నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

కొత్త, అక్షయ ఇంధన రంగంలో సాధించిన కార్యసిద్ధి గురించి వెబినార్ల శ్రేణి నిర్వహించనున్న కొత్త మరియు అక్షయ ఇంధన మంత్రిత్వ శాఖ (ఎం ఎన్ ఆర్ ఇ)


భారతావనికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తవడాన్ని గుర్తుచేసుకుంటూ భారత ప్రభుత్వం భారత అమృతోత్సవం నిర్వహించడంలో భాగంగా వెబినార్ల శ్రేణి నిర్వహిస్తున్నారు.

Posted On: 08 JUN 2021 5:27PM by PIB Hyderabad

దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని (భారత్ కా అమృత్ మహోత్సవ్) కొనియాడుతూ గత 75 సంవత్సరాలలో సాధించిన ప్రగతిని  స్మరించుకుంటూ భారత ప్రభుత్వం అనేక ఉత్సవాలను, కార్యక్రమాలను నిర్వహిస్తోంది.  అందులో భాగంగా  ఎం ఎన్  ఆర్ ఇ  కొత్త మరియు అక్షయ ఇంధన రంగంలో  విజయాలపై 2021 మార్చి 15 నుంచి 75 వారాల  పాటు వెబినార్ల శ్రేణిని నిర్వహిస్తోంది.  ఇందుకోసం  ప్రమాణాలు మరియు నాణ్యతా నియంత్రణ కార్యకలాపాలపై  2021 జూన్ నుంచి 2022 మార్చి మధ్యలో ఐదు వారాల  కార్యక్రమాన్ని నిర్వహించాలని  సంకల్పించారు.   ఈ  వెబినార్లలో ప్రముఖులు ముఖ్యమైన అంశాలపై  కీలక ఉపన్యాసాలు చేస్తారు.   ఆ తరువాత వెబినార్లలో పాల్గొనే ప్రతినిధులతో  ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది.
2021 జూన్ 7 నుంచి 12వ తేదీ వరకు  ప్రమాణాలు మరియు నాణ్యతా నియంత్రణ కార్యకలాపాలను గురించి నిర్వహిస్తున్న కార్యక్రమంలో  ప్రధానంగా   అక్షయ ఇంధన రంగంలో ప్రమాణాల అభివృద్హి మరియు నాణ్యతకు పూచీకి  చర్యలు ఉంటాయి.   ఈ వెబినార్ తరువాత సాంకేతిక అంశాలపై ప్రతి వారం ఒక వెబినార్ ఉంటుంది.   2021 ఆగస్టులో ఎస్ పి వి మాడ్యూల్స్ ,  2021 నవంబరులో ఎస్ పి వి ఇన్వర్థర్ మరియు బ్యాటరీ నిల్వ,   2022 జనవరిలో  సోలార్ థర్మల్ సిస్టమ్స్ మరియు విండ్ టర్బైన్స్  మరియు 2022 మార్చిలో  ఎస్ హెచ్ పి  మరియు బయోగ్యాస్ ప్లాంటు /  పవర్ సిస్టమ్స్ పైన వెబినార్ ఉంటుంది.  

దేశ , విదేశాలకు చెందిన వారు  హాజరయ్యే  ఈ వెబినార్లలో  ప్రతినిధులు  తమ అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా దేశంలో   నాణ్యతా ప్రమాణాల అభివృద్ధికి  తోడ్పడపచ్చు.  పరిశోధన, విద్యా సంస్థలు, ప్రయోగశాలలకు,  ప్రమాణాల అభివృద్ధి సంస్థలు (దేశీయ మరియు అంతర్జాతీయ),   నియంత్రణ సంస్థలు,  అంచనా సంస్థలు,  గుర్తింపు సంస్థలు ,  విధాన నిర్ణేతలు,  పరిశ్రమలు,  ప్రాజెక్టుల అభివృద్ధి ,  ఆర్ధిక సంస్థలు, ప్రాజెక్టుల అమలు సంస్థలు మొదలైన వాటికి  చెందిన ప్రతినిధులు  ఈ వెబినార్లకు హాజరవుతారు.  
2021  జూన్ 7 నుంచి 12 వరకు  జరిగే మొదటి వారం వెబినార్లలో జాతీయ స్థాయి ప్రముఖులు ప్రసంగిస్తారు.  పైన పేర్కొన్న అంశాలతో సంబంధం ఉన్న , కృషిచేసిన ప్రతినిధులు వెబినార్లకు హాజరవుతారు.  జూన్ 7వ తేదీ ఉదయం 10 గంటల వరకు  200 మంది ఈ వెబినార్ కు నమోదు చేసుకున్నారు.   ఈ కార్యక్రమానికి నమోదు కోసం లింక్ :   https://forms.gle/JKpsbA1B5iQsuWo96

కొత్త మరియు అక్షయ ఇంధన మంత్రిత్వ శాఖ  ఈ రంగంలో ప్రమాణాల మెరుగుదలకు 2017 డిసెంబర్ నుంచి కృషి చేస్తున్నది.  తదనుగుణంగా దిశా నిర్దేశం చేసింది. ప్రమాణాల విషయంలో   ఒక ఉత్పత్తికి ఒక ప్రమాణం  పధ్ధతి పాటించాలని  ఎం ఎన్ ఆర్ ఇ  2020 నవంబరులో  భారత ప్రమాణాల  సంస్థ (బి ఐ ఎస్)కు సిఫార్సు చేసింది.  
 

 

****



(Release ID: 1725743) Visitor Counter : 129


Read this release in: English , Urdu , Hindi , Tamil