సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
జమ్ము , శ్రీనగర్ లకు కోవిడ్ సంబంధిత మెటీరియల్‌ను వేరు వేరుగా ఆయా ప్రాంతాలకు పంపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
18 MAY 2021 6:59PM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ఛార్జి), ప్రధానమంత్రి కార్యాలయం, ప్రజాఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు కోవిడ్ సంబంధిత సామగ్రిని జమ్ము, శ్రీనగర్ లకు పంపారు.
ముఖానికి మాస్కులు, శానిటైజరర్లు, ఇతర ఉపకరణాలను వేరు వేరు కిట్లతో గల సామగ్రిని డాక్టర్ జితేంద్ర సింగ్ పంపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఇంతకు ముందు పంపిన కోవిడ్ సంబంధిత సామగ్రిని ఉధంపూర్, కథువా, దోడా లోక్‌సభ నియోజకవర్గంలోని అన్ని ఆరు జిల్లాలకు పంపినట్టు తెలిపారు. ఇలాంటి సామగ్రిని జమ్ము కాశ్మీర్‌లలోని ఇతర ప్రాంతాలకు పంపేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు.
స్వచ్ఛంద వనరుల నుంచి పెద్ద మొత్తంలో సరఫరాలను సమకూర్చుకోవడం అంత సులభమైనది కాదని, అయితే, భావసారూప్యత కలిగిన వారి సహకారంతో జమ్ముకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు వీలైనంత వరకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్ పరిస్థితుల కారణణంగా మెటీరియల్ రవాణా, దానిని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయడం అంత సులభమైన విషయం కాదని అన్నారు. ప్రత్యేకించి జమ్ము కా విభిన్న భౌగోళిక పరిస్థితులు, క్లిష్టమైన ప్రదేశాల వల్ల
సహచరులు, యువకార్యకర్తల సహాయంతో కోవిడ్ మెటీరియల్‌ను సాధ్యమైన చోటికల్లా పంపగలుగుతున్నట్టు ఆయన తెలిపారు.
కోవిడ్ బారినపడి ఆస్పత్రిలో ఉండి కోలుకుంటూ కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము,కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాలలోని వివిధ స్థాయిల వారితో సంబంధాలు కొనసాగిస్తూ వచ్చినట్టు ఆయన తెలిపారు. జమ్ము ,కాశ్మీర్‌లోని వివిధ జిల్లాల పాలనాయంత్రాంగాలు, అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల వైద్య అధికారులతో అలాగే సౌరాలోని షేర్ ఎ కాశ్మీర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్‌కెఐఎంఎస్) అధికారులతో క్రమంతప్పకుండా సంబంధాలు కొనసాగిస్తూ వచ్చినట్టు ఆయన తెలిపారు. ఐదురోజులపాటు వరుసగా జమ్ము లోని ప్రభుత్వ వైద్యకళాశాల అధికారులతో సంప్రదించిన మీదట అక్కడ గల కోవిడ్ సదుపాయాలు ఎంతగానో ప్రయోజనం పొందాయని, వాటి పనితీరులో మరింత సమన్వయం ఉందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు..
బిజెపి కార్యకర్తలు, పలు వాలంటరీ సంస్థలు చేపట్టిన సామాజిక కార్యక్రమాలను మంత్రి అభినందించారు.లోపాలు ఉన్నాయంటూ ఆరోపణలు చేస్తున్న వారు ఆరోపణలు పక్కనపెట్టి ఏవైనా లోపాలు ఉంటే వాటిని చక్కదిద్దేందుకు ముందుకు రావాలని ఆయన అన్నారు.
విభేదాలు పక్కనపెట్టి , కోవిడ్ పై పోరాటంలో రాజకీయ పార్టీలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో ఐక్యంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారి ఈ శతాబ్దపు విపత్తు అని అందరం కలసికట్టుగా దీనిని ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు.
***
(Release ID: 1719790)
Visitor Counter : 180