సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తన సొంత లోక్సభ నియోజకవర్గమైన ఉధంపూర్–-కథువా–-దోడాలోని కొవిడ్ బాధిత చిన్నారుల కోసం రూ.10 లక్షలు ఇచ్చారు.
ప్రస్తుత మహమ్మారి సమయంలో కుటుంబ పోషకులను కోల్పోయిన బాలల బృందాన్ని మంత్రి కలుసుకున్నారు.
Posted On:
05 JUN 2021 6:06PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తన లోక్‌సభ నియోజకవర్గం ఉధంపూర్– -కథువా– -దోడాలోని కరోనా బాధిత చిన్నారుల కోసం వ్యక్తిగతంగా సేకరించిన, విరాళాలుగా తీసుకున్న రూ.10 లక్షలను శనివారం ఇచ్చారు. ఈ నియోజకవర్గంలోని ఆరు జిల్లాలకు నోడల్ అథారిటీ అయిన కతువా డిప్యూటీ కమిషనర్ రాహుల్ యాదవ్ ఈ మొత్తానికి చెక్ అందుకున్నారు.
కతువా పర్యటనలో భాగంగా డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తుత మహమ్మారి సమయంలో కుటుంబ పోషకులను కోల్పోయిన బాలల బృందాన్ని కూడా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ఆప్తులను కోల్పోయిన కలిగితే ఏర్పడే నష్టాన్ని భర్తీ చేయడం ఏ విధంగానూ సాధ్యం కాదని అన్నారు. కానీ మన మనస్సాక్షి పిలుపు మేరకు బాధిత బాలలకు అండగా నిలబడటానికి చాలా చిన్న ప్రయత్నం చేశామని అన్నారు. కొవిడ్ నేపథ్యంలో కుటుంబ సంరక్షులను కోల్పోయిన బాలలకు ఇది చాలా తక్కువ సహకారమని సింగ్ అన్నారు. అయితే రాబోయే కాలంలో మరింత సహాయాన్ని సేకరించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఇటువంటి బాలలకు గణనీయమైన ఆర్థిక సహాయాన్ని ప్రకటించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుకొచ్చారని, భారీ విపత్తుతో బాధపడుతున్న వారికి సహాయపడటానికి వివిధ మార్గాల్లో సాధ్యమైనంతవరకు సహకరించడానికి లేదా చేయూత అందించడానికి ప్రధానమంత్రి తీసుకుంటున్న చర్యలు అందరికీ స్ఫూర్తినిస్తాయని ఆయన అన్నారు.
ప్రస్తుత రూ.10 లక్షలే కాకుండా తన లోక్‌సభ నియోజకవర్గంలోని వివిధ జిల్లాల్లో కోవిడ్ కేర్ సదుపాయాలు కల్పించడం కోసం డాక్టర్ జితేంద్ర సింగ్ తన ఎంపీ ఫండ్ నుండి ఇది వరకే రూ .2.5 కోట్లు కేటాయించారు. ఈ ఫండ్ నుంచి రూ .2.1 కోట్లకు పైగా డబ్బుతో కోవిడ్ సంబంధిత వస్తువులను ఇప్పటికే కొనుగోలు చేశారు. వీటిని స్థానికంగా పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యక్తిగత చొరవతో వివిధ వనరుల నుండి సేకరించిన ఐదు కొవిడ్సంబంధిత వస్తువులను గత ఒక నెలలో నియోజకవర్గంలోని ఆరు జిల్లాలతో పాటు జమ్మూ ప్రాంతంలోని మరికొన్ని ప్రాంతాలకు పంపించారు. కాశ్మీర్ లోయకు కూడా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, తాను ఒక నెలకు పైగాకొవిడ్తో బాధపడ్డానని, ఆసుపత్రిలో చేరడానికి ముందు తన చివరి పర్యటన సందర్భంగా ఉధంపూర్ జిల్లాలో రూ.200 కోట్ల ఖర్చుతో ఉదంపూర్లో నిర్మించిన మన్సర్ సరస్సు ప్రాజెక్టు ను ప్రారంభించినట్టు తెలిపారు. తన నియోజకవర్గానికి కతువా నోడల్ జిల్లాగా ఉందని అన్నారు. దేవుని దయతో కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత తన మొట్టమొదటి పర్యటన మళ్ళీ తన నియోజకవర్గమే కావడం సంతోసంగా ఉందని ఆయన అన్నారు. గత సంవత్సరం కరోనా అనుభవాల నుంచి నేర్చుకున్న తరువాత, నియోజకవర్గంలోని ఆరు జిల్లాలు వ్యాధి నియంత్రణలో మెరుగ్గా పనిచేయగలిగాయని ప్రశంసించారు. మహమ్మారి తీవ్రత ఇతర జిల్లాల కంటే తక్కువ ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సవాలును ఎదుర్కోవడానికి పరిపాలన, వైద్య అధికారులు, పార్టీ నాయకత్వం, పౌర సమాజాలు సంపూర్ణ సమన్వయంతో పనిచేశాయని మంత్రి ప్రశంసించారు.
