సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఇల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేసిన ప్రభుత్వం
ఎంఎస్ఎంఇల రిజిస్ట్రేషన్ కోసం పాన్, ఆధార్ కార్డులు చాలు
Posted On:
15 JUN 2021 7:51PM by PIB Hyderabad
లఘు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేస్తున్నట్టు రోడ్డు రవాణా& హైవేలు, లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. మంగళవారం సాయంత్రి ఎస్ఎంఇఎస్ స్ట్రీట్ గేమ్ ఛేంజర్స్ ఫోరం ఏర్పాటు చేసిన వెబినార్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇప్పుడు ఎంఎస్ఎంఇలు రిజస్ట్రేషన్ చేసుకోవడం కోసం పాన్, ఆధార్ కార్డులు చాలని గడ్కరీ అన్నారు.
నమోదు చేసుకున్న తర్వాత ఎంఎస్ఎంఇ యూనిట్ కు ప్రాధాన్యత, ఫైనాన్స్ అందుతుందని మంత్రి తెలిపారు. వ్యవస్థాపకత, సంబంధిత అంశాలపై చిన్న యూనిట్లకు శిక్షణను ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖకు పూర్తి మద్దతుకు హామీ ఇస్తూ, చిన్న వ్యాపారాలకు బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలు పూర్తి మద్దతును ఇస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎంఎస్ఎంఇల ప్రాముఖ్యతను పట్టి చూపుతూ, దేశంలో వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తూ, భారీ స్థాయిలో ఉపాధి అవవకాశాలను కల్పిస్తూ ఆర్ధిక, సామాజిక అభివృద్ధికి ఎంఎస్ఎంఇలు చెప్పుకోదగిన స్థాయిలో దోహదం చేస్తాయని మంత్రి చెప్పారు. భారత్‌ను అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రంగా చేయాలన్న లక్ష్యంతో, ఎంఎస్ఎంఇ లు ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థకు తమ సహకారాన్ని అందించే విధంగా పర్యావరణ వ్యవస్థను నిర్మించాలన్న లక్ష్యం ఎంఎస్ఎంఇ దార్శనికత అని ఆయన అన్నారు. ఎంఎస్ఎంఇల ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు, ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీగా రూ. 20 లక్షల కోట్ల రూపాయలను ప్రకటించిందని వివరించారు.
ఈ కార్యక్రమ పూర్తి వివరాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి - https://www.youtube.com/watch?v=8xsVK9N6dv8.
***
(Release ID: 1727402)
Visitor Counter : 256