భారత పోటీ ప్రోత్సాహక సంఘం
టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ ఒడిశాలోని మూడు విద్యుత్ సరఫరా సంస్థలలో 51 శాతం ఈక్విటీని కొనుగోలు చేసేందుకు సీసీఐ ఆమోదం
సీసీఐ ఆమోదంతో టాటా పవర్ చేతికి చేరనున్న వెస్ట్రన్ ఎలక్ట్రిసిటీ సప్లయి కంపెనీ ఆఫ్ ఒడిశా, సదరన్ ఎలక్ట్రిసిటీ సప్లయి కంపెనీ ఆఫ్ ఒడిశా, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ సప్లయి కంపెనీ ఆఫ్ ఒడిశా సంస్థలలోని కీలక వాటా
Posted On:
08 JUN 2021 5:43PM by PIB Hyderabad
టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ ఒడిశాలోని మూడు విద్యుత్ సరఫరా సంస్థలలో 51 శాతం మేర ఈక్విటీ షేర్‌ను కొనుగోలు చేసేందుకు గాను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. పోటీ చట్టం 2002లోని సెక్షన్ 31 (1) కింద.. ఒడిశాలోని మూడు విద్యుత్ సరఫరా సంస్థలలో 51 శాతం ఈక్విటీ వాటా మూలధనాన్ని కొనుగోలు చేయడానికి.. టాటా పవర్ కంపెనీ లిమిటెడ్‌కు (“టీపీసీఎల్”) ఈ రోజు ఆమోదం సీసీఐ ఆమోదం లభించింది. దీంతో వెస్ట్రన్ ఎలక్ట్రిసిటీ సప్లయి కంపెనీ ఆఫ్ ఒడిశా (“వెస్‌కో యుటిలిటీ”), సదరన్ ఎలక్ట్రిసిటీ సప్లయి కంపెనీ ఆఫ్ ఒడిశా (“సౌత్‌కో యుటిలిటీ”), సెంట్రల్ ఎలక్ట్రిసిటీ సప్లయి కంపెనీ ఆఫ్ ఒడిశా (“సెస్‌కో యుటిలిటీ”)సంస్థలలో 51 శాతం కీలక వాటాను టీపీసీఎల్ సంస్థ కొనుగోలు చేసేందుకు గాను మార్గం సుగమమైంది. 2003 విద్యుత్ చట్టం సెక్షన్ 20 కింద ఒడిశా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (“ఓఈఆర్‌సీ”) ప్రారంభించిన పోటీ బిడ్డింగ్ ప్రక్రియల్ని వేరుచేయడానికి అనుగుణంగా గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిశా లిమిటెడ్ (“గ్రిడ్కో”) నుండి టీసీసీఎల్ ప్రతి యుటిలిటీలో 51 శాతం ఈక్విటీ వాటా మూలధనాన్ని కొనుగోలు చేయడానికి గాను ప్రతిపాదిత కలయికలు సంబంధించినది. టాటా గ్రూపునకు చెందిన టీపీసీఎల్ పబ్లిక్ లిస్టెట్ కంపెనీ. ఈ సంస్థ ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, విద్యుత్ పంపిణీ వ్యాపారంలో నిమగ్నమై ఉంది. వెస్కో యుటిలిటీ ఒడిశాలోని ఐదు పశ్చిమ జిల్లాల్లో విద్యుత్ పంపిణీ మరియు రిటైల్ విద్యుత్ సరఫరా వ్యాపారంలో నిమగ్నమై ఉంది. ఆ జిల్లాలు.. (i) రూర్కెలా; (ii) బుర్లా (సంబల్పూర్); (iii) భవనిపట్న (కల హండి); (iv) బోలంగీర్; మరియు (v) బార్‌గర్. సౌత్‌కో యుటిలిటీ ఒడిశాలోని ఆరు దక్షిణ జిల్లాల్లో విద్యుత్ పంపిణీ, రిటైల్ సరఫరా వ్యాపారంలో నిమగ్నమై ఉంది. అవి.. (i) నగరం (గంజాం జిల్లాలోని కొన్ని ప్రాంతాలు); (ii) బెర్హాంపూర్; (iii) అస్కా; (iv) భంజనగర్; (v) జైపూర్; మరియు (vi) రాయగడ. సెస్కో యుటిలిటీ ఒడిశాలోని నాలుగు కేంద్ర జిల్లాల్లో విద్యుత్ పంపిణీ మరియు రిటైల్ సరఫరా వ్యాపారంలో నిమగ్నమై ఉంది. అవి i) భువనేశ్వర్ (భువనేశ్వర్ 1 మరియు భువనేశ్వర్ 2), ii) కటక్, iii) పరదీప్ మరియు iv) ధెంకనల్.
దీనికి సంబంధింని సమగ్రమైన ఆర్డర్ త్వరలో వెలువడనుంది.
****
(Release ID: 1725470)