భారత పోటీ ప్రోత్సాహక సంఘం

ఐటీ సంస్థ ఎంఫాసిస్ లిమిటెడ్‌లో బీసీపీ టాప్‌కో, వేవ‌ర్లీ పీటీఈ, ప్లాటిన‌మ్ ఓడ‌బ్ల్యూఎల్ సంస్థ‌లు వాటాను కొనుగోలు చేయ‌డానికి భార‌త పోటీ క‌మిష‌న్ స‌మ్మ‌తి

Posted On: 08 JUN 2021 5:40PM by PIB Hyderabad

ఐటీ సంస్థ ఎంఫాసిస్ లిమిటెడ్‌లో బీసీపీ టాప్‌కో, వేవ‌ర్లీ పీటీఈ, ప్లాటిన‌మ్ ఓడ‌బ్ల్యూఎల్ సంస్థ‌లు వాటాను కొనుగోలు చేయ‌డానికి గాను భార‌త పోటీ క‌మిష‌న్ (సీసీఐ) స‌మ్మ‌తి తెలిపింది. కాంపిటీష‌న్ చ‌ట్టం- 2002 సెక్ష‌న్ 31(1) ప్ర‌కారం ఎంఫాసిస్ ఐటీ సంస్థ‌లో (టార్గెట్‌- అమ్మ‌కానికి ఉన్న కంపెనీ) వాటాను బీసీపీ టాప్‌కో ఐఎక్స్ పీటీఈ లిమిటెడ్ సంస్థ (బీసీపీ టాప్‌కో), వేవ‌ర్లీ పీటీఈ లిమిటెడ్ (జీఐసీ ఇన్వెష్ట‌ర్‌), ప్లాటిన‌మ్ ఓడ‌బ్ల్యూ ఎల్ సీ 2018 ఆర్ఎస్‌సీ లిమిటెడ్ సంస్థ (ఆడియా ఇన్వెష్ట‌ర్‌) (అక్వైరెర్‌-స్వాధీనం చేసుకునే) కొనుగోలు చేసుకొనేందుకు వీలుగా సీసీఐ స‌మ్మ‌తి తెలిపింది. ప్రతిపాదిత లావాదేవీ ప్ర‌కారం బీసీపీ టాప్‌కో
ఇంటర్-కనెక్ట్ లావాదేవీల ద్వారా టార్గెట్ సంస్థ‌లో 75 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు వీలు క‌లుగునుంది. బీసీపీ టాప్‌కో అనేది ఒక ప్రైవేట్ పరిమిత సంస్థ. ఇది సింగపూర్ చట్టాల ప్రకారం ఏర్పాటు చేయబడింది. ఇది ఏర్పాటు చేసిన‌ప్ప‌టి నుండి భారతదేశంలో లేదా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార పెట్టుబడుల హోల్డింగ్ వ్యాపారాల‌లో ఎలాంటి ఉత్పత్తులను / సేవలను అందించడంలో / లేదా చేయడంలో నిమగ్నమై లేదు. జీఐసీ ఇన్వెస్టర్ అనేది సింగపూర్‌లో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక ప్రయోజన వెహిక‌ల్‌. ఇది జీఐసీ స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేత నిర్వహించబడే పెట్టుబడి హోల్డింగ్ కంపెనీల సమూహంలో భాగం. ప్లాటినం ఓడ‌బ్ల్యుఎల్ సంస్థ‌  ప్లాటినం జాస్మిన్ ట్రస్ట్ యొక్క ట్రస్టీగా పనిచేస్తోంది. దీనికి తోడుగా అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (అడాయ్‌) ప్లాటినం జాస్మిన్ ట్రస్ట్ ఏకైక లబ్ధిదారుడు మరియు సెట్లార్‌. టార్గెట్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ఇది కంపెనీ యాక్ట్, 1956 కింద నమోదు చేయబడింది.  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బీఎస్ఈ లిమిటెడ్ సంస్థ‌ల‌లో ఇది లిస్ట్‌ చేయబడింది. ఈ సంస్థ
ఐటీ అప్లికేషన్ అభివృద్ధి మరియు నిర్వహణ, మౌలిక సదుపాయాల నిర్వహణ సేవలు, నాలెడ్జ్ ప్రాసెసింగ్ సేవలు, సేవ / సాంకేతిక హెల్ప్‌డెస్క్, లావాదేవీ ప్రాసెసింగ్ సేవలు, కస్టమర్ సేవ, వ్యాపార ప్రక్రియ నిర్వహణ / వ్యాపారం వంటి క్లౌడ్ మరియు అభిజ్ఞా సేవలను అందించడంలో ప్రత్యేకతలు కలిగి ఉన్న గ్లోబల్ ఇన్‌ఫ‌ర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవా ప్రదాత. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (బీపీఓ), టెక్నాల‌జీ నో హౌ ప్రాసెస్ నైపుణ్య‌త‌ల‌ మేల‌వింపు ద్వారా
మౌలిక సదుపాయాల సేవలు, ప్రపంచవ్యాప్తంగా అందిస్తోంది ఈ ఐటీ సంస్థ‌.

ఈ వాటా కొనుగోలుకు సంబంధించి సీసీఐ నుంచి వివ‌ర‌ణాత్మ‌కమైన ఆర్డ‌ర్ రావాల్సి ఉంది.
                               

****


(Release ID: 1725540) Visitor Counter : 189


Read this release in: English , Urdu , Hindi , Tamil