ప్రతి జిల్లాలో తగినంత ఆక్సిజన్ సరఫరా, తగినన్ని కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నప్పటికీ, ఆక్సిజన్ మిగులు నిల్వలు ఉండే కతువా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని అన్నారు. ప్రారంభ రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్లో కొద్దిసేపు ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు, తక్షణ ప్రత్యామ్నాయంగా స్థానిక సమాజం విశ్వాసాన్ని నిలబెట్టుకోవటానికి పొరుగు జిల్లాల నుండి ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించడాన్ని ఆయన ప్రస్తావించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్సిజన్ లభ్యత గురించి ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకోసం స్థానిక నాయకులు అందజేసిన సహకారాన్ని ఆయన ప్రశంసించారు. మహమ్మారి సమయంలో మనమందరం విభేదాలను పక్కనబెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కరోనాకు వ్యతిరేకంగా జరిగే యుద్ధం కోసం శక్తిని అందించడానికి ఇది సరైన సమయం అని డాక్టర్ జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. సమాజానికి సేవ చేస్తున్నప్పుడు, ప్రభుత్వానికి సహకరించేటప్పుడు, మన వల్ల ఆరోగ్య అధికారుల పనికి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గత రెండు వారాల్లో జమ్మూ కాశ్మీర్‌లో కరోనా క్షీణించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ కమిషనర్ కతువా, రాహుల్ యాదవ్ ఈ సందర్భంగా కొవిడ్ నిర్వహణకు సంబంధించిన సంక్షిప్త ప్రదర్శన ఇచ్చారు. స్థానిక సీనియర్ అధికారులు ప్రజా ప్రతినిధులతో పాటు డీడీసీ చైర్మన్, కల్నల్ మహన్ సింగ్, డిడిసి వైస్ చైర్మన్ రఘునందన్ సింగ్ బాబ్లూ, కతువా మునిసిపల్ చైర్మన్ నరేష్ శర్మ, లఖన్పూర్ మునిసిపల్ చైర్మన్ రవీందర్ శర్మ, మాజీ మంత్రి రాజీవ్ జస్రోటియా, సీనియర్ నాయకులు ప్రేమ్‌నాథ్ డోగ్రా, జనక్ భారతి, గోపాల్ మహాజన్, రశ్పాల్ వర్మ, హీరానగర్ మునిసిపల్ చైర్మన్ అడ్వకేట్ విజయ్ శర్మ, మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ రాజ్, రాజేష్ మెహతా తదితరులు పాల్గొన్నారు. కథువాకు చేరుకున్న వెంటనే, డాక్టర్ జితేంద్ర సింగ్ మొట్టమొదట జనసంఘ్ నాయకుడు చౌదరి చాగర్ సింగ్ నివాసాన్ని సందర్శించారు. 101 సంవత్సరాల వయస్సులో ఇటీవల ఆయన మరణించారు. మంత్రి చౌదరి కుటుంబానికి తన సంతాపం తెలిపారు.
***
(Release ID: 1724812)
Visitor Counter : 209