ఆయుష్

కోవిడ్-19 సంరక్షణకు సంబంధించిన‌ 20 ఔషధ మొక్కలపై రూపొందించిన ఈ-బుక్‌ను విడుదల చేసిన కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు

Posted On: 08 JUN 2021 8:02PM by PIB Hyderabad

కోవిడ్ -19 నుంచి సంర‌క్ష‌ణ పొందేందుకు ఉప‌యోగ‌ప‌డే 20 ఔషధ మొక్కలపై రూపొందించిన ఈ-బుక్‌ను.. కేంద్ర ఆయుష్ శాఖ స‌హాయ మంత్రి (స్వ‌తంత్ర హోదా) శ్రీ కిర‌ణ్‌ రిజిజు ఈ రోజు (మంగ‌ళ‌వారం) విడుదల చేశారు. “కోవిడ్ -19 సంరక్షణ కోసం 2021కి సంబంధించి 20 ఔషధ మొక్కలు” అనే ఈ-బుక్‌ను
జాతీయ ఔష‌ధ మొక్క‌ల బోర్డు (ఎన్‌ఎమ్‌పీబీ) రూపొందించింది. ఆయా ఔషధ మొక్కలు, వాటి చికిత్సా లక్షణాలను హైలైట్ చేస్తూ ఎన్‌ఎమ్‌పీబీ ఈ పుస్త‌కాన్ని రూపొందించింది. ఈ ఔషధ మొక్కలు ప్రామాణిక సంరక్షణతో పాటు కోవిడ్ -19 నివారణ మరియు నిర్వహణలో ఉపయోగపడతాయి. ఈ పుస్త‌కంలో వివరించిన మూలికలను జ్వరం, దగ్గు, జలుబు, వంటి బలహీనత, నొప్పి మొదలైన వాటికి దారితీసే పరిస్థితుల్లోనూ ఉపయోగించవచ్చు. ఆయా ఔష‌ధ మొక్క‌ల‌కు
సంబంధించిన శాస్త్రీయ నామాలు (బొటానికల్ పేర్లు), స్థానిక పేర్లు, రసాయన భాగాలు, చికిత్సా విలువలు, ఔషధ సూత్రాలు, ముఖ్యమైన సూత్రీకరణల‌ను కూడా నేడు విడుద‌ల చేసిన ఈ-పుస్తకంలో నమోదు చేయబడ్డాయి. ఈ బుక్‌ ప్రామాణిక సంరక్షణతో పాటుగా కోవిడ్ -19 నివారణ, నిర్వహణలో ఉపయోగపడే ఔషధ మొక్కల యొక్క ప్రాముఖ్యత, వాటిలోని వైవిధ్యత‌ను గురించి ప్రజలలో అవగాహన క‌ల్పించి జ్ఞానాన్ని అందిస్తోంది. ఈ పుస్త‌కం విడుద‌ల సంద‌ర్భంగా
శ్రీ కిర‌ణ్‌ రిజిజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఔషధ మొక్కల పెంపకం మరియు పరిరక్షణను ప్రోత్సహించడానికి నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డును చేస్తున్న కృషిని ప్రోత్సహించారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయుష్ కార్య‌ద‌ర్శి వైద్య శ్రీ‌


రాజేష్ కోటేచా మాట్లాడుతూ ఔష‌ధ మొక్కల పెంపక‌ము, పరిరక్షణ మరియు మార్కెటింగ్‌ల‌ కోసం ఎన్‌ఎమ్‌పీబీ చేసిన కృషిని ప్రశంసించారు. ఎన్ఎంపీబీ సీఈవో డాక్ట‌ర్ జె.ఎల్‌.ఎన్‌.శాస్త్రి మాట్లాడుతూ మూలికా ఔష‌ధాల వాడ‌కం గురించి ప్ర‌జ‌లు బాగా అర్థం చేసుకొనేందుకు స్థానిక ప్రజలలో త‌గిన విధంగా అవగాహన కల్పించాలని ఉద్ఘాటించారు.

 

***


(Release ID: 1725546) Visitor Counter : 353