కల్పించడం జరిగింది. 2019 ఆగస్టు 15న జల్ జీవన్ మిషన్ ప్రారంభించే నాటికి 21.65 లక్షల (17.06శాతం) ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్ ఉండేది. 22 నెలల వ్యవధిలో 18.70 లక్షల గృహాలు( 14.74 శాతం) కుళాయి నీటి కనెక్షన్ పొందాయి.
ఆ విధంగా తమిళనాగులో ఇప్పటికీ 86.53 లక్షల ఇళ్లు ట్యాప్ వాటర్ కనెక్షన్ లేకుండా నే ఉన్నాయి. ప్రస్తుతం అంటే 2020-21లో కల్పిస్తున్న 16.13 లక్షల కుళాయి కనెక్షన్ల వేగంతో పోలిస్తే రాగల 3 సంవత్సరాలలో భారీ లక్ష్యాన్ని చేరుకోవలసి ఉంటుంది. 2024 నాటికి లక్ష్యసాధనకు రాష్ట్రం గ్రామీణ ప్రాంతాలలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్ కల్పించే వేగం 179 శాతం పెరగాలి.
గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా మంచినీటిని అందించే లక్ష్యాన్ని సాధించేందుకు
రాష్ట్రప్రభుత్వం ప్రస్తుత కార్యాచరణ ప్రణాళిక (2021-22)ను ఖరారు చేయవలసి ఉంది..) 2021-22 సంవత్సరానికి ఇంకెంత మాత్రం జాప్యం చేయకుండా కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయవలసిందిగా
భారత ప్రభుత్వానికి చెందిన జాతీయ జల్ జీవన్ మిషన్ ( ఎన్.జె.జె.ఎం) రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం తొలి త్రైమాసికం పూర్తి కావలసి వచ్చింది.
తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు కృషి చేయాలని, 2024 నాటికి గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా మంచినీటిని అందించేందుకు కృషి చేయాలని సూచించడం జరిగింది. ఇందుకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ , తమిళనాడు ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు.
2020-21 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు 921.99 కోట్ల రూపాయల గ్రాంటు కేటాయించగా, రాష్ట్రం కేవలం 544.51 కోట్ల రూపాయల ను మాత్రమే ఖర్చుచేసింది. తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాలలో కుళాయి నీటిని సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ఈ నిధులలో 377.48 కోట్ల రూపాయలను సరెండర్ చేసింది. ఈ సంవత్సరం కేంద్రం తన కేటాయింపులను నాలుగురెట్లు ( ఊ 3,691.21 కోట్లు) పెంచింది. గత ఏడాది ఖర్చు చేయకుండా మిగిలిన 377.48 కోట్ల రూపాయలు, అలాగే 2020-21 రాష్ట్ర మ్యాచింగ్ షేర్ 290.70 కోట్లు, ఈ ఏడ ఆది రాష్ట్ర మ్యాచింగ్ షేర్ ఇందులో ఉన్నాయి. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో తమిళనాడుకు 8,428.17 కోట్ల రూపాయలు జల్ జీవన్ మిషన్ కింద అందుబాటులో ఉండనున్నాయి.అందువల్ల ఈ కార్యక్రమానికి ఎలాంటి నిధుల కొరత ఉండబోదు. ఇందుకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రికి ,కేంద్ర మంత్రి లేఖ రాస్తూ, ఈ పథకానికి పెంచిన కేటాయింపుల వల్ల రాష్ట్రం ప్రణాళికా బద్ధంగా జల్ జీవన్ మిషన్ కింద కార్యక్రమాలను చేపట్టి , గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీటిని అందించే లక్ష్య్యాన్ని చేరుకోవడానికి వీలు కలుగుతుందని తెలిపారు.
