విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఐరాస సిఇఒ వాటార్ మాండేట్ లో చేరిన ఎన్‌టిపిసి; తగ్గించు, పునరుపయోగం, పునర్వినియోగం ద్వారా నీటి పొదుపుకు మరింత కృషి
Posted On:
05 JUN 2021 12:39PM by PIB Hyderabad
విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద విద్యుత్ యుటిలీటీ అయిన ఎన్‌టిపిసి లిమిటెడ్, ఇండియా, ప్రతిష్ఠాత్మక ఐక్యరాజ్య సమితి గ్లోబల్ కాంపాక్ట్ సిఇఒ జల వ్యవస్థీకరణ సంతకం చేసింది. ప్రభావవంతమైన జల నిర్వహణపై దృష్టి పెట్టే ప్రతిష్ఠాత్మక కంపెనీల బృందంలో ఎన్‌టిపిసి చేరడంతో, దాని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ జల నాయకత్వానికి నిరంతరం పెరుగుతున్న ప్రాముఖ్యతను గుర్తించి, అత్యంత విలువైన సహజ వనరు పొదుపు కోసం పని చేస్తున్న ఎంపిక చేసిన వాణిజ్యవేత్తల బృందంలో చేరారు. ఇప్పటికే ఎన్‌టిపిసి తమ ప్లాంట్లు ఉన్న ప్రాంతాలలో పటిష్ఠమైన జల నిర్వహణకు అనేక చర్యలను చేపట్టింది. ఎన్‌టిపిసి తన కీలక కార్యకలాపమైన విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్న సందర్భంలో నీటి పొదుపు, నిర్వహణ కోసం తగ్గించు, పునరుపయోగం, పునర్వినియోగం (3 ఆర్‌లు - రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్)ను స్వీకరించనుంది.
దీర్ఘకాలిక స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా మెరుగైన జల, పారిశుద్ధ్య అజెండాల పట్ల తమ చిత్త శుధ్ధిని, కంపెనీల కృషిని ప్రదర్శించేందుకు చేపట్టినదే ఐరాస గ్లోబల్ కాంపాక్ట్ చొరవలో భాగమైన సిఇఒ వాటర్ మాండేట్. సమగ్రమైన నీటి వ్యూహాలను విధానాలను అభివృద్ధి చేసి, అమలు చేసి ప్రకటించడంలో కంపెనీలకు తోడ్పడేందుకు రూపొందించిందే సిఇఒ వాటర్ మాండేట్. ఏకరూపత ఉన్న వ్యాపారాలతో , యుఎన్ ఏజెన్సీలు, ప్రభుత్వ అధికారులు, పౌర సంఘాలు, ఇతర కీలక భాగస్వాములతో భాగస్వామ్యం కోసం ఇది వేదికను కల్పిస్తుంది.
ప్రపంచంలోని అనేక భాగాలలో జల, పారిశుద్ధ్య సంక్షోభం పెరిగిపోవడం అన్నది విస్త్రతమైన సమస్యలకు తావిస్తుంది, కొన్ని సందర్భాలలో అన్ని రంగాలలోని కంపెనీలకు అవకాశాలను కల్పిస్తుంది. నీటి విధానాన్ని అమలు చేయడం ద్వారా స్థిరమైన నీటి సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు ఎన్‌టిపిసి కట్టుబడి ఉంది. ఇది నీటి నిర్వహణ వ్యూహాలను, వ్యవస్థలను, ప్రక్రియలను, పద్ధతులను, పరిశోధన చొరవలకు ఇది నిర్దేశకంగా ఉపయోగపడుతుంది.
***
(Release ID: 1724684)