భారత పోటీ ప్రోత్సాహక సంఘం
రీన్యూ గ్లోబల్ వాటాలతో రీన్యూ పవర్ వాటాల మార్పిడికి సీసీఐ ఆమోదం, ఆర్‌ఎంజీ-IIతో రీన్యూ గ్లోబల్ అనుబంధ సంస్థ విలీనానికీ అంగీకారం
Posted On:
08 JUN 2021 5:42PM by PIB Hyderabad
రీన్యూ పవర్ సంస్థ ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను రీన్యూ గ్లోబల్ సంస్థ వాటాలతో మార్పిడి చేసుకోవడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ఆర్‌ఎంజీ-IIతో రీన్యూ గ్లోబల్ అనుబంధ సంస్థ అపసవ్య త్రిభుజాకార విలీనానికీ అంగీకరించింది.
రీన్యూ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ (రీన్యూ పవర్) ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను రీన్యూ ఎనర్జీ గ్లోబల్ లిమిటెడ్ (రీన్యూ గ్లోబల్) వాటాలతో మార్పిడి చేసుకోవడం, రీన్యూ గ్లోబల్ సంపూర్ణ యాజమాన్యంలోని అనుబంధ సంస్థను ఆర్‌ఎంజీ అక్విజిషన్ కార్పొరేషన్‌తో (ఆర్‌ఎంజీ-II) అపసవ్య త్రిభుజాకార విలీనం చేయడం ఈ ఒప్పందంలో భాగం.
రీన్యూ గ్లోబల్, కొత్తగా ఏర్పాటైన ప్రత్యేక ప్రయోజన విలీన సంస్థ. విలీనం, వాటాల కొనుగోలు, ప్రతిపాదిత ఒప్పందం వంటి ఒకే విధమైన వ్యాపార విలీనాలను ప్రభావవంతంగా నిర్వహించే ఉద్దేశ్యంతో దీనిని స్థాపించారు. నాస్‌డాక్‌లో ఆర్‌ఎంజీ-II ట్రేడ్ అవుతుంది.
రీన్యూ సంస్థ, తన అనుబంధ సంస్థలు, జాయింట్ వెంచర్లతో కలిసి సాంప్రదాయేతర, పునరుత్పాదక శక్తి వనరుల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వ్యాపారంలో ఉంది.
సీసీఐ నుంచి సవివర ఆదేశం రావలసివుంది.
****
(Release ID: 1725460)
Visitor Counter : 185