రక్షణ మంత్రిత్వ శాఖ
ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్ తో కొచ్చిలో ప్రవేశించిన ఐఎన్ఎస్ శార్దూల్
Posted On:
27 MAY 2021 8:37PM by PIB Hyderabad
ఆపరేషన్ సముద్ర సేతు II లో భాగంగా దక్షిణ నావల్ కమాండ్‌కు చెందిన భారతీయ నావికాదళ నౌక ఐఎన్ఎస్ శార్దూల్ ఐఎస్ఒ కంటైనర్లలో 80 మెట్రిక్ టన్నుల ద్రవరూపంలోని ఆక్సిజన్ ను దింపేందుకు 27 మే 21న కొచ్చి చేరుకుంది.
కోవిడ్-19కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో తోడ్పడేందుకు మెడికల్ ఆక్సిజన్ ను నింపిన క్రయోజెనిక్ కంటైనర్లను, వివిధ దేశాల నుంచి సంబంధిత వైద్య పరికరాలను రవాణా చేసేందుకు
భారతీయ నావికాదళం ఆపరేషన్ సముద్ర సేతు IIను ప్రారంభించింది. భారత ప్రభుత్వం, నావికాదళం దేశవ్యాప్తంగా ఉన్న ఆక్సిజన్ అవసరాన్ని తీర్చేందుకు చేపట్టిన కార్యకలాపాల్లో ఆపరేషన్ సముద్ర సేతు II ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ముందు వరుసలో డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, ట్యాంకర్లు, ఉభయచర నౌకలలు సహా యుద్ధనౌకలను మోహరించి కీలక పాత్ర పోషిస్తోంది.
ఆపరేషన్లలో భాగంగా ఐఎన్ఎస్ శార్దూల్ 270 మెట్రిక్ టన్నుల (ఎంటి) ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్‌ను కువైట్, యుఎఇ సహా 11 అంతర్జాతీయ ప్రమాణీకరణ సంస్థ (ఐఎస్ఒ) కంటైనర్లలో రెండు సెమీ ట్రయలర్లను, 1200 ఆక్సిజన్ సిలెండర్లను రవాణా చేసింది. నౌక న్యూమంగళూర్ పోర్టుకు 25 మే 2021న చేరుకుని, ఏడు ఐఎస్ఒ కంటైనర్లలో ఉన్న 190 మెట్రిక్ టన్నుల ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్‌ను దింపింది.
ఉభయచర ఓడ దళాలను, సాయుధ ట్యాంకులను, వాహనాలను, ఆయుధాలను ఉభయ చరల కార్యకలాపాల కోసం రవాణా చేసే సామర్ధ్యం కలిగి ఉంది. ఐఎన్ఎస్ బహుముఖ వేదిక. ఇది మానవీయ సహాయాన్ని చేపట్టడమే, విపత్తు ఉపశమన కార్యకలాపాలను చేపట్టే సామర్ధ్యం కలిగి ఉంది. భారతీయ నావికాదళానికి చెందిన కొచ్చి బేస్‌లో ఫస్ట్ ట్రైనింగ్ స్వ్కాడ్రన్ అనుబంధంగా ఉన్న ఈ ఓడ, గతంలో భారతీయ నావికాదళం చేపట్టిన బహుళ మానవతా సహాయ కార్యకలాపాలలో చురుకుగా పాలుపంచుకుంది. ఇందులో భాగంగా, మార్చి 2020లో మానవతా సహాయంగా మడగాస్కర్‌లోని అంటిసిరానానాకు 600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రవాణా చేయడం, భారతీయ నావికాదళ ఆపరేషన్ సముద్ర సేతు- 1లో భాగంగా జూన్ 2020లో కోవిడ్ 19 మహమ్మారి తొలి వేవ్ సందర్భంగా ఇరాన్ నుంచి 233 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది.
ఈ ఓడ గురువారం మధ్యాహ్నం కొచ్చి లో ప్వేశించి, కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ కింద ఐసిటిటి, వల్లార్‌పాదం వద్ద లంగరు దించింది. ఆక్సిజన్ కంటైనర్లను పోర్టు లో దింపి, కేరళ ప్రభుత్వానికి అప్పగించింది.
ఆపరేషన్ సముద్ర సేతు- 11లో ఐఎన్ఎస్ శార్దూల్‌ను మోహరించడం అన్నది కోవిడ్ 19కు వ్యతిరేకంగా దేశ ప్రజలు చేస్తున్న పోరాటానికి తోడ్పాటుగా హర్ కామ్ దేశ్ కే నామ్ (ప్రతి పనీ దేశంకోసం) అన్న స్ఫూర్తిని ప్రతిఫలిస్తూ దక్షిణ నావికాదళ కమాండ్ అంకితభావం, పట్టుదలను ప్రస్ఫుటం చేస్తోంది.
***
(Release ID: 1722367)
Visitor Counter : 168