వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

వరి సేకరణ మొత్తం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. గత ఏడాది అత్యధిక రికార్డును అధిగమించింది


కొనసాగుతున్న కెఎంఎస్ 2020-21 మరియు ఆర్‌ఎంఎస్‌లో 805.21 ఎల్‌ఎంటీల వరి ఎంఎస్‌పి వద్ద సేకరించబడింది

గత సంవత్సరం సంబంధిత కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం 12.33% ఎక్కువ గోధుమలను సేకరించారు

గత సంవత్సరం 368.45 ఎల్‌ఎమ్‌టి కొనుగోలు జరగ్గా ఈ ఏడాది ఇప్పటివరకు 413.91 ఎల్‌ఎమ్‌టి గోధుమలు సేకరించారు

కొనసాగుతున్న గోధుమల సేకరణ వల్ల సుమారు 45.06 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు

ప్రభుత్వ సంస్థలు ఎంఎస్‌పిపై 7,51,279.59 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజలను సేకరించాయి

Posted On: 05 JUN 2021 5:30PM by PIB Hyderabad

మునుపటి సీజన్లలో చేసినట్లుగానే ఇప్పటి వరకు (04.06.2021 వరకు) 413.91 ఎల్ఎమ్‌టి గోధుమలు సేకరించబడ్డాయి (ఇది అన్ని సమయాలతో పాటు గత ఆర్‌ఎంఎస్ 2020-21 అత్యధిక రికార్డు అయిన 389.92 ఎల్‌ఎమ్‌టిను అధిగమించింది) అలాగే గత సంవత్సరం సేకరించిన 368.45 ఎల్‌ఎమ్‌టి కొనుగోలును దాటింది. తద్వారా సుమారు 45.06 లక్షల మంది రైతులు  ఆర్‌ఎంఎస్ సేకరణ కార్యకలాపాల ద్వారా రూ.81,747.81 కోట్లు లబ్ధి పొందారు.

 

 


కొనసాగుతున్న సీజన్లో వరి సేకరణ ఖరీఫ్ 2020-21 805.21 ఎల్ఎమ్‌టిల వరిని (ఖరీఫ్ క్రాప్ 706.93 ఎల్‌ఎమ్‌టి మరియు రబీ క్రాప్ 98.28 ఎల్‌ఎమ్‌టిలను కలిగి ఉంది) గత సంవత్సరం 04.06.2021 వరకు 732.40 ఎల్‌ఎమ్‌టి కొనుగోలుతో పోలిస్తే కొనుగోలు రాష్ట్రాలలో సజావుగా కొనసాగుతోంది. సుమారు 119.42 లక్షల మంది రైతులు ఇప్పటికే కొనసాగుతున్న కెఎంఎస్ సేకరణ కార్యకలాపాల నుండి  ఎంఎస్‌పి విలువ అయిన రూ. 1,52,022.37 కోట్లు లబ్ధి పొందారు. వరి సేకరణ కూడా అత్యధిక స్థాయికి చేరుకుంది. ఇది కెఎంఎస్‌ 2019-20లో మునుపటి గరిష్ట స్థాయి 773.45 ఎల్‌ఎంటీను అధిగమించింది.
 


ధరల మద్దతు పథకం (పిఎస్ఎస్) కింద తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రతిపాదన ఆధారంగా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21 & రబీ మార్కెటింగ్ సీజన్ 2021 మరియు సమ్మర్ సీజన్ 2021 యొక్క 107.81 ఎల్ఎమ్టి పప్పులు మరియు నూనె గింజల కొనుగోలుకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,  తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు 1.74 ఎల్ఎంటి కొప్రా (శాశ్వత పంట) కొనుగోలుకు అనుమతి. ఇతర రాష్ట్రాలు / యుటిల కొరకు పిఎస్ఎస్ కింద పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు కొప్రాల సేకరణకు ప్రతిపాదనలు వచ్చిన తరువాత కూడా అనుమతి ఇవ్వబడుతుంది, తద్వారా ఈ పంటల యొక్క ఎఫ్‌ఏక్యూ గ్రేడ్ సేకరణను 2020-21 సంవత్సరానికి రాష్ట్ర నామినేటెడ్ ప్రొక్యూర్ ఏజెన్సీల ద్వారా సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు సంబంధిత రాష్ట్రాలు / యుటిలలో నోటిఫైడ్ హార్వెస్టింగ్ వ్యవధిలో మార్కెట్ రేటు ఎంఎస్‌పి కంటే తక్కువగా ఉంటే నోటిఫైడ్ ఎంఎస్పి వద్ద రిజిస్టర్డ్ రైతుల నుండి నేరుగా పొందవచ్చు.

తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హర్యానా మరియు రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని రైతుల నుండి ఖరీఫ్ 2020-21 & రబీ 2021 కింద 04.06.2021 వరకు ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా 7,51,279.59 మెట్రిక్ టన్నుల పెసర, మినప, కంది,గ్రామ్,మసూర్, వేరుశనగ, ఆవ మరియు సోయాబీన్‌ను కొనుగోలు చేసింది. తద్వారా 4,43,412 మంది రైతులు రూ.3,928.50 కోట్ల ఎంఎస్‌పి ప్రయోజనం పొందారు.

అదేవిధంగా 2020-21 పంటల కాలంలో కర్ణాటక, తమిళనాడులలోని 3,961 మంది రైతులకు  లబ్ధి చేకూర్చే విధంగా రూ .52.40 కోట్లు విలువైన 5,089 మెట్రిక్ టన్నుల కొప్రా (శాశ్వత పంట)  కొనుగోలు జరిగింది. అలాగే 2021-22 సీజన్‌కు గాను తమిళనాడు నుండి 51,000 మెట్రిక్ టన్నుల కొప్రా కొనుగోలుకు అనుమతి ఇవ్వబడింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుండి సేకరణ ప్రారంభమవుతుంది.

పప్పుధాన్యాలు మరియు నూనె గింజల రాక ఆధారంగా ఆయా రాష్ట్రాలు నిర్ణయించిన తేదీ నుండి సంబంధిత రాష్ట్ర / యుటి ప్రభుత్వాలు సేకరణ ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

 

 

 

***


(Release ID: 1724811) Visitor Counter : 166