వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రికార్డుస్థాయిలో 398.59 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎమ్‌టి) గోధుమలను సేకరించారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం రబీ మార్కెటింగ్ సీజన్ (ఆర్ఎంఎస్) సేకరణ మొత్తం389.92 ఎల్ఎమ్‌టీలను మించిపోయింది.
గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 14% ఎక్కువ గోధుమలను కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఆర్ఎంఎస్ గోధుమల సేకరణ వల్ల సుమారు 42.06 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు
కొనసాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కెఎంఎస్), రబీ మార్కెటింగ్ సీజన్ (ఆర్ఎంఎస్) 2020–-21 కోసం ఎంఎస్‌పీతో 776.11 ఎల్ఎమ్‌టిల వరిని కొన్నారు. దీంతో 115.43 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది.
ప్రభుత్వ సంస్థలు ఇప్పటివరకు మద్దతు ధరతో 6,99,015.49 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను, నూనె గింజలను సేకరించాయి.
Posted On:
27 MAY 2021 8:30PM by PIB Hyderabad
గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా (26.05.2021 వరకు) ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ , జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాల్లో ఆర్ఎంఎస్ 2021–-22 కోసం గోధుమల సేకరణ సజావుగా కొనసాగుతోంది. గత సంవత్సరం 350.06 ఎల్ఎమ్‌టి కొనుగోలు చేయగా ఈ ఏడాది 398.59 ఎల్ఎమ్‌టిల కంటే ఎక్కువ గోధుమలను కొన్నారు. (ఇది ఇప్పటి వరకు అధికం. ఇది మునుపటి రికార్డు.. 389.92 ఎల్ఎమ్‌టి ఆర్ఎంఎస్ 2020–-21 ను మించిపోయింది). సుమారు 42.06 లక్షల మంది రైతులు ఇప్పటికే కొనసాగుతున్న ఆర్ఎంఎస్ ధాన్య సేకరణ నుండి లబ్ధి పొందారు. వాళ్ల నుంచి రూ. 78,721.15 కోట్ల ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఈ నెల 26 వరకు... 776.11 ఎల్ఎమ్‌టిల వరి (ఖరీఫ్ పంట 706.52 ఎల్ఎమ్‌టిలు , రబీ పంట 69.59 ఎల్ఎమ్‌టిలు)ని కొన్నారు. గత ఏడాది ఇదేకాలంలో 712 ఎల్ఎంటీలు కొన్నారు. ఈ ఏడాది సుమారు 115.43 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. వీరి నుంచి మద్దతు ధరలతో1,46,530.16 కోట్ల విలువైన వరిని కొన్నారు.
రాష్ట్రాల ప్రతిపాదన ఆధారంగా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020–-21 & రబీ మార్కెటింగ్ సీజన్ 2021 కోసం ధరల మద్దతు పథకం (పిఎస్ఎస్) కింద 107.37 ఎల్ఎంటీల నూనె విత్తనాల కొనుగోలుకు అనుమతి లభించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ నుంచి నూనె గింజలను కొంటారు. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు , కేరళ రాష్ట్రాల నుంచి 1.74 ఎల్ఎమ్‌టిల ఎండు కొబ్బరి (శాశ్వత పంట) కొనుగోలుకు అనుమతులు వచ్చాయి. ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పప్పుధాన్యాలు, నూనెగింజలు , ఎండుకొబ్బరిని పిఎస్ఎస్ క్రింద సేకరించే ప్రతిపాదనలు అందగానే ఆమోదం లభిస్తుంది. తద్వారా ఈ పంటల (ఎఫ్ఏక్యూ గ్రేడ్)ను 2020-–21 సంవత్సరానికి ప్రకటిత ఎంఎస్పి వద్ద రిజిస్టర్డ్ రైతుల నుండి నేరుగా తీసుకుంటారు. అయితే ఆయా రాష్ట్రాల్లో పంట కోత కోతల కాలంలో ధరలు మద్దతు ధరల కంటే తక్కువ ఉంటే మాత్రమే సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు.. రైతుల ద్వారా, రాష్ట్ర నామినేటెడ్ ప్రొక్యూర్ ఏజెన్సీల ద్వారా ధాన్యాన్ని కొంటాయి.
26.05.2021 వరకు, ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా 6,99,015.49 మెట్రిక్ టన్నుల పెసళ్లు, మినుములు, కందులు, మసూర్, వేరుశనగ, ఆవాలు, సోయాబీన్లను మద్దతు ధరకు కొన్నారు. ఖరీఫ్ 2020-–21 & రబీ 2021 కింద ధాన్య సేకరణ వల్ల తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, హర్యానా, రాజస్థాన్లలో 4,16,126 మంది రైతులకు రూ.3,658.94 కోట్లు వచ్చాయి. 2020–-21 పంటల కాలంలో కర్ణాటక, తమిళనాడులలోని 3961 మంది రైతులకు లబ్ధి చేకూర్చే రూ .52.40 కోట్ల ఎంఎస్‌పి విలువ కలిగిన 5089 మెట్రిక్ టన్నుల ఎండుకొబ్బరిని (శాశ్వత పంట) కొన్నారు. 2021–-22 సీజన్ కొరకు, తమిళనాడు నుండి 51,000 మెట్రిక్ టన్నుల ఎండుకొబ్బరి కొనుగోలుకు అనుమతి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీల నుండి సేకరణ మొదలవుతాయి.
***
(Release ID: 1722359)
Visitor Counter : 141