ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 వాక్సినేష‌న్ అప్‌డేట్‌


కోవిన్ ప్లాట్‌ఫాం హ్యాకింగ్ కు గురైన‌ట్టు వ‌చ్చిన వార్త‌లను కొట్టిపారేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ‌, వాక్సిన్‌పై ఏర్పాటైన సాధికార‌తా గ్రూప్ (ఇజివిఎసి)

వాక్సిన్‌కు సంబంధించిన స‌మాచారాన‌ని కోవిన్ భ‌ద్రంగా, సుర‌క్షితమైన డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో నిల్వ చేస్తుంది: డాక్ట‌ర్ ఆర్‌.ఎస్‌.శ‌ర్మ‌.

కోవిన్ కు వెలుప‌ల ఏ వ్య‌వ‌స్థ‌కూ కోవిన్ స‌మాచారాన్ని పంచుకోరు.

Posted On: 10 JUN 2021 10:26PM by PIB Hyderabad

కోవిన్ ప్లాట్‌ఫాం హాక్ అయిన‌ట్టు కొన్ని మీడియా క‌థ‌నాలు వ‌చ్చాయ‌ని , అవి న‌కిలీ వార్త‌ల‌ని ప్రాథ‌మికంగా తేలింద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ తెలిపింది. అయ‌న‌ప్ప‌టికీ ఎల‌క్ట్రానిక్స్‌, ఇన్ఫ‌ర్మేన్ టెక్నాల‌జీ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన  అత్య‌వ‌స‌ర స్పంద‌న బృందం చేత  వాక్సిన్ నిర్వ‌హ‌ణ సాధికార‌తా బృందం, ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ‌ దీనిపై ద‌ర్యాప్తు చేయిస్తోంది
. కోవిన్ స‌మాచారాన్ని అత్యంత భ‌ద్ర‌మైన రీతిలో సుర‌క్షిత ప‌ద్ధ‌తిలో నిల్వ చేస్తార‌ని కోవిన్ పై ఏర్పాటైన సాధికార‌త  గ్రూప్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ ఆర్‌.ఎస్‌.శ‌ర్మ తెలిపారు.
కోవిన్ వ్య‌వ‌స్థ హ్యాక్ అయిన‌ట్టు  సామాజిక మాధ్య‌మాల‌లో ప్ర‌చారంలో ఉన్న స‌మాచారం మా దృష్టికి వ‌చ్చింది. కోవిన్‌కు సంబంధించిన  వాక్సినేష‌న్‌  స‌మాచారం  అంత‌టినీ సుర‌క్షిత‌మైన , భ‌ద్ర‌మైన డిజిట‌ల్ వ్య‌వ‌స్థ‌లో నిక్షిప్తం చేయ‌డం జ‌రుగుతుంది. కోవిన్ స‌మాచారాన్ని కోవిన్ వ్య‌వ‌స్థ‌కు వెలుప‌ల ఎవ‌రికీ అంద‌జేయ‌రు. అలాంటి స‌మాచారాన్ని ఇత‌రుల‌తో పంచుకోరు. ల‌బ్ధిదారుల జియో లోకేష‌న్ లీక్ అయిన‌ట్టు చెబుతున్నారు.అయ‌తే కోవిన్‌లో అస‌లు అలాంటి స‌మాచారం సేక‌రించ‌రు అని ఆయ‌న తెలిపారు.

***(Release ID: 1726228) Visitor Counter : 242


Read this release in: English , Urdu , Hindi , Kannada