పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

వారణాసి విమానాశ్రయం 1800 కిలోల వ్యాక్సిన్ రవాణాను సులభతరం చేసింది


వివిధ నగరాల నుండి 128 కి పైగా ఆక్సిజన్ కాన్సట్రేటర్ల రవాణా

కోవిడ్ రోగులను తీసుకెళ్లే ప్రత్యేక వైద్య విమానాలకు సౌకర్యాలు కల్పించాయి

Posted On: 07 JUN 2021 7:01PM by PIB Hyderabad

కొవిడ్‌ రోగులు, మందులు మరియు అవసరమైన పరికరాలను వారణాసి వెలుపల ఇతర ప్రాంతాలకు రవాణా చేయడంలో వారణాసి విమానాశ్రయం చురుకుగా పనిచేస్తోంది. షెడ్యూల్డ్ మరియు షెడ్యూల్ కాని విమానాలను ఆపరేట్‌ చేయడంలో వారణాసి విమానాశ్రయం ప్రముఖంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిబంధనలు మరియు ప్రోటోకాల్‌లను నిర్దేశించడానికి తగిన శ్రద్ధ మరియు ప్రాముఖ్యతను ఇస్తాయి.

 



ఈ విమానాశ్రయం జనవరి 2021 నుండి 1800 కిలోల కంటే ఎక్కువ వ్యాక్సిన్ రవాణాను సులభతరం చేసింది. అలాగే వివిధ నగరాల నుండి 128 కి పైగా ఆక్సిజన్ కాన్సట్రేటర్లను తరలించడంలో సహాయ పడింది. ఢిల్లీ మరియు ముంబైతో పాటు ఇతర నగరాలకు కొవిడ్‌ రోగుల చార్టర్ మరియు మెడికల్ విమానాల ద్వారా తరలించారు. కొవిడ్ రోగులను తీసుకెళ్లే ప్రత్యేక వైద్య విమానాలు కూడా వారణాసి విమానాశ్రయం ద్వారా సౌకర్యాలు కల్పించబడ్డాయి. లండన్, మస్కట్, దుబాయ్ మొదలైన అంతర్జాతీయ విమానాలను నిర్వహించడంతో పాటు వారణాసి మరియు చుట్టుపక్కల ప్రజలను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించడం కొనసాగించింది. ప్రయాణీకులకు టెర్మినల్ నుండి బోర్డింగ్ గేట్ వరకు పరిశుభ్రత యొక్క అధిక ప్రమాణాలను కొనసాగిస్తూ ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది. అలాగే వాడిన మాస్క్‌లు, పిపిఇ కిట్లను సురక్షితమైన విధానంలో డిస్పోజల్ చేస్తున్నారు.

ప్రయాణీకులు, వాటాదారులు, సందర్శకులు మరియు ఉద్యోగులందరూ నిరంతరం కోవిడ్ జాగ్రత్తలను అనుసరించాలని మరియు రద్దీని తగ్గించడానికి స్థిరమైన సమయాన్ని కొనసాగించాలని విమానాశ్రయ సిబ్బంది నిరంతరం సూచిస్తున్నారు. కొవిడ్ జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించడానికి ప్రయాణీకుల భద్రతకు భరోసా ఇవ్వడానికి అనేక ఎలక్ట్రానిక్ మానిటర్లు, టెర్మినల్ వద్ద డిస్ప్లేలు (సిగ్నేజ్), ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వాయిస్ ప్రకటనలు మరియు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సూచనలను ప్రదర్శించడం జరుగుతోంది. తద్వారా విమానాశ్రయం సురక్షితంగా ఉంటుంది.

ఇవే కాకుండా కొవిడ్‌ 19 వ్యాప్తి చెందకుండా ఉండటానికి విమానాశ్రయంలోని ఫ్రంట్‌లైన్ కార్మికులందరికీ వారణాసి విమానాశ్రయం టీకా శిబిరాలను ఏర్పాటు చేసింది.

***



(Release ID: 1725198) Visitor Counter : 204


Read this release in: English , Urdu , Hindi , Punjabi