శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సార్స్-కోవ్-2 ను ఎదుర్కోడానికి పనికివచ్చే, యు.వి. క్రిమిసంహారక సాంకేతిక పరిజ్ఞానాన్ని 27 దేశీయ తయారీదారులకు బదిలీ చేసిన - సి.ఎస్.ఐ.ఆర్. సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సి.ఎస్.ఐ.ఓ)
Posted On:
22 MAY 2021 6:43PM by PIB Hyderabad
గాలి తుంపరలు (ఏరోసోల్స్) ద్వారా సార్స్-కోవ్-2 గాలి ద్వారా వ్యాపిస్తున్నట్లు ఆధారాలు పెరుగుతున్నాయి. వీటిని ఇప్పుడు అంతర్జాతీయ ఏజెన్సీలైన డబ్ల్యూ.హెచ్.ఓ., ఆర్.ఈ.హెచ్.వి.ఏ. (రెహ్వా), ఏ.ఎస్.హెచ్.ఆర్.ఏ.ఈ. (ఆశ్రయే) తో సహా, అనేక దేశాలలోని ఆరోగ్య సంస్థలు, అధికారులు కూడా ఇప్పుడు ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. భవనాల్లో గాలి ద్వారా ఇది వ్యాపిస్తే చాలా పెద్ద ప్రమాదం. విశేషమేమిటంటే, సి.ఎస్.ఐ.ఆర్. ఆధ్వర్యంలోని - సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సి.ఎస్.ఐ.ఆర్-సి.సి.ఎం.బి); ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ (సి.ఎస్.ఐ.ఆర్-ఐ.ఎం.టి.ఈ.సి.హెచ్) ప్రయోగశాలలు చేసిన పరిశోధనల ద్వారా, సార్స్-కోవ్-2 కు చెందిన వైరల్ కణాలను ఒక గది నుండి సోకిన వ్యక్తుల నుండి 2 గంటల నిష్క్రమణ తర్వాత కూడా గాలిలో కనుగొనవచ్చునని, 2020 సెప్టెంబరు నెలలో, ప్రయోగాత్మకంగా తెలియజేశాయి. కొన్ని మీటర్ల కన్నా ఎక్కువ దూరంలో కూడా (ఎస్.సి. మోహరిర్ ఎటల్., 2020) సార్స్-కోవ్-2 కు చెందిన వైరల్ కణాలు గాలిలో వ్యాప్తి చెందుతున్నట్లు ఈ ప్రయోగశాలలు వెల్లడించిన ఆధారాలు బలపరిచాయి.
https://www.medrxiv.org/content/10.1101/2020.12.30.20248890v1)
ఈ అధ్యయనాల ఆధారంగా మరియు వైరల్ క్రిముల సంహారానికి తగిన సమర్థవంతమైన పరిష్కారాల అవసరాన్ని గుర్తించి, హెచ్.వి.ఎ.సి. వ్యవస్థల కు చెందిన గాలి-నాళాలలో కనీస జోక్యంతో అమర్చడానికి వేగవంతమైన వాయు ప్రవాహాలను నిర్వహించడానికి అధిక తీవ్రతలతో సమర్థవంతమైన "ఫెయిల్-ప్రూఫ్ రెట్రో-ఫిట్" పరికరాన్ని, పారిశ్రామిక, వాణిజ్య భవనాల లోపల విస్తృతంగా ఉపయోగించే విధంగా, అభివృద్ధి చేయడం, ప్రస్తుతం, ఒక సవాలుగా నిలిచింది. ఇందుకోసం, ఒక "యు.వి-సి. ఎయిర్ డక్ట్ క్రిమిసంహారక వ్యవస్థ" ను, సి.ఎస్.ఐ.ఆర్-సి.ఎస్.ఐ.ఓ. అభివృద్ధి చేసింది. ఈ క్రిమిసంహారక వ్యవస్థను ఆడిటోరియంలు, పెద్ద సమావేశ మందిరాలు, తరగతి గదులు, మాల్స్ మొదలైన వాటిలో ఉపయోగించవచ్చు. ఇది ప్రస్తుత మహమ్మారి సమయంలో ఇండోర్ కార్యకలాపాలకు సాపేక్షంగా సురక్షితమైన వాతావరణాన్ని అందిస్తుంది. అవసరమైన గాలి ప్రసరణ బాగా ఉండే విధంగా చర్యలు, అవసరమైన భద్రత, వినియోగదారు మార్గదర్శకాలతో పాటు, పరీక్షించిన జీవ-భద్రతా ప్రమాణాలు కలిగి, గాలి తుంపరలు (ఏరోసోల్) లో ఉన్న సార్స్-కోవ్-2 వైరస్ ను నిష్క్రియం చేయడం వంటి అవసరాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయబడింది. 99 శాతం కంటే ఎక్కువగా వైరస్ లు , బ్యాక్టీరియా, ఫంగస్ తో పాటు, ఇతర జీవ-గాలి తుంపరలు (బయో-ఏరోసోల్స్) మొదలైన వాటిని, ఈ యు.వి-సి., తగిన మోతాదులో, 254 ఎన్.ఎమ్. యు.వి. కాంతిని ఉపయోగించి, నిష్క్రియం చేస్తుంది. మహమ్మారి యొక్క ప్రస్తుత దశలో కనిపించే ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం కలిగించడానికి కూడా, యు.వి-సి. వాడకం సహాయపడుతుంది.