. 15 వ ఆర్ధిక సంఘం మంచినీరు, పారిశుధ్యానికి సంబంధించి గ్రామీణ స్థానిక సంస్థలు, పంచాయతి రాజ్ సంస్థలకు గ్రాంటును ముడిపెట్టడంతో 2021-22 ఆర్దిక సంవత్సరంలో తమిళనాడుకు రూ 1600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రాగల 5 సంవత్సరాలూ తమిళనాడుకు 8,436 కోట్ల రూపాయల ఫండింగ్ అందుబాటులో ఉంటుంది. ఇంత భారీ మొత్తాన్ని తమిళనాడు లోని గ్రామీణ ప్రాంతాలలో ఖర్చు చేయనున్నందున అక్కడ నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడంతోపాటు, ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకోనున్నాయి. ఇది గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను ముందుకు తీసుకుపోనున్నది..
కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ , తమిళనాడు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో గ్రామీణ ప్రాంతాలలోని ఇళ్లకు కుళాయి ద్వారా మంచినీటి సరఫరాకు సంబంధించచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పంగురించి పునరుద్ఘాటిస్తూ, నీటి కొరత గల ప్రాంతాలు, నాణ్యమైన నీటి సరఫరా లేని ప్రాంతాలు, ఆకాంక్షిత జిల్లాలు, ఎస్.సి, ఎస్.టిలు మెజారిటీ ఉన్న ప్రాంతాలు, సంసద్ గ్రామ యోజన (ఎస్.ఎ.జి.వై) గ్రామాలకు ప్రాధాన్యతనివ్వాల్సిందిగా సూచించారు. ఈ గ్రామాలలో 20201-22 సంవత్సరంలో ప్రాధాన్యతా ప్రాతిపదికన అన్ని గ్రామాలు, ప్రాంతాలలోని ఇళ్లకు కుళాయి ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
దేశంలోని పాఠశాలల పిల్లలకు , ఆశ్రమశాలలు, అంగన్‌వాడీలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రకటించారు. దీనిని 2020 అక్టోబర్ 2న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారు .ఫలితంగా ఆంధ్రప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్, గోవా, తెలంగాణా, అండమాన్ నికోబార్‌దీవులతో పాటు తమిళనాడులో అన్ని పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలలో మంచినీటి సరఫరా ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రంలో నీటి నాణ్యత, నిఘా కు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. ఇందిఉకు అంగన్‌వాడి వర్కర్లు, ఆశా వర్కర్లు , స్వయం సహాయక బృందాలు, పంచాయతి రాజ్ సంస్థల సభ్యులు, పాఠశాల టీచర్లు తదితరులకు శిక్షణ ఇచ్చి ఈ కార్యకలాపాలలో వినియోగిస్తున్నారు. దీనివల్ల వీరు ఫీల్డ్ టెస్ట్ కిట్స్ (ఎఫ్.టి.కె)లను ఉపయోగించి నీటి సరఫరాకు మూలమైన ప్రాంంంతాలు, నీటి సరఫరా జరిగే ప్రాంతాలలో నీటి నాణ్యతను పరీక్షిస్తారు. 113 నీటి పరీక్షా లేబరెటరీలలో తమిళనాడులో కేవల 1 పరీక్షా కేంద్రం మాత్రమే ఎన్.ఎ.బిఎల్ అక్రిడిషన్ కలిగిఉంది. నీటి పరీక్ష లేబరెటరీల స్థాయి పెంచేందుకు, ఎన్.ఎ.బి.ఎల్ అక్రిడిషన్ పొందేందుకు రాష్ట్రం కృషిచేయవలసి ఉంది.
