రక్షణ మంత్రిత్వ శాఖ
వైద్య ఆక్సిజన్ సిలిండర్లను తీసుకొచ్చిన ఐఎన్‌ఎస్ తార్కాష్
Posted On:
08 JUN 2021 9:23PM by PIB Hyderabad
ఆపరేషన్ సముద్రసేతు-2 (ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్)లో భాగంగా, ఐఎన్‌ఎస్ తార్కాష్ తన మూడో ప్రయాణంలో కువైట్, సౌదీ అరేబియా నుంచి కీలక వైద్య సామగ్రిని తీసుకొచ్చింది.
కొవిడ్‌పై భారత్ చేస్తున్న యుద్ధానికి మద్దతుగా నిలుస్తున్న 'ఆక్సిజన్ సంఘీభావ వారధి'కి కొనసాగింపుగా, వివిధ దేశాల నుంచి ఆక్సిజన్, వైద్య సామగ్రిని తీసుకొస్తూ భారత నౌకాదళ నౌకలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.
గత నెల 31న, కువైట్‌లోని అల్ షువైక్ నౌకాశ్రయానికి చేరుకున్న ఐఎన్‌ఎస్ తార్కాష్, 785 ఆక్సిజన్ సిలిండర్లను లోడ్ చేసుకుంది. తర్వాత, ఈ నెల 1వ తేదీన సౌదీ అరేబియాలోని అద్ దమ్మమ్ నౌకాశ్రయం నుంచి 300 ఆక్సిజన్ సిలిండర్లను తీసుకుని మంగళవారం ఉదయం ముంబయి చేరుకుంది.
తన తొలి రెండు ప్రయాణాల్లో, దోహా, బహ్రెయిన్ నుంచి నాలుగు క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లు (ఒక్కొక్కటి 20 టన్నులు), 982 ఆక్సిజన్ సిలిండర్లను ఐఎన్‌ఎస్ తార్కాష్ భారత్‌కు తీసుకొచ్చింది.
HSQH.jpeg)
P3DH.jpeg)
***
(Release ID: 1725544)