ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్19:అపోహలపై అవగాహన


గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలో కొవిడ్ పై పోరాటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ప్రపంచంలో పిపిఈ కిట్ల తయారీలో భారతదేశం రెండవ స్థానంలో ఉంది; పిపిఈ కిట్లను రాష్ట్రాలకు వారి డిమాండ్లకు మించి అందుబాటులో ఉంచారు

Posted On: 11 JUN 2021 7:51PM by PIB Hyderabad

 

కొంతమంది ట్విట్టర్ వినియోగదారులు గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్-19 నిర్వహణ గురించి ట్వీట్ చేశారు. గ్రామ స్థాయిలో పరీక్షలు జరగడం లేదని, ఐసోలేషన్  మరియు క్లినికల్ మేనేజ్‌మెంట్ సదుపాయాలు లేవని , ఆరోగ్య కార్యకర్తల ఓవర్‌ మెడికేషన్, పిపిఇ కొరత మొదలైన సమస్యలు ఉన్నాయంటూ వాటిలో తెలిపారు.

కొండప్రాంతంలోని మారుమూల  గ్రామంలోని ఒక ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రాపిడ్ యాంటిజెన్ కిట్లు, ఆర్టీ-పిసిఆర్ పరీక్షలపై ఈ ట్వీట్లలో తెలిపారు. అయితే గ్రామీణ ప్రాంతాలలో కొవిడ్ కు చికిత్సను అందించేందుకు ప్రభుత్వం చేసిన నిబద్ధతకు నిదర్శనం మరియు సుదూర ప్రాంతాలు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రూపొందించిన పిహెచ్‌సి వైద్యులు కోవిడ్ టెస్టింగ్ ప్రోటోకాల్‌లో శిక్షణ పొందారు.

మునుపటి నెలల్లో కొవిడ్-19 తిరిగి పుంజుకున్న సమయంలో దేశంలోని పెరి-అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్-19 కేసులు పెరగడాన్ని గమనించి ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ కొవిడ్-19 కంటైనేషన్ & మేనేజ్‌మెంట్‌పై ఎస్ఓపి జారీ చేసింది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ మార్గదర్శకాలను మారుమూల ప్రాంతాలకు చేరేటట్టు, ఆరోగ్య సౌకర్యాలు విస్తృతంగా పంపిణీ జరిగేటట్టు చూసింది.

కొవిడ్ బాధితులు హోం ఐసోలేషన్ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన నిబంధనలను నెరవేర్చకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఇంట్లో ఒంటరిగా ఉంచరాదని రాష్ట్రాలకు స్పష్టంగా సూచించబడింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు హోం ఐసోలేషన్ లో ఉన్నరోగులను రోజూ పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేశాయి. ఇంట్లో అవసరమైన సదుపాయాలు లేని రోగులను ఎల్లప్పుడూ కొవిడ్ కేర్ సెంటర్లలో ఉంచమని సలహా ఇస్తారు. దీని కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేసింది.

పిపిఈ కిట్ల ఉత్పత్తికి భారతదేశ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో తయారీ సౌకర్యాలను సృష్టించింది. అవి ఎంతగా అంటే ప్రస్తుతం మనం ప్రపంచంలో రెండవ అతిపెద్ద పిపిఈల తయారీదారులం. మరియు రోజుకు 10 లక్షల పిపిఈలను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాము. పిపిఈలు తమ డిమాండ్లకు మించి రాష్ట్రాలకు అందుబాటులో ఉంచబడ్డాయి. అందువల్ల ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన పిపిఈలు లేవని ఈ ట్వీట్ చేసిన ఆరోపణలు ఆమోదించబడవు.

***


(Release ID: 1726428) Visitor Counter : 160