సి.ఎస్.ఐ.ఆర్-సి.ఎస్.ఐ.ఓ. అభివృద్ధి చెందిన ఉత్పత్తి 99 శాతం కంటే ఎక్కువ క్రిమి సంహారక కోసం పరీక్షించబడుతుంది. భవనాలు, రవాణా వాహనాలు మరియు ఇతర స్పిన్ ఆఫ్ అనువర్తనాల యొక్క ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లకు (ఏ.హెచ్.యు) రెట్రోఫిట్ పరిష్కారంగా ఉపయోగించవచ్చు. యు.వి-సి. అనేది శక్తి సామర్థ్య వ్యవస్థ, కాయిల్స్ ద్వారా గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, గది లోపలి గాలి నాణ్యతను పెంచుతుంది, తక్కువ నిర్వహణ అవసరం, ఏ.హెచ్.యు. నాళాలు ఉన్న ప్రస్తుత వ్యవస్థతో రెట్రోఫిట్ చేయడం సులభం మరియు ప్రారంభించడానికి ఖర్చు తక్కువగా ఉంటుంది. వాణిజ్యీకరించిన ప్రమాణాలు మరియు ధృవీకరణలతో ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
సి.ఎస్.ఐ.ఆర్-సి.ఎస్.ఐ.ఓ. ఈ క్రింది కంపెనీలకు సాంకేతికతను బదిలీ చేసింది:
1. ఆర్కో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
2. ఫ్లెక్సాథర్మ్ ఎక్స్‌పాన్లో ప్రై. లిమిటెడ్, వడోదర, గుజరాత్ - 390010
|
3. ఏయాన్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై, ఇండియా.
|
4. శ్రీసన్ టెక్నాలజీస్ ప్రైవేట్. లిమిటెడ్ నాసిక్, మహారాష్ట్ర
|
5. రియాజ్ ఎలక్ట్రో-కంట్రోల్స్ ప్రవేటు లిమిటెడ్, గురుగ్రామ్, హర్యానా
|
6. సరస్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సికింద్రాబాద్
|
7. ఇండికేర్ హెల్త్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూ ఢిల్లీ
|
8. డెవిన్ టెక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీస్, జలంధర్, పంజాబ్
|
9. శ్రీయాస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, తెలంగాణ
|
10. ఓజోన్ రీసెర్చ్ & అప్లికేషన్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, నాగ్‌పూర్
|
11. ఎలైట్ ఎయిర్ టెక్నిక్స్ ప్రైవేట్. లిమిటెడ్ బహదూర్ గఢ్, హర్యానా
|
12. ఎయిరిఫిక్ సిస్టమ్స్ ప్రైవేట్. లిమిటెడ్, నోయిడా
|
13. క్వాలిటీ నీడ్స్ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, భివాడి, అల్వార్ జిల్లా, రాజస్థాన్.
|
14. టిసియోన్-హెచ్.ఎస్.ఇ. ఎల్.ఎల్.పి., చింగవనం పి.ఒ., కొట్టాయం, కేరళ.
|
15. ఆల్ఫా లీనియర్, పీన్యా ఇండస్ట్రియల్ ఎస్టేట్, బెంగళూరు.
|
16. కోయ్నా ఇంజనీర్స్, నాసిక్.
|
17.ఆల్ట్రాఫ్రెష్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై.
|
18. సెనౌరా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్.
|
19. ఐడియా మైన్స్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ ప్రై. లిమిటెడ్, గౌతమ్ బుద్ధ నగర్, ఉత్తర ప్రదేశ్
|
20. పెంగ్విన్స్ ఇండియా , రూర్కెలా, సుందర్ గఢ్, ఒడిశా.
|
21. సాఫ్ట్ రేస్ పవర్ సొల్యూషన్స్, తిరువనంతపురం, కేరళ.
|
22. కిరిట్ ఇంజనీరింగ్, జల్గావ్, మహారాష్ట్ర.
|
23. చోళ జియో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, తంజావూరు, తమిళనాడు.
|
24. బి.డి.ఎస్. డెకార్ & ప్రిఫాబ్ ప్రైవేట్ లిమిటెడ్, చండీ గఢ్.
|
25. లడ్డ ఎంటర్ప్రైజెస్ అకోలా, నాగ్‌పూర్.
|
26. సుకృత్ యు.వి. సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పూణే.
|
27. ఏ.బి.ఎస్. ఎయిర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, గుర్గావ్, హర్యానా.
|
28. యునిసెం ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు.
|
డాక్టర్ హ్యారీ గార్గిస్ నేతృత్వంలోని ఫాబ్రియోనిక్స్ విభాగం అభివృద్ధి చేసిన ఈ సాంకేతక పరిజ్ఞానం ఈ సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా విస్తృత లభ్యత తో విస్తరించడానికి ఇప్పుడు అందుబాటులో ఉందని సి.ఎస్.ఐ.ఆర్-సి.ఎస్.ఐ.ఓ. డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.అనంత రామకృష్ణ అన్నారు. ఇతర పరిస్థితుల కోసం డాక్టర్ గార్గ్ యొక్క బృందం మరింత యు.వి. ఆధారిత పారిశుధ్య ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోంది. అల్ట్రా వైలెట్ లైట్-బేస్డ్ పరిష్కారాలను ఏర్పాటు చేసినట్లయితే, ప్రజల విశ్వాసాన్ని పెంచుతుంది. లాక్-డౌన్ / కర్ఫ్యూల సడలింపుకు తగిన మార్గదర్శకాలను జారీ చేసినప్పుడు, పని ప్రదేశాలు, ప్రజా రవాణా, విద్యా సంస్థలకు తిరిగి రావడానికి వీలు కల్పిస్తుంది.
యు.వి-సి. ఎయిర్ డక్ట్ క్రిమిసంహారక వ్యవస్థ
*****
(Release ID: 1721021)
Visitor Counter : 220