రక్షణ మంత్రిత్వ శాఖ
తౌక్టే తుఫానులో శోధన, బాధితులను కాపాడే కార్యక్రమాలపై తాజా సమాచారం
Posted On:
18 MAY 2021 8:12PM by PIB Hyderabad
ముంబయి నుండి 35 నాటికల్ మైళ్ల (ముంబై ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ ఏరియా ప్రాంతంలో) దూరంలో మునిగిపోయిన బార్జ్ పీ-305 కోసం శోధన, బాధితులను
కాపాడే (ఎస్‌ఐఆర్) కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఎస్ఐఆర్ చర్యల్ని చేపట్టడం కోసం ఇండియన్ నావల్ షిప్స్ బియాస్, బెట్వా, టెగ్ ఐఎన్ఎస్ కొచ్చి మరియు కోల్‌కతాతో జతకూడాయి. నావికాదళ హెలికాప్టర్లు ఈ ప్రాంతంలో వైమానిక శోధనలను కొనసాగిస్తున్నారు. 17 మే 2021 తేదీ మొదలు ఎస్ఏఆర్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 180 మంది ప్రాణాలను కాపాడారు.
మరో ఆపరేషన్‌లో ముంబయికి ఉత్తరాన ఉన్న జీఏఎల్ కన్‌స్ట్రక్టర్ సిబ్బందిని రక్షించడానికి భారత నేవీ సీకింగ్ హెలికాప్టర్ సేవలను ప్రారంభించబడింది. జీఏఎల్ కన్‌స్ట్రక్టర్ యెక్క 35 మంది సిబ్బందిని హేలో రక్షించింది. గుజరాత్ తీరంలో(పిపావావ్) 15-20 నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్న సపోర్ట్ స్టేషన్ 3, గ్రేట్ షిప్ అదితి మరియు డ్రిల్ షిప్ సాగర్ భూషణ్ అనే మూడు ఓడల కోసం గుజరాత్ తీరంలో ఎస్ఏఆర్ ప్రయత్నాలు పురోగతిలో ఉన్నాయి. ఐఎన్ఎస్ తల్వార్ ఈ ప్రాంతానికి చేరుకుని, ఎస్ఏఆర్ ప్రయత్నం సమన్వయం కోసం 'ఆన్-సీన్ కోఆర్డినేటర్' విధుల్ని చేపట్టింది. వెస్ట్రన్ నావల్ కమాండ్, ఓఎన్‌జీసీ మరియు డీజీ షిప్పింగ్ సమన్వయంతో, సహాయం అందించడానికి ఐదు టగ్‌లను మళ్లించింది. దీంతో గ్రేట్ షిప్ అదితి మరియు సపోర్ట్ స్టేషన్ 3 యాంకర్‌ను వదలగలిగాయి. మరోవైపు ఓఎస్‌వీ యొక్క సముద్రా సేవక్ మరియు ఎస్‌వీ చీల్‌లు సాగర్ భూషణ్‌కు అనుసంధానించబడి ఉన్నాయి. ప్రస్తుతం వీటి పరిస్థితి స్థిరంగా ఉంది. సముద్రం 4-5 మరియు 25-30 నాట్ల (లసుమారు గంటకు 35 - 55 కి.మీ.) గాలులతో సముద్రం చాలా అల్లకల్లోలంగా ఉంటోంది. ఈ స్థితి ఎస్ఏఆర్ కార్యకలాపాలలో పాల్గొంటున్న ఓడలు మరియు విమానాలకు సవాలుగా నిలుస్తోంది.
*****
(Release ID: 1719847)
Visitor Counter : 180