ప్రధాన మంత్రి కార్యాలయం
మారిశస్ ప్రధాని మాన్య శ్రీ ప్రవీంద్ కుమార్ జగన్నాథ్ కు ఫోన్ చేసి, సర్ అనిరూద్ధ జగన్నాథ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
04 JUN 2021 6:37PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మారిశస్ ప్రధాని మాన్య శ్రీ ప్రవీంద్ కుమార్ జగన్నాథ్ కు ఫోన్ చేసి, శ్రీ ప్రవీంద్ కుమార్ జగన్నాథ్ తండ్రి సర్ అనిరూద్ధ జగన్నాథ్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మారిశస్ లో సర్ అనిరూద్ధ జగన్నాథ్ దీర్ఘకాలం పాటు చేసిన ప్రజా సేవ ను స్మరించుకొన్నారు. ఆ కాలం లో సర్ అనిరూద్ధ జగన్నాథ్ అనేక సంవత్సరాల పాటు ప్రధాని గా, అధ్యక్షుని గా సేవల ను అందించారు.
అన్ని రాజకీయ పక్షాల తో సహా భారతదేశం లో సర్ అనిరూద్ధ జగన్నాథ్ పట్ల ప్రగాఢ గౌరవం నెలకొందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడి చేస్తూ, మారిశస్ తో భారతదేశం తాలూకు విశేష మిత్రత్వం వృద్ధి చెందడం లో సర్ అనిరూద్ధ జగన్నాథ్ మహత్వపూర్ణమైనటువంటి పాత్ర ను పోషించడాన్ని ప్రశంసించారు.
సర్ అనిరూద్ధ జగన్నాథ్ ను ‘మహనీయుడైన ప్రవాసీ భారతీయుడు’ గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ, సర్ అనిరూద్ధ జగన్నాథ్ ను ప్రవాసీ భారతీయ పురస్కారం తో పాటు పద్మ విభూషణ్ తో సత్కరించే సౌభాగ్యం భారతదేశాని కి దక్కింది అని పేర్కొన్నారు.
సర్ అనిరూద్ధ జగన్నాథ్ వారసత్వ స్మృతి లో విశేష ద్వైపాక్షిక సంబంధాల ను మరింత బలోపేతం చేసుకోవడానికి, గాఢతరం గా మలచుకోవడానికి ఇద్దరు నేత లు తాము కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు.
***
(రిలీజ్ ఐడి: 1724603)
సందర్శకుల సూచీ సంఖ్య : : 212
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam