వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
గత ఏడాది తో పోలిస్తే 12.50 శాతం అధికంగా గోధుమ సేకరణ
ప్రస్తుత ఆర్.ఎం.ఎస్ కాలంలో 425.77 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమ సేకరణ. గత ఏడాది ఇదే కాలంలో సేకరించిన గోధుమలు 378.44 లక్షల మెట్రిక్ టన్నులు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్.ఎం.ఎస్ గోధుమ సేకరణ కాలంలో 47.53 లక్షల రైతులకు ప్రయోజనం
ఈ ఏడాది గరిష్ఠ గోధుమ సేకరణను సాధించి రికార్డు సృష్టించిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్
2020-21 కె.ఎం.స్, ఆర్.ఎం.ఎస్ సీజన్‌లో 826.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కనీస మద్దతు ధరకు సేకరణ
ప్రసుతం కొనసాగుతున్న ధాన్యంసేకరణ కింద 122.24 లక్షల మంది రైతులకు ప్రయోజనం
కనీస మద్దతు ధరకు ప్రభుత్వ ఏజెన్సీలచే 7,96,118.47 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, చమురు గింజల సేకరణ.
Posted On:
14 JUN 2021 6:16PM by PIB Hyderabad
గోధుమ సేకరణ రాష్ట్రాలలో ఆర్.ఎం.ఎస్ 2021-22 సంవత్సరానికి గోధుమ సేకరణ సజావుగా కొనసాగుతున్నది. ఇప్పటివరకూ అంటే 13-06-2021 వరకు 425.77 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను సేకరించారు. (ఇది 2020-21 ఆర్.ఎం.ఎస్ లో గరిష్ఠ సేకరణ 389.92 లక్షల మెట్రిక్ టన్నుల ను దాటిపోయింది. ) అంతకు ముందు సంవత్సరరం కొనుగోళ్లు 378.44 లక్షల మెట్రిక్ టన్నులు. హిమాచల్ ప్రదేశ్‌లో గోధుమల సేకరణ 13,040 మెట్రిక్ టన్నుల స్థాయికి చేరింది. ఈ రాష్ట్రంలో గోధుమ సేకరణ 10-06-2021న ముగిసింది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్.ఎం.ఎస్ ప్రొక్యూర్‌మెంట్ కార్యకలాపాల వల్ల 47.53 లక్షల మంది రైతులు 84,089.77 కోట్ల రూపాయల మేరకు కనీస మద్దతు ధర ను పొందారు.
2021 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం సేకరణ ఆయా రాష్ట్రాలలోసజావుగా సాగుతున్నది. ఈ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు 13.06.2021 నాటికి 826.60 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకున్నాయి.( ఖరీఫ్ పంట 707.00 లక్షల మెట్రిక్ టన్నులు, రబీ పంట 119.60 లక్షల మెట్రిక్ టన్నులు). అంతకు ముందు సంవత్సరం 743.18 లక్షల మెట్రిక్ టన్నులు.
ప్రస్తుతం కొనసాగుతున్న కె.ఎం.ఎస్ కార్యకలాపాల వల్ల 122.24 లక్షల రైతులు ఇప్పటికే ప్రయోజనం పొందారు. వీటి కనీస మద్దతు విలు 1,56,061.84 కోట్ల రూపాయలు. ధాన్యం సేకరణ ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరింది. ఇంతకుముందు అంటే 2019-20 కె.ఎం.ఎస్ సీజన్‌కు గరిష్ఠ సేకరణ అయిన 773.45 లక్షల మెట్రిక్ టన్నులను ఇది దాటిపోయింది.
దీనికి తోడు, రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ప్రకారం 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్, 2021 రబీ మార్కెటింగ్ సీజన్, 2021 వేసవి సీజన్‌కు సంబంధించి తమిళనాడు, కర్ణాటక, మహారష్ట్ర, తెలంగాణా, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రేదశ్, ఒడిషా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 107.83 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, చమురు గింజల సేకరణకు ధరల మద్దతు పధకం (పి.ఎస్.ఎస్)కింద అనుమతి ఇవ్వడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో 1.74 లక్షల మెట్రిక్ టన్నుల ఎండు కొబ్బరి సేకరణకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబందించి పప్పుధాన్యాలు, చమురుగింజలు, ఎండు కొబ్బరిని పి.ఎస్.ఎస్ కింద సేకరణకు ప్రతిపాదనలు అందిన అనంతరం , అనుమతులు మంజూరు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎఫ్.ఎ.క్యు గ్రేడ్ గల ఈ పంటలకు సంబంధించి 2020-21 సంవత్సరానికి కనీస మద్దతు ధరను ప్రకటించడానికి వీలు కలుగుతుంది. వీటి మార్కెట్ రేటు నోటిఫై చేసిన పంట కాలంలో ఆయా రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలలో తగ్గితే, నేరుగా రిజిస్టర్డ్ రైతుల నుంచి సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు, రాష్ట్రం నామినేట్ చేసిన ప్రొక్యూరింగ్ ఏజెన్సీ ద్వారా సేకరిస్తుంది.
13-6-2021 వరకు ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీ ద్వారా 7,96,118.47 మెట్రిక్‌టన్నుల పెసర, మినప, కందిపప్పు, మసూరర్, వేరుశనగ, ఆవాలు, సోయాబీన్ తదితరాలను 4,157.59 కోట్ల రూపాయల విలుగగల కనీస మద్దతు ధర మేరకు తమళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, హర్యాణా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 4,73,140 మంది రైతుల నుంచి 2020-21, 2021 రబీ సీజన్‌లలో సేకరించడం జరిగింది.
ఇలాగే, 5089 మెట్రిక్ టన్నుల ఎండు కొబ్బరిన 52.40 కోట్ల రూపాయల కనీస మద్దతు ధర విలువ మేరకు కర్ణాటక, తమిళనాడు కు చెందిన 3961 మంది రైతులనుంచి 2020-21 పంట సీజన్‌లో సేకరించడం జరిగింది. 2021-22 సీజన్‌కు తమిళనాడు నుంచి 51,000 మెట్రి్ టన్నుల ఎండు కొబ్బరి సేకరణకు అనుమతి లభించింది. ఇందుకు సంబంధించిన కొనుగోల్ళు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.
సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పప్పుధాన్యాలు, చమురు గింజల దిగుబడి ఆధారంగా పంట సేకరణకు తగిన ఏర్పాట్లు చేయనున్నాయి.
***
(Release ID: 1727128)
Visitor Counter : 202