సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

శంఘాయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ సభ్యత్వ దేశాలన్నిటి మధ్య ‘‘మాస్ మీడియా రంగం లో సహకారం’’ అంశం పై ఒక ఒప్పందం పైన సంతకాలు చేసి, ఆ ఒప్పందాన్ని ధ్రువపరచటానికి గాను ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 02 JUN 2021 12:56PM by PIB Hyderabad

శంఘాయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ లో సభ్యత్వం కలిగివున్న దేశాలు అన్నిటి మధ్య ‘‘మాస్ మీడియా రంగం లో సహకారం’’ అంశం పై ఒక ఒప్పందం పైన సంతకాలు చేసి, ఆ ఒప్పందాన్ని ధ్రువపరచటానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.  ఈ ఒప్పందం పై 2019వ సంవత్సరం లో జూన్ నెల లో సంతకాలు అయ్యాయి.

మాస్ మీడియా రంగం లో సంఘాల మధ్య పరస్పరం సమానమైనటువంటి, ప్రయోజనకరమైనటువంటి సహకారాన్ని ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుంది.  ప్రతి పక్షమూ ఆదాన ప్రదానం ఆధారం గా, కార్యకలాపాల కు వీలు కల్పిస్తూ, సమానత కు పెద్ద పీట వేయాలి.  మాస్ మీడియా రంగం లో ఉత్తమ అభ్యాసాల ను పంచుకోవడానికి, ఆ రంగం లో కొత్త కొత్త ఆవిష్కరణల కు ఒక అవకాశాన్ని సభ్యత్వ దేశాల కు ఈ ఒప్పందం అందిస్తుంది.

విశేషాంశాలు:

సహకారాన్ని అందించుకొనే ప్రధాన రంగాలు ఈ కింది విధం గా ఉన్నాయి:

i.      ఆయా దేశాల ప్రజల జీవనం గురించిన జ్ఞ‌ానాన్ని మరింత ఎక్కువ గా అవగాహన చేసుకోవడం కోసం మాస్ మీడియా ద్వారా సమాచారాన్ని పరస్పరం వ్యాప్తి చేయడానికి- అది కూడా విస్తృత స్థాయి లో- వ్యాప్తి చేయడానికి గాను అనుకూలమైనటువంటి స్థితిగతుల ను నెలకొల్పడం;

ii.      ఆయా దేశాల మాస్ మీడియా తాలూకు సంపాదకీయ కార్యాలయాల మధ్య, అలాగే సంబంధిత మంత్రిత్వ శాఖ లు, మాస్ మీడియా రంగం లో పనిచేస్తున్న ఏజెన్సీ స్, సంస్థ ల మధ్య సహకారం.  ఈ విధమైన సహకారానికి సంబంధించి ఏవైనా నిర్దిష్టమైన షరతుల ను గాని, నిర్దిష్టమైనటువంటి రూపాల ను గాని భాగస్వామ్య దేశాలు వాటికి అవే ఖరారు చేసుకోవలసి ఉంటుంది, అంతే కాదు, విడి గా ఒప్పందాల ను కుదుర్చుకోవలసి ఉంటుంది కూడా;

iii.      అందుబాటు లో ఉన్నటువంటి వృత్తిగత అనుభవాన్ని అధ్యయనం చేయడం కోసం దేశాల పత్రికారచయిత ల తాలూకు వృత్తిపరమైన సంఘాల మధ్య సమానమైనటువంటి, పరస్పర ప్రయోజనకరమైనటువంటి సహకారాన్ని పెంపొందించడం, దానితో పాటు మాస్ మీడియా రంగం లో సమావేశాల ను, చర్చాసభల ను, సభ లను నిర్వహించడం;

iv.      టెలివిజన్ కార్యక్రమాల ప్రసారం లో, రేడియో కార్యక్రమాల ప్రసారం లో సహాయపడటం, ఒక దేశం లోపలి ప్రాంతాలలోను, అవతలి పక్షం లోను చట్టబద్ధమైన వ్యాప్తి, సంపాదకీయ కార్యాలయాల తాలూకు సామగ్రి ని, సమాచారాన్ని- వాటి వ్యాప్తి ఒకవేళ అవతలి పక్షం దేశాల చట్ట నిబంధన ల ప్రకారం అనుమతించదగినవే అయిన పక్షం లో- చట్టబద్ధం గా ప్రసారం చేయడం;

v.      మాస్ మీడియా రంగం లో అనుభవాన్ని, నిపుణుల ను ఆదానం- ప్రదానం చేసుకోవడాన్ని ప్రోత్సహించడం, ప్రసార మాధ్యమ రంగ వృత్తినిపుణుల కు శిక్షణ ను ఇవ్వడం లో పరస్పర సహాయాన్ని సమకూర్చడం, ఈ రంగం లో కార్యకలాపాల ను నిర్వహిస్తున్నటువంటి సంస్థల కు, విజ్ఞాన శాస్త్రపరమైన పరిశోధన సంస్థల కు, విద్య సంస్థల కు మధ్య సహకారాన్ని పెంపొందించడం.

 


 

***



(Release ID: 1723770) Visitor Counter : 124