రైల్వే మంత్రిత్వ శాఖ

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 26891 మెట్రిక్ టన్నుల మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ ను దేశానికి అందించాయి.


383 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ లు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ డెలివరీలను పూర్తి చేశాయి.

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు 1567 ట్యాంకర్ల మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ ను రవాణా చేసి 15 రాష్ట్రాలకు ఉపశమనం కలిగించాయి.

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా తమిళనాడుకు 3500 మెట్రిక్ టన్నుల మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ అందజేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి 50 కి పైగా ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు వచ్చాయి.

మహారాష్ట్రలో 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, ఉత్తర ప్రదేశ్‌లో దాదాపు 3797 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్‌లో 656 మెట్రిక్ టన్నులు, ఢిల్లీలో 5864 మెట్రిక్ టన్నులు, హర్యానాలో 2212 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌లో 98 మెట్రిక్ టన్నులు, కర్ణాటకలో 3214 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్‌లో 320 మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 3578 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో 2882 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌లో 225 మెట్రిక్ టన్నులు, కేరళలో 513 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 2474 మెట్రిక్ టన్నులు, జార్ఖండ్‌లో 38 మెట్రిక్ టన్నులు, అస్సాంలో 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను అన్లోడ్ చేశారు.

Posted On: 07 JUN 2021 6:09PM by PIB Hyderabad

అన్ని అడ్డంకులను అధిగమించి, ఎప్పుడూ నూతన పరిష్కారాలను కనుగొనే భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్   పంపిణీ చేయడం ద్వారా ఉపశమనం కలిగిస్తున్నది.

 

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు దేశానికి 26000 మెట్రిక్ టన్నుల మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్  ను అందించాయి.

 

ఇప్పటివరకు, భారత రైల్వే 1567 ట్యాంకర్లలో 26891 మెట్రిక్ టన్నుల మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ ను దేశంలోని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసింది.

 

383 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఇప్పటివరకు తమ ప్రయాణ లక్ష్యాలను పూర్తి చేసి వివిధ రాష్ట్రాలకు ఉపశమనం కలిగించాయి.

 

ఇప్పటి వరకు 5  ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు 19 ట్యాంకర్లలో 353 మెట్రిక్ టన్నుల ఎల్ఎమ్ఓతో ప్రయాణిస్తున్నాయి.

 

ఇప్పటివరకు మొత్తం 306 ట్యాంకర్ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ఢిల్లీకి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు అందజేశాయి.

 

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా తమిళనాడు కు 3500 మెట్రిక్ టన్నుల మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్  అందజేయడం జరిగింది.

 

ఈ రిలీజ్ విడుదలైనప్పటి వరకు తమిళనాడుకు మొత్తం 52 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు వెళ్లాయి.

 

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు వరుసగా 2800,  3200 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను అందించాయి.

 

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ డెలివరీలను ఈ ఏడాది ఏప్రిల్ 24 న మహారాష్ట్రలో 126 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మొదలుపెట్టాయి.

 

అభ్యర్థించే రాష్ట్రాలకు సాధ్యమైనంత తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ ను అందించడానికి భారత రైల్వే ప్రయత్నం చేస్తున్నది.

 

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్  అస్సాంలకు మేలు జరిగింది.

 

ఈ రిలీజ్ విడుదలైన సమయం వరకు, మహారాష్ట్రలో 614 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్, ఉత్తర ప్రదేశ్‌లో దాదాపు 3797 మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్‌లో 656 మెట్రిక్ టన్నులు, 64 ఢిల్లీలో 5864 మెట్రిక్ టన్నులు, హర్యానాలో 2212 మెట్రిక్ టన్నులు, రాజస్థాన్‌లో 98 మెట్రిక్ టన్నులు, కర్ణాటకలో 3214 మెట్రిక్ టన్నులు, ఉత్తరాఖండ్‌లో 320 మెట్రిక్ టన్నులు, తమిళనాడులో 3578 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌లో 2882 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌లో 225 మెట్రిక్ టన్నులు, కేరళలో 513 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 2474 మెట్రిక్ టన్నులు, జార్ఖండ్‌లో 38 మెట్రిక్ టన్నులు, అస్సాంలో 400 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ను డెలివరీ చేశారు.

 

ఇప్పటివరకు దేశంలోని 15 రాష్ట్రాల్లోని 39 నగరాల్లో / పట్టణాల్లో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఆక్సిజన్ ట్యాంకర్లను డెలివరీ చేశాయి.  లక్నో, వారణాసి, కాన్పూర్, బరేలీ, గోరఖ్‌పూర్ & ఆగ్రా ఉత్తరప్రదేశ్, సాగర్, జబల్పూర్, కాట్ని, భోపాల్ మధ్యప్రదేశ్, హైదరాబాద్, వైజాగ్, నాగ్‌పూర్, నాసిక్ ,  కేరళలోని ఎర్నాకుళం, తిరువల్లూరు, చెన్నై, టుటికోరిన్, కోయంబత్తూరు & తమిళనాడులోని మదురై, పంజాబ్‌లోని భటిండా & ఫిలౌర్, అస్సాంలోని కామ్రూప్, జార్ఖండ్‌లోని రాంచీ వంటి నగరాలకు ఇవి వెళ్లాయి. భారతీయ రైల్వేలు ఆక్సిజన్ సరఫరా కోసం వేర్వేరు మార్గాలతో రూట్మ్యాప్ చేశాయి.  రాష్ట్రాల్లో  ఏవైనా  అత్యవసర పరిస్థితులు తలెత్తితే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ ను తీసుకురావడానికి రాష్ట్రాలు భారత రైల్వేకు ట్యాంకర్లను అందిస్తాయి.  భారత రైల్వే పశ్చిమంలోని హపా, బరోడా, ముంద్రా  తూర్పున రూర్కెలా, దుర్గాపూర్, టాటానగర్, అంగుల్ వంటి ప్రదేశాల నుండి ఆక్సిజన్ తీసుకొని దానిని ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, పంజాబ్, కేరళ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ & అస్సాంలో సంక్లిష్ట మార్గాలు ఉన్న ప్రాంతాలకు రవాణా చేశాయి. ఆక్సిజన్ సాధ్యమైనంత వేగంగా చేరుకునేలా చూడటానికి, రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రవాణా రైళ్లను నడపడంలో కొత్త ప్రమాణాలను,  అపూర్వమైన రికార్డులను సృష్టిస్తోంది. ఈ క్లిష్టమైన సరుకు రవాణా రైళ్ల సగటు వేగం చాలా సందర్భాలలో 55 కిలోమీటర్ల కన్నా ఎక్కువ. అధిక ప్రాధాన్యత కలిగిన గ్రీన్ కారిడార్‌లో, అత్యంత ప్రాధాన్యతో కార్యాచరణ బృందాలు చాలా క్లిష్టమైన పరిస్థితులలో 24 గంటలూ పనిచేస్తున్నాయి. ఆక్సిజన్ ను వేగంగా పంపేందుకు ఎంతో శ్రమిస్తున్నాయి. వివిధ విభాగాల్లో సిబ్బంది మార్పుల కోసం టెక్నికల్ స్టాపేజీల వ్యవధిని 1 నిమిషానికి తగ్గించారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లకు ఆటంకాలు లేకుండా చేయడానికి అన్ని ట్రాక్‌లనూ తెరిచి ఉంచుతున్నారు. అంతటా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇతర సరుకు రవాణా వేగం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నారు. ఆక్సిజన్‌ సరఫరా క్లిష్టభరితమైనది. గణాంకాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తారు. మరిన్ని ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు రాత్రి తరువాత వాటి ప్రయాణాలను ప్రారంభిస్తాయని భావిస్తున్నారు.

 

***



(Release ID: 1725220) Visitor Counter : 216