జల్ జీవన్ మిషన్ కింది స్థాయి నుంచి ప్రజలను భాగస్వాములను చేసే కార్యక్రమం. ప్రణాళిక రూపకల్పన , అమలు, నిర్వహణ అంతా క్షేత్రస్థాయి నుంచి జరుగుతుంది. దీనిని సాధించడానికి రాష్ట్రప్రభుత్వం గ్రామ నీటి, పారిశుధ్య కమిటీలను, పానీ సమితులను, గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయాలి. రాగల 5 సంవత్సరాలకు వీటిని ఏర్పాటు చేయలి. రాష్ట్రస్థాయి అమలు ఏజెన్సీలు గ్రామ కమిటీలకు అండగా ఉంటాయి. ఇవి ప్రజలలో అవగాహన పెంచేందుకు కృషి చేస్తాయి. ఇప్పటివరకు తమిళనాడు 10,812 వి.డబ్ల్యు.ఎస్,సిలు, లేదా పానీ సమితులను 12,525 గ్రామాలలో ఏర్పాటు చేసింది. 6,335 గ్రామాల కార్యాచరణ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాగల మూడు -నాలుగు నెలల్లో రాష్ట్రం అన్ని గ్రామాలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. అలాగే నీటి నాణ్యతా పర్యవేక్షణ ,ఎప్పటికప్పడు పరీక్షించేందుకు 63 వేల మంది మహిళలకు శిక్షణ ఇవ్వవలసి ఉంది. ఇలాంటి మద్దతు, సామర్ధ్యాల అభివృద్ధి నీటిసరఫరాను నిరంతరం సుస్థిరంగా కొనసాగించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి ఇంటికీ నమ్మకమైన,నాణ్యమైన రీతిలో నీటిసరఫరాలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
2019లో జల్ జీవన్ మిషన్‌ను ప్రారంభించినపుడు దేశవ్యాప్తంగా మొత్తం 19.20 కోట్ల గ్రామీణ గృహాలు ఉన్నాయి. ఇందులో 17 శాతం అంటే 3.23 కోట్ల ఇళ్లకు మాత్రమే కుళాయి నీటి సదుపాయం ఉంది. గత 22 నెలల్లో , కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితులు ఉన్నప్పటికీ , లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ అత్యంత వేగవంతంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. దీనితో 4.29 కోట్ల ఇళ్లకు పైప్ ద్వారా మంచినీటి సరఫరా చేయడం జరిగింది. 22 శాతం కవరేజ్ పెరగడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7.53 కోట్ల గ్రామీణ ఇళ్లకు (39.25 శాతం) కుళాయి ద్వారా మంచినీటి సరఫరా జరుగుతోంది. గోవా, తెలంగాణా, అండమాన్, నికోబార్ ఐలెండ్, పుదుచ్చేరి రాష్ట్రాలు హర్ ఘర్ జల్ కింది గ్రామీణ ప్రాంతాలలో నూరు శాతం ఇళ్లకు కుళాయి ద్వారా నీటిసరఫరాను సాధించాయి. ప్రధానమంత్రి గారి దార్శనికత అయిన సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ సబ్‌కా విశ్వాస్ నినాదంతో జల్ జీవన్ మిషన్ కింద ఎవరినీ విడిచపెట్టకుండా గ్రామీణ ప్రాంతాలలోని అందరికీ కుళాయి ద్వారా నీటి సరఫరా కనెక్షన్ అందించడం జరుగుతోంది. ప్రస్తుతం 62 జిల్లాలు, 92 వేల గ్రామాలలోని ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.
జల్ జీవన్ మిషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 20119 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రకటించారు. దేశంలో 2024 నాటికి గ్రామీణ ప్రాంతాలలోని ప్రతి ఇంటికీ కుళాయ ద్వారా నీటిని అందించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతొ దీనిని అమలు చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్‌కు 2021-22లో మొత్తం బడ్జెట్ 50,011 కోట్ల రూపాయలు. రాష్ట్రాల స్వంత వనరులు, 15 వ ఆర్థిక సంఘంతో ముడిపడిన నీరు, పారిశుధ్యానికి సంబంధించి ఈ ఏడాది ఆర్.ఎల్.బిలు, పంచాయతి రాజ్ సంస్థలతో ముడిపడిన గ్రాంటు మొత్తం కలుపుకుంటే గ్రామీణ ప్రాంతాలలో నీటిసరఫరా రంగానికి పెడుతున్న పెట్టుబడి లక్ష కోట్ల రూపాయలు దాటుతుంది. ఇది గ్రామాలలో కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకువెళుతుంది.
(Release ID: 1727469)
Visitor Counter : 208