విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఎన్‌హెచ్‌పీసీ కార్పొరేట్‌ కార్యాలయంలో కొవిడ్‌ పరీక్షలు, టీకాల శిబిరం నిర్వహణ

Posted On: 27 MAY 2021 8:01PM by PIB Hyderabad

ఎన్‌హెచ్‌పీసీ, తన కార్పొరేట్‌ కార్యాలయంలో కొవిడ్‌ పరీక్షలు, టీకాల శిబిరాన్ని నిర్వహించింది. కొవిడ్‌పై పోరాడదామన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పిలుపు మేరకు, కేంద్ర విద్యుత్‌, నూతన & పునరుత్పాదక శక్తి శాఖ, కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖల సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ ఆర్‌.కె.సింగ్‌ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఎన్‌హెచ్‌పీసీ ఏర్పాటు చేసింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు (45-60 వయస్సులవారు) మొత్తం 63 మందికి కొవిషీల్డ్‌ మొదటి డోసు టీకాను ఈ కార్యక్రమంలో వేశారు. ఎన్‌టీపీసీ ఒప్పంద కార్మికులు, ఒప్పంద భద్రత సిబ్బందికి కూడా టీకాలు వేశారు.
 
    ఉద్యోగులకు కొవిడ్‌ టీకాలు వేయడంతోపాటు, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు కూడా చేశారు.

    ఫరీదాబాద్‌లోని మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా, ఫరీదాబాద్‌ ఈఎస్‌ఐ డిర్పెన్సరీ టీకాలు వేసింది. కొవిడ్‌పై కేంద్ర మార్గదర్శకాలు పాటించి, సంపూర్ణ రక్షణ మధ్య టీకాల కార్యక్రమాన్ని ఎన్‌హెచ్‌పీసీ కార్పొరేట్‌ కార్యాలయంలో నిర్వహించారు.
 

****



(Release ID: 1722354) Visitor Counter : 152


Read this release in: English , Urdu , Hindi , Tamil