విద్యుత్తు మంత్రిత్వ శాఖ

టీకా శిబిరాల‌ను నిర్వ‌హిస్తున్న ప‌వ‌ర్‌గ్రిడ్

Posted On: 03 JUN 2021 4:01PM by PIB Hyderabad

విద్యుత్ మంత్రిత్వ శాఖ‌, భార‌త ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని మ‌హార‌త్న ప్ర‌భుత్వ రంగ సంస్థ ప‌వ‌ర్ గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ప‌వ‌ర్‌గ్రిడ్‌). ప్ర‌స్తుత మ‌హ‌మ్మారి కాలంలో జీవితాల‌ను కాపాడేందుకు అత్యంత కీల‌క‌మైన ఆయుధంగా వాక్సినేష‌న్ ఉద్భ‌వించింది. ఈ క్ర‌మంలో, భార‌త‌దేశ వ్యాప్తంగా ఉన్న త‌న సంస్థ‌ల‌కు చెందిన సిబ్బందికి, వారి కుటుంబ స‌భ్యుల‌కు ప‌వ‌ర్‌గ్రిడ్ వాక్సినేష‌న్ శిబిరాల‌ను నిర్వ‌హిస్తోంది. కోవిడ్ 19 మ‌హ‌మ్మారి నుంచి త‌మ సిబ్బంది, వారి కుటుంబ స‌భ్యులు, ప‌ద‌వీవిర‌మ‌ణ చేసినఉద్యోగులు, వారి కుటుంబాలు, కాంట్రాక్టు ఉద్యోగులు స‌హా ఇత‌ర ల‌బ్ధిదారుల‌కు కూడా ఈ వాక్సినేష‌న్ శిబిరాలు సేవ‌లు అందిస్తున్నాయి. 
ఈ వాక్సినేష‌న్ శిబిరాల‌ను కొన‌సాగిస్తూ, ప‌శ్చిమ ప్రాంతం - IIలోని భుజ్ - II స‌బ్ స్టేష‌న్ (గుజ‌రాత్‌)లో ప‌వ‌ర్‌గ్రిడ్ ఒక శిబిరాన్ని నిర్వ‌హించింది. ఇందులో దాదాపు 244 వ్య‌క్తులకు (ప‌వ‌ర్‌గ్రిడ్ సిబ్బంది/  కెఇసి సిబ్బంది/  ట్రాన్స్ రెయిల్ సిబ్బంది/  కాంట్రాక్టు కార్మికులు త‌దిత‌రులు) టీకాక‌ర‌ణ జ‌రిగింది. 
ఇటువంటి మ‌రొక శిబిరాన్ని2 జూన్‌, 2021న‌ షికార్‌పూర్ (పూణె- మ‌హారాష్ట్ర‌)లో నిర్వ‌హించింది. ఈ శిబిరంలో ప‌వ‌ర్‌గ్రిడ్ షికార్‌పూర్ కార్యాలయానికి చెందిన 140మంది వ్య‌క్తుల‌కు టీకా వేశారు. ప‌శ్చిమ ప్రాంతం -I ప‌రిధిలో ఉన్న ప‌లు స‌బ్ స్టేష‌న్ల‌లో కూడా వాక్సినేష‌న్ డ్రైవ్‌ల‌ను ఏర్పాటు చేశారు. 
తూర్పు ప్రాంతం -I కింద‌కు వ‌చ్చే సీతామ‌డి స‌బ్ స్టేష‌న్ (బీహార్‌)లో కూడా వాక్సినేష‌న్ శిబిరాన్ని నిర్విహించ‌గా, ఇక్క‌డ కోవిడ్ -19 నుంచి కాపాడేందుకు 71మందికి టీకాలు వేశారు. 
ఉత్త‌ర ప్రాంతం -III ప‌రిధిలోని రెసిడెన్షియ‌ల్ కాల‌నీలో సిబ్బంది, వారిపై ఆధార‌ప‌డిన‌వారి కోసం ఆగ్రా స‌బ్ స్టేష‌న్ వాక్సినేష‌న్ శిబిరాన్ని నిర్వ‌హించింది. ఈ శిబిరంలో అంద‌రు వ్య‌క్తుల‌కూ ఉచితంగా టీకా వేశారు. కాల‌నీలో మిగిలిపోయిన వ్య‌క్తులంద‌రికీ కూడా టీకా వేసేందుకు  5 జూన్ 2021న ఆగ్రా స‌బ్ స్టేష‌న్ మరొక వాక్సినేష‌న్ శిబిరాన్ని నిర్వ‌హించ‌నుంది. ఈ శిబిరంతో ఆగ్రా స‌బ్ స్టేష‌న్ త‌న సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు, కుటుంబ స‌భ్యుల‌కు పూర్తి టీకాక‌ర‌ణను పూర్తి చేస్తుంది. 
దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌వ‌ర్ గ్రిడ్ సంస్థ‌ల‌లో వాక్సినేష‌న్ శిబిరాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ వాక్సినేష‌న్ శిబిరాల‌ను జాతీయ మిష‌న్‌లో భాగంగా నిర్వ‌హిస్తున్నారు. 

 

***
 



(Release ID: 1724142) Visitor Counter : 105