వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

గత ఏడాది ఇదే కాలంలో పోలిస్తే ఈ ఏడాది దేశంలో 12.12% పెరిగిన గోధుమల సేకరణ


గత ఏడాది 373.22 ఎల్ఎంటీల గోధుమలను సేకరించగా ఈ ఏడాది ఇంతవరకు 418.47 ఎల్ఎంటీ గోధుమల సేకరణ

గోధుమల సేకరణతో లబ్ది పొందిన దాదాపు 46 లక్షల మంది రైతులు

ప్రస్తుత కెఎంఎస్ లో 815.65 ఎల్ఎంటీల వరి సేకరణ

కనీస మద్దతు ధర చెల్లిస్తూ సాగుతున్న వరి సేకరణ వల్ల లబ్ది పొందిన 120.89 లక్షల మంది రైతులు

కనీస మద్దతు ధర చెల్లించి 7,80,432.88 ఎంటీల పప్పు ధాన్యాలు, నూనెగింజలను సేకరించిన ప్రభుత్వ సంస్థలు

Posted On: 09 JUN 2021 6:04PM by PIB Hyderabad

గోధుమలను పండిస్తున్న ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో ప్రస్తుత రబీ మార్కెటింగ్ సీజన్ 2021-22లో  గతంలో అమలు జరిగిన విధంగానే రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ వారు పండించిన గోధుమలను సేకరించే కార్యక్రమం సజావుగా లక్ష్యాల మేరకు కొనసాగుతోంది. ఇంతవరకు ( 08.06.2021 వరకు) గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డ్ స్థాయిలో 418.47  ఎల్ఎంటీల గోధుమలను సేకరించడం జరిగింది. గత ఏడాది ఇదే సమయానికి 373.22  ఎల్ఎంటీల గోధుమలను సేకరించడం జరిగింది. 2020-21 రబీ మార్కెటింగ్ కాలంలో సేకరించిన 389.93  ఎల్ఎంటీల గోధుమల సేకరణ ఇంతవరకు అత్యుత్తమ రికార్డ్ గా ఉంది. 

రబీ పంట కాలంలో సాగుతున్న గోధుమల సేకరణ వల్ల ఇంతవరకు దాదాపు 46 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగింది. వీరి నుంచి 82,648.38 కోట్ల రూపాయల విలువ చేసే గోధుమలను సేకరించారు. 

ఖరీఫ్ 2020-21 పంట కాలంలో వరి సేకరణ సజావుగా సాగుతోంది. వరిని పండిస్తున్న రైతుల నుంచి 816.65  ఎల్ఎంటీలకు మించి పంటను ( ఖరీఫ్ పంటకాలంలో 706.96 ఎల్ఎంటీ, రబీ పంటకాలంలో 109.69 ఎల్ఎంటీల ) 08.06.2021 వరకు సేకరించారు. గత ఏడాది ఇదే సమయానికి 736.50 ఎల్ఎంటీల వరి సేకరణ జరిగింది. పంటల పంటలను సేకరించడంవల్ల దాదాపు 120.89 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారు. వీరి నుంచి 1,54,184.14 కోట్ల రూపాయల విలువ చేసే వరిని సేకరించారు. దేశంలో వరి సేకరణ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2019-20 జరిగిన 773.45 ఎల్ఎంటీల సేకరణ ఇంతవరకు రికార్డ్ గా ఉంది. 

ఇంతేకాకుండా రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు 2020-21 ఖరీఫ్ పంటకాలం, 2021 రబీ, వేసవి కాలాల్లో 107.83  ఎల్ఎంటీల పప్పులు, నూనె గింజలను సేకరించడానికి అనుమతులు జారీ అయ్యాయి. ధర మద్దతు పథకం కింద తమిళనాడు,కర్ణాటక,మహారాష్ట్ర,తెలంగాణ,గుజరాత్,హర్యానా,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్,ఒడిశా,రాజస్థాన్,ఆంధ్రప్రదేశ్ లలో వీటి సేకరణ జరుగుతుంది. 1.74  ఎల్ఎంటీల పత్తి గింజలను సేకరించడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,తమిళనాడు,కేరళ రాష్ట్రాలకు అనుమతులు వచ్చాయి. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రతిపాదనలు అందిన తరువాత పప్పుధాన్యాలు,నూనెగింజలు,పత్తి గింజల సేకరణకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. కనీస మద్దతు ధర కంటే మార్కెట్ ధర తక్కువగా వున్నప్పుడు  నమోదు చేసుకున్న రైతులకు ధర మద్దతు పథకం కింద రాష్ట్రాలు నియమించే సంస్థల ద్వారా కేంద్ర సంస్థలు పంటలను కొనుగోలు చేస్తాయి. 

08.06.2021 వరకు కేంద్ర ప్రభుత్వం తన సంస్థల ద్వారా 4,077.48 కోట్ల రూపాయల విలువ చేసే7,80,432. 88 ఎంటీల  పెసలు,కంది,ఆవగింజలు, సోయాబీన్ ను తమిళనాడు,కర్ణాటక,ఆంధ్రప్రదేశ్,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర,గుజరాత్,ఉత్తరప్రదేశ్,తెలంగాణ,హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 4,62,440 మంది రైతుల నుంచి సేకరించింది. 

ఇదేవిధంగా, 2020-21 పంటకాలంలో52.40 కోట్ల రూపాయల విలువ చేసే  5089 ఎంటీల పత్తి గింజలను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 3961 మంది రైతుల నుంచి సేకరించడం జరిగింది. 2021-22 సీజన్ లో 51,000 ఎంటీల పత్తి గింజలను సేకరించడానికి తమిళనాడు రాష్ట్రానికి అనుమతి లభించింది. సేకరణ తేదీని రాష్ట్రప్రభుత్వం నిర్ణయిస్తుంది. 

పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు పూర్తయిన తరువాత వీటిని సేకరించడానికి అవసరమైన ఏర్పాట్లను సంబంధిత రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తున్నాయి. 

 

***

 



(Release ID: 1725811) Visitor Counter : 152