రక్షణ మంత్రిత్వ శాఖ
భారత తీర రక్షక దళం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలు
యాస్ పెను తుపాను ఒరిస్సా తీరాన్ని తాకిన సమయంలో పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను రక్షించగలిగాయి..
Posted On:
26 MAY 2021 8:56PM by PIB Hyderabad
ఒడిషాలోని దక్షిణ బాలాసోర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో యాస్ పెనుతుపాను 2021 మే 26న తీరాన్ని తాకింది.
తూర్పుతీరంలో , అండమాన్ నికోర్ దీవులలో భారత తీర రక్షక దళం తీసుకున్న విస్తృత ముందస్తు చర్యలు ప్రజల ప్రాణాలు రక్షించడంలో, ఆస్తుల ను కాపాడడంలో సత్ఫలితాలనిచ్చాయి.
తీర రక్షకదళం తీసుకున్న ముందస్తు చర్యలలో భాగంగా , చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లిన 265 మత్స్యకార పడవలను సురక్షితంగా తీరానికి తీసుకువచ్చింది. అలాగే తీర రక్షకదళం సూచనల మేరకు ఒడిషా సముద్ర తీర ప్రాంతంలో, పశ్చిమబెంగాల్ తీరంలో లంగరు వేసిన నౌకలు సురక్షిత ఆశ్రయం పొందాయి. అలాగే సింగిల్ పాయింట్ మూరింగ్ (ఎస్‌పిఎం ) కార్యకలాపాలను నిలిపివేశారు. దీనితో ఏ వాణిజ్య నౌకకు సంబంధించి ఎలాంటి నష్టం జరిగినట్టు సమాచారం అందలేదు.
తీరంలోని, సముద్రంలోని ఐసిజి యూనిట్లు అన్నీ తుపాను అనంతరం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తూర్పుతీరంలో సర్వసన్నద్ధంగా ఉన్నాయి. ఐసిజి కి చెందిన మూడు నౌకలు గాలింపు, సహాయక చర్యల కోసం వ్యూహాత్మకంగా సముద్రంలో ఉన్నాయి. ఇవి ఒడిషా, పశ్చిమబెంగాల్ తీరానికి దగ్గరగా ఉన్నాయి. తీరానికి సమీపంలో పరిస్తితులను అంచనా వేసేందుకు ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేసేందుకు వీటిని సిద్ధంగా ఉంచారు.
పశ్చిమబెంగాల్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఐసిజి తమ విపత్తు సహాయ బృందాలు (డిఆర్‌టి)లను సహాయం కోసం దిఘా, కాన్‌టాయ్‌లలో ఉంచింది. భారత తీర రక్షక దళానికి చెందిన ఎయిర్ కుషన్ వాహనం పశ్చిమ బెంగాల్ లోని నయచారాలో చిక్కుకు పోయిన 100 మందిని రక్షించింది.
సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాన్‌టయ్ లో స్తానికులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఐసిజి విపత్తు సహాయక బృందాలు సహాయం చేస్తున్నాయి. ఇతర ఐసిజి డిఆర్‌టిలు నీళ్లమీద తేలే పడవలు, లైఫ్ బోయ్స్, లైఫ్ జాకెట్లను పశ్చిమ బెంగాల్ , ఒడిషాలలో సిద్దంగా ఉంచాయి. వీటిని రాష్ట్ర అధికారుల అవసరాల మేరకు వినియోగించేందుకు సిద్ధంగా ఉంచారు. వైద్య బృందాలు, అంబులెన్సులను కూడా తక్షణ తరలింపునకు వీలుగా సిద్దంగా ఉంచారు.
రాష్ట్ర పాలనా యంత్రాంగం, స్థానిక అధికారులు, పోర్టులు, ఆయిల్ రిగ్ ఆపరేటర్లు, షిప్పింగ్ విభాగం, ఫిషరీస్ అధికారులు, మత్స్యకార అసోసియేషన్లు, ఇతరులతో కలసి పడవలు, భారీ నౌకలు, ఫిక్స్‌డ్ ప్లాట్‌ఫారంలు, ఇతర ఆస్తుల రక్షణకు సన్నిహిత సమన్వయంతో ఐసిజి పనిచేస్తున్నది.
***
(Release ID: 1722045)
Visitor Counter : 196