హోం మంత్రిత్వ శాఖ
జాతీయ విపత్తు నిర్వహణ దళ అకాడెమీ (ఎన్‌డిఆర్ఎఫ్), నాగ్‌పూర్ లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (ఎస్ఎజి)లో డైరెక్టర్ పదవి సృష్టికి కేబినెట్ ఆమోదం
Posted On:
25 MAY 2021 1:16PM by PIB Hyderabad
జాతీయ విపత్తు నిర్వహణ దళ అకాడెమీ (ఎన్‌డిఆర్ఎఫ్), నాగ్‌పూర్ లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (ఎస్ఎజి)లో (01) డైరెక్టర్ పదవిని సృష్టించాలన్న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
ఎన్‌డిఆర్ఎఫ్ అకాడెమీ డైరెక్టర్ పదవిని సృష్టించిడం ద్వారా సంస్థ ను ఉద్దేశించిన లక్ష్యాల దిశగా నడిపించగల నాయకత్వ నిర్వహణ,బాధ్యతలను అనుభవం కలిగిన సీనియర్ అధికారికి అప్పచెప్తారు. ప్రతి ఏడాదీ ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్, సిడి వాలంటీర్లు, ఇతర భాగస్వాములు, సార్క్, ఇతర దేశాలకు చెందిన విపత్తు 5000మంది సిబ్బందికి నైపుణ్యాల ఆధారిత ఆచరణాత్మక శిక్షణను అకాడెమీ అందించనుంది. భాగస్వాముల మారుతున్న అవసరాలు, కావలసిన రీతికి అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలను విశ్లేషించి, మెరుగుపరిచేందుకు కూడా సంస్థ పని చేస్తుంది. ఎన్‌డిఆర్ఎఫ్, ఎస్‌డిఆర్ఎఫ్, ఇతర భాగస్వాములకు విపత్తు నిర్వహణ/స‌్పందనపై ఇచ్చే శిక్షణ ప్రామాణికతను ఇది అత్యంత మెరుగుపరుస్తుంది.
నేపథ్యంః
జాతీయవిపత్తు నిర్వహణ దళ అకాడెమీని నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజీలో (ఎన్‌సిడిసి) విలీనం చేయడం ద్వారా 2018లో నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేశారు. అకాడెమీ ప్రధాన క్యాంపస్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అప్పటివరకూ అది ప్రస్తుత ఎన్‌సిడిసి క్యాంపస్ నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. అకాడెమీ ప్రస్తుతం జాతీయ విపత్తు నిర్వహణ దళాలు (ఎన్‌డిఆర్ఎఫ్)/ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు (ఎస్‌డిఆర్ఎఫ్)/ సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు, ఇతర భాగస్వాములకు శిక్షణను అందిస్తోంది. ఇది ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ శిక్షణా సంస్థగా ఎదుగుతుందని భావిస్తున్నారు. ఇది సార్క్, ఇతర దేశాల విపత్తు నిర్వహణ దళ సిబ్బందికి కూడా ప్రత్యేక శిక్షణను ఇస్తుంది.
***
(Release ID: 1721584)
Visitor Counter : 159