నాడు పోస్టు చేయడమైనది:
27 MAY 2021 5:24PM by PIB Hyderabad
మదర్‌సన్ సమూహ సంస్థల పునర్వవస్థీకరణకు సంబంధించి మదర్‌సన్ సుమి సిస్టమ్స్ లిమిటెడ్ (ఎంఎస్ఎస్ఎల్), సంవర్దన మదర్‌సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (శామిల్), సుమిటోమో వైరింగ్ సిస్టమ్స్ లిమిటెడ్ (ఎస్‌డబ్ల్యూఎస్) గ్రీన్ ఛానెల్ ద్వారా దాఖలు చేసిన నోటీసును కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అందుకుని, సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.
ఈ క్రింది పద్ధతుల ద్వారా పునర్వవస్థీకరణ జరుగుతుంది:
భారత్‌లో తనకున్న మొత్తం వాహన వైరింగ్ హార్నెస్ వ్యాపారాన్ని కొత్తగా నెలకొల్పిన, తన సంపూర్ణ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన మదర్‌సన్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్‌డబ్యూఐఎల్)కు ఎంఎస్‌ఎస్‌ఎల్ అప్పగిస్తుంది.
ఎంఎస్‌ఎస్‌ఎల్‌లో శామిల్ విలీనం అవుతుంది. ఎంఎస్‌ఎస్‌ఎల్ పేరును సంవర్దన మదర్‌సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (న్యూ శామిల్)గా మారుస్తారు.
మదర్‌సన్ సంస్థల సమూహంలో ఎంఎస్‌ఎస్‌ఎల్ ఒక ప్రధాన సంస్థ. వాహన భాగాల తయారీ సంస్థ ఇది. వాహన భాగాలైన వైరింగ్ హార్నెస్, అద్దాలు, అచ్చుపోసిన, పాలిమర్ ఉత్పత్తులను తయారు చేసే వ్యాపారాన్ని ఈ సంస్థ చేస్తోంది.
ఎంఎస్‌ఎస్‌ఎల్‌లో శామిల్ అతిపెద్ద వాటాదారు. మదర్‌సన్ సమూహ సంస్థలకు కార్యాచరణ, వ్యూహాత్మక, నిర్వహణ సాయాన్ని ఈ సంస్థ అందిస్తుంది. వాహనాల కాంతి వ్యవస్థలు, ఇంజిన్‌లోని అంతర్గత భాగాలు, సహాయక పరికరాలు వంటి తయారీ వ్యాపారాన్ని ఈ సంస్థ నిర్వహిస్తోంది.
ఎస్‌డబ్ల్యూఎస్ జపాన్‌కు చెందిన సంస్థ. వాహనాల వైరింగ్ హార్నెస్, వాటి భాగాలు, ఎలక్ట్రిక్ వైర్లు, ఎలక్ట్రిక్ విడిభాగాలు, ఎలక్ట్రిక్ వాహనాల భాగాలను ఈ సంస్థ తయారు చేసి విక్రయిస్తుంది.
****