విద్యుత్తు మంత్రిత్వ శాఖ
బెంగళూరులో కోవిడ్-19 టీకాల క్యాంప్‌ను ఏర్పాటు చేసిన పవర్‌గ్రిడ్ సంస్థ
Posted On:
24 MAY 2021 3:54PM by PIB Hyderabad
కోవిడ్-19 మహమ్మారి నుండి తమ ఉద్యోగులు, కుటుంబాల వారిని కాపాడుకోవటానికి భారత ప్రభుత్వానికి చెందిన మహారాత్న సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవర్ గ్రిడ్) దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కోవిడ్ టీకా శిబిరాలను నిర్వహిస్తోంది. పవర్‌గ్రిడ్ సంస్థకు చెందిన అన్ని సంస్థలలో ఈ టీకా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆర్‌హెచ్‌క్యూ, యలహంక సబ్ స్టేషన్, ఆర్‌పీటీ హెచ్‌వీడీసీ కార్యాలయం, ఏఎంసీ ఫ్రంట్‌లైన్ యోధుల బృందానికి చెందిన ఉద్యోగులు వారిపై ఆధారపడిన వారు, ఆధారపడని కుటుంబసభ్యులకు కోవిడ్ నుంచి రక్షణ కల్పించేందుకు గాను పవర్‌గ్రిడ్ బెంగుళూరులోని సదరన్ రీజియనల్-2 ప్రాంతీయ కార్యాలయంలో ఒక కోవిడ్ టీకా శిబిరాన్ని నిర్వహించింది. బెంగళూరులోని స్థానిక మణిపాల్ హాస్పిటల్స్ వారి సహకారంతో సుమారు 200 మందికి ఈ శిబిరంలో టీకాలు వేశారు.
***
(Release ID: 1721326)
Visitor Counter